Naga Panchami Today Episode జ్వాలలోకి గరుడ శక్తి ప్రవేశిస్తుంది. దీంతో బయటకు వచ్చి పంచమిని ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని సీరియస్‌గా అడుగుతుంది. పంచమి కడుపులోని నాగశక్తి, జ్వాల కడుపులోని గరుడ శక్తి రియాక్ట్ అవుతాయి. దీంతో పంచమి కూడా జ్వాల వైపు సీరియస్‌గా చూస్తుంది. ఇంట్లో వాళ్లు అందరూ అక్కడికి వస్తారు. మరోవైపు కరాళి కూడా ఇదంతా చూస్తుంటుంది.
జ్వాల: సిద్ధుడు చెప్పింది విన్నావ్ కదా ఇంకా ఈ ఇంట్లో ఉన్నావ్ ఏంటి. ఈ ఇంట్లో మన ఇద్దరిలో ఒక్కరే ఉండాలి. ముందుగా ఈ ఇంట్లో నేను కాలిపెట్టిన దాన్ని. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావ్.
పంచమి: ఎప్పుడు వచ్చినా నేను ఈ ఇంటి కోడలినే. నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది.
జ్వాల: నా సంగతి నీకు తెలీదు. నాతో పోటీ పడితే నిన్ను ప్రాణాలతో ఉంచను.
వరుణ్: జ్వాల.. జ్వాల ఏం మాట్లాడుతున్నావ్.
పంచమి: నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వే ఈ ఇంటి నుంచి వెళ్లు.
జ్వాల: ఏంటే నన్నే బెదిరిస్తున్నావ్.
పంచమి: నా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను.
జ్వాల పంచమిని కొట్టడానికి చేయి ఎత్తితే పంచమి అడ్డుకుంటుంది. కోపంతో పంచమి జ్వాలని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. పంచమి ఆవేశం చూసి అందరూ షాక్ అయిపోతారు. జ్వాల కోపంతో రగిలిపోతుంది. వైదేహి పంచమిని పిలిస్తే పంచమి నన్ను ఎవరూ ఆపకండి ఈ రోజు దీని అంతు చూస్తా అంటుంది. దీంతో జ్వాల నువ్వేంటే నా అంతు చూసేదని పంచమి గొంతు పట్టుకుంటుంది. దీంతో పంచమి కూడా జ్వాల గొంతు పట్టుకుంటుంది. అందరూ ఎంత ఆపినా ఇద్దరూ తగ్గరు. దీంతో రఘురాం గట్టిగా అరిచి కోడళ్లను కంట్రోల్ చేస్తాడు.
వైదేహి: అసలు ఇది ఇళ్లు అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా.
జ్వాల: ఆ మాట దానికి చెప్పు.
పంచమి: మర్యాదగా మాట్లాడు. అది ఇది అంటే నాలుక కోస్తాను.
జ్వాల: నువ్వెలా బిడ్డను కంటావో నేను చూస్తాను.
పంచమి: నీ జేజమ్మే వచ్చినా నా బిడ్డని తాకలేరు. నా బిడ్డను ఏదైనా జరిగితే ఎవర్నీ ప్రాణాలతో ఉంచను.
రఘురాం: మీరు ఇద్దరూ ఏం మాట్లాడకండి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
జ్వాల: మామయ్య ఈ ఇంట్లో నేనో అదో ఎవరో ఒక్కరే ఉండాలి. నేను ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం జరిగితే మళ్లీ తిరిగిరాను.
వైదేహి: ఆ స్వామిజీ చెప్పింది మన ఇంట్లో అక్షరాల మన కళ్లముందు జరుగుతుంది. మీ ఇద్దరిని ఒక చోట ఉంచడం వల్లే ఇది జరుగుతుంది.
పంచమి: నా బిడ్డ కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమే. నాకు నా బిడ్డే ముఖ్యం.
శబరి: అమ్మా పంచమి నా మాట విని నీకు కాన్పు అయ్యే వరకు నీ పుట్టింటిలో ఉండటం మంచిదని అనిపిస్తుంది. ఈ గుంపులో నువ్వు ఉండొద్దమ్మ నీ బిడ్డ క్షేమం కోరి చెప్తున్నా.
పంచమి: నా బిడ్డ కోసం మా పుట్టింటికి వెళ్లడానికైనా నేను సిద్ధమే.
వైదేహి: ఆ పని చేయమ్మ ఇప్పుడే కారు ఏర్పాటు చేస్తా. మీరు లోపలికి వెళ్లండి.
శబరి: అమ్మా నన్ను క్షమించమ్మా ఆ జ్వాల వాలకం చూసి నాకు భయం వేసింది అందుకే మీ అమ్మగారి ఇంటికి వెళ్లమని చెప్పాను. మీ పుట్టింటి దగ్గర నువ్వు పండంటి బిడ్డను కనాలి.
మరోవైపు జ్వాల ఆలోచిస్తూ ఉంటే అక్కడికి చిత్ర వస్తుంది. పంచమని అలాగే వదిలేయకూడదని అంటుంది. దీంతో జ్వాల ఆ పంచమి నన్నే చంపేస్తా అంది అంటే నేను దాన్ని చంపే తీరాలి అని అంటుంది. దీంతో చిత్ర అక్క కడుపు పొగొట్టడం వరకు అయితే ఓకే కానీ చంపొద్దని అంటుంది. కానీ జ్వాల ఒప్పుకోదు. పంచమి, దాని బిడ్డ ఇద్దరూ ఉండకూడదు అని అంటుంది. ఇక జ్వాల రౌడీకి కాల్ చేసి పంచమిని చంపేసి శవాన్ని లోయలో పడేసి ఆనవాళ్లు లేకుండా చేయమని చెప్తుంది.
అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పంచమి ఊరు బయల్దేరుతుంది. వైదేహి, రఘురాం, శబరిలు పంచమికి జాగ్రత్తలు చెప్తారు. కన్నీరు పెట్టుకుంటూ పంచమి బయల్దేరు తుంది. శబరి కూడా ఏడుస్తుంది. జ్వాల, చిత్రలు పంచమి పని అయిపోయిందని అనుకుంటారు. పంచమి మోక్షని తలచుకొని బాధపడుతుంది. ఇంతలో జ్వాల చెప్పిన రౌడీలు పంచమి కోసం దారిలో కాచుకొని ఉంటారు. కారుకి అడ్డంగా రాళ్లు పెట్టి ఆపుతారు. డ్రైవర్‌ని బెదిరించి పంపేస్తారు. పంచమిని చంపడానికి వెంట పడతారు. దీంతో పంచమి పరుగులు పెడుతుంది. తనని ఏం చేయొద్దని పంచమి వేడుకుంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!