Seethe Ramudi Katnam Today Episode ఓ వ్యక్తి ముత్యాల హారాన్ని దొంగిలించేస్తాడు. దీంతో మహాలక్ష్మి వాళ్లు శివకృష్ణని ఉద్దేశించి పోలీసులు ఉండి కూడా ఏం ప్రయోజనం లేదని, దొంగ పోలీసులు చేతులు కలిపేశారని అంటుంది. ఇక సీత నానమ్మ పంతులుతో కల్యాణం జరిపించమని అంటే ముత్యాల హారం లేకుండా కల్యాణం జరిపించడానికి మనసు రావడం లేదని అంటాడు.
శివకృష్ణ: ఆ దొంగ ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆ ముత్యాల హారం మీకు అప్పగించే బాధ్యత నాది పంతులు గారు మీరు కల్యాణం మొదలు పెట్టండి.
మహాలక్ష్మి: ముత్యాల హారం లేకుండా కల్యాణం జరిపించలేను అని పంతులు గారు అన్నారు కదా అన్నయ్య గారు.
లలిత: అలా అని కల్యాణం ఆపలేం కదా వదిన గారు అది ఇంకా అరిష్టం.
సీత: చీటిలో పేర్లు వచ్చిన మా అక్క బావలతో కల్యాణం మొదలు పెట్టండి పంతులు గారు.
అర్చన: నీకు అంత తొందర ఎందుకు సీత పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నారు కదా.
మరోవైపు సుమతి దొంగని చితక్కొట్టి హారం తీసుకొని వస్తుంది. ఆ హారం ఈ ఏడాది తన కొడుకు కోడలికే దక్కాలి అని సుమతి ముత్యాల హారాన్ని విసురుతుంది. అది ఎగిరి వెళ్లి సీత, రామ్‌ల మెడలో పడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. సుమతి సంబరపడిపోతుంది. ఇక పంతులు సీత, రామ్‌లతోనే కల్యాణం జరిపించుకోవాలనే ఆ దేవుడు ఇలా చేశాడని, దీంతో రెండు జంటలతో కల్యాణం జరిపిద్దామని పంతులు అంటాడు.
మధుమిత, సూర్య, సీత, రామ్‌లు కల్యాణంలో పాల్గొంటారు. దూరం నుంచి చూసి సుమతి మురిసిపోతుంది. ఇక దేవుడి దగ్గర పెట్టిన ముత్యాల హారాన్ని పంతులు సీత, రామ్‌లకు ఇస్తాడు. కల్యాణం తర్వాత సూర్య మళ్లీ జైలుకి బయల్దేరుతాడు.
సీత: ఈ కల్యాణానికి వచ్చినందుకు థ్యాంక్స్ బావ.
సూర్య: నువ్వు రామ్ బలవంతం చేశారు కాబట్టి వచ్చాను. అంతే కానీ మీ అక్కని చూడాలి అని కాదు.
సీత: అక్కకి నువ్వంటే చాలా ఇష్టం బావ.
సూర్య: ఈ మాట నువ్వుంటున్నావ్ కానీ మీ అక్క అనడం లేదు.
రామ్: మధు గారు నోరు తెరచి చెప్పకపోయిన మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. మీరు మధు గారు కలిసి సంతోషంగా ఉండాలని నేను సీత కోరుకుంటున్నాం సూర్య గారు.
మధు: మీరు కోరుకుంటున్నారు కానీ కొందరికి మేం కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు రామ్ గారు.
శివకృష్ణ: కొందరు అంటే ఎవరు మమల్నే కదా అంటున్నావ్.
మధు: సూర్య జైలుకి వెళ్లడానికి మేం విడివిడిగా ఉండటానికి కారణం మీరే కదా. మేం ప్రేమ పెళ్లి చేసుకున్నాం అనే కదా మమల్ని కష్టాల పాలు చేశారు.
లలిత: ఎందుకు అలా అంటావ్ మధు నీకు తెలీదా మీ నాన్న గురించి..
సుమతి: నాన్నా..
మధు: మీ అందరికీ సీత మంచిది నేనే చెడ్డదాన్ని కదా.
శివకృష్ణ: అలా అనకు మధు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను సీతని ఒకేలా పెంచాను కదా.
సుమతి: అంటే మధు, సీతలు నా అన్నయ్య పిల్లలా. నా మేనకోడలు సీతే నా కోడలు అయ్యిందా. దేవుడా నేను నా అన్నయ్య కుటుంబానికి దూరం అయితే నా మేనకోడలిని నా కుటుంబానికి దగ్గర చేశావా.
నీలవేణి: మాతో వచ్చేయ్ మధు. సూర్య బయటకు వచ్చే వరకు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం.
మధు: నేను ఎక్కడికీ రాను. నాకు ఇష్టమైన చోట నన్ను వదిలేయండి.
సీత: బావ త్వరలోనే బయటకు వస్తాడు అక్క. మమల్ని నమ్ము.
సూర్య: నేను బయట పడతాను అని తనకు నమ్మకం లేదు. నాతో బతకాలి అని ఆశ కూడా లేదు. ప్రేమ లేని చోట నేను ఉండను. పదండి సార్.
మహాలక్ష్మి పిలిచిందని ప్రీతి మధు, సీత, రామ్‌లను పిలుస్తుంది. సీత శివకృష్ణకు నచ్చ చెప్తుంది. ఇక లలిత తన పిల్లన్ని సుమతికి చూపించమని అంటుంది. కానీ శివకృష్ణ వద్దు అనేస్తాడు. మరోవైపు సుమతి దేవుడికి దండం పెట్టుకుంటుంది. మధు భర్త జైలు నుంచి వచ్చేలా చేయమని వేడుకుంటుంది.
మహాలక్ష్మి: సూర్యని సాగనంపి వస్తున్నావా మధు. ఏమంటున్నాడు సూర్య.
మధు: నన్ను మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటున్నాడు. నాకు తన మీద ఇష్టం ప్రేమ లేవని తనతో బతికే ఉద్దేశం కూడా లేదని ఏవేవో అంటున్నాడు.
మహాలక్ష్మి: కొంత మంది మగవాళ్లు అంతే మధు. ఆడవాళ్లని తక్కువ చేసి మాట్లాడుతారు. చూడు మధు ఈ గుడిలో జరిగింది అంతా ఓ పీడ కలలా మర్చిపో. నేను సూర్యని పూర్తిగా బయటకు తీసుకురావాలి అని చూస్తుంటే సీత తాత్కాలికంగా బయటకు తీసుకొచ్చి మళ్లీ నిన్ను బాధపెట్టింది. నిన్ను బాధ పెట్టడానికే సీత, మీ అమ్మానాన్నలు చేసిన ప్లాన్ ఇది.
మధు: నాకు అర్థమైందండి.
మహాలక్ష్మి: నీకు ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం చేస్తాను నన్ను నమ్ము. అందరూ బయల్దేరండి.
సుమతి: నెమ్మదిగా అన్నయ్యకు సీత, మధుల గురించి అడిగి తెలుసుకోవాలి. అలాగే నా భర్త, మహాలక్ష్మిల గురించి చెప్పాలి. మరోవైపు శివకృష్ణ కూడా సీత, మధుల గురించి చెప్పాలి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.