Naga Panchami Today Episode  : ముగ్గురు పిల్లలు బాగా చదవాలి అని మంచి స్కూల్‌లో జాయిన్ చేయాలని డబ్బు గురించి ఆలోచించకూడదని వైదేహి చెప్తుంది. ఇంతలో చిత్ర ఏం అత్తయ్య నా కూతురు బాగా చదవకూడదా అని అడుగుతుంది. దానికి రఘురాం మీ అమ్మగారి ఇంట్లో పెట్టి చదివిస్తున్నావ్ కదా అని అంటాడు. 


భార్గవ్: ఈ సంవత్సరం తీసుకొచ్చి ఇక్కడే చేర్పిస్తాం పెద్దనాన్న.


వైదేహి: మరీ మంచిది. నువ్వు కూడా వెతకరా మంచి స్కూల్ అందర్ని ఒకే దగ్గర పెట్టి చదివిద్దాం.


మోక్ష పిల్లలిద్దరితో ఆరు బయట ఆడుతూ ఉంటాడు. ఘన ఓ బాల్ పట్టుకొని వైశాలినే కోపంగా చూస్తూ ఉంటాడు. ఆడుతూ ఉంటే వైశాలి చేతికి పంచమి కట్టిన రుద్రాక్షి మాల తెగి కింద పడిపోతుంది. ఇక కరాళి పూలు అమ్మే వ్యక్తిగా గంపతో పూలు పట్టుకొని అక్కడికి వస్తుంది. 


కరాళి: ఆ ఇద్దరిలో నాగాంశతో పుట్టింది ఎవరో ఈరోజు తెలుసుకోవాలి. ఆ పిల్లతోనే నా ప్రాణాలకు ప్రమాదం. (కరాళి తన వెంట తెచ్చుకున్న మొగలి పువ్వు వాసన కలిగిన మందుని సమీపంలోని మొక్కల మీద చల్లుతుంది.) ఎవరైతే ఆ మొగలి పువ్వు వాసన పీల్చి అక్కడికి వస్తారో ఆ పిల్లే నాగాంశతో పుట్టుంటుంది. 


ఘన: మనసులో.. పాము అయితే ఈ మొగలి రేకుల వైపు వస్తుంది ఆ వచ్చే పిల్లని రెక్కలతో పట్టి ఎత్తి అవతల పడేయాలి. 


బాలు పొదల వైపు రావడంతో వైశాలి ఆ వాసనకు అట్రాక్ట్  అవుతుంది. మోక్ష, ఫాల్గుణి ఎంత పిలిచినా పట్టించుకోదు. కరాళికి వైశాలి సరిగ్గా కనిపించదు. ఇక మోక్ష వచ్చి బాల్ తీసుకొని వైశాలిని తీసుకొని వెళ్లిపోతాడు. తన ప్లాన్ వేస్ట్ అయిందని కరాళి చిరాకు పడుతుంది. ఇంతలో పంచమి పంచమి బయటకు వస్తుంది. మొగలి రేకుల వాసన పసిగడుతుంది. మోక్ష, పిల్లలు ఆడుకుంటున్న ప్లేస్‌కి వచ్చి మొత్తం పరిశీలిస్తుంది. పంచమిని చూసి కరాళి దాక్కుంటూ వెళ్లడాన్ని చూస్తుంది. వెంట పడి కరాళి చేయి పట్టుకొని ఆపుతుంది. 


పంచమి: ఏయ్ ఎవరు నువ్వు. అంటూ కరాళిని చూసి షాక్ అవుతుంది. నువ్వా..


కరాళి: అవును పంచమి నేనే.. నీ బిడ్డను ఎన్నాళ్లు కాపాడుకుంటావ్. ఈ కరాళి పగ చల్లారేది కాదు. నీ గురించి నీ పిల్లల గురించి నాకు ఎప్పటికి అప్పుడు తెలిసిపోతుంది. నీ బిడ్డల్లో ఒకరికి సర్ప లక్షణాలు ఉన్నాయి. అందుకే నువ్వు భయపడి పరుగున వచ్చావ్.


పంచమి: నేను భయపడటం లేదు. నా పిల్లలు మామూలు మనుషులు. 


కరాళి: అబద్ధం పంచమి. కచ్చితంగా ఈ బిడ్డల్లో ఒకరికి పాము లక్షణాలు ఉన్నాయి.


పంచమి: లేదు అంతా నీ భ్రమ. ఇంకెప్పుడూ నువ్వు ఈ చోటుకు రాకు. నా బిడ్డల జోలికి వస్తే నేను ఒప్పుకోను.


వైదేహి: పంచమి ఎవరితో గొడవ పడుతున్నావ్. 


పంచమి: ఏం లేదు అత్తయ్యగారు. ఈవిడ ఏదో కావాలి అని అడుగుతుంది. ఇలాంటి వారిని ఇంటిలోకి రానివ్వకూడదు. 


వైదేహి: అమ్మాయ్ మాకు ఏం వద్దు నువ్వు వెళ్లిపో.


కరాళి:  ఈ ఇద్దరిలో ఎవరు నాగాంశతో పుట్టారో తెలుసుకోవాలి. 


పంచమి: అందర్ని పిలుస్తుంది. బయటకు తీసుకెళ్లేటప్పుడు పిల్లలకు రక్ష లేకుండా తీసుకెళ్లకండి. బయట రకరకాల శక్తులు తిరుగుతూ ఉంటాయి. అని వైశాలి, ఫాల్గుణి చేతులకు రుద్రాక్షలు కడుతుంది. 


జ్వాల: నీ అతి జాగ్రత్తలు చూస్తుంటే నాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి పంచమి. ఎందుకు నువ్వు నీ పిల్లల మీద ఎక్కడ లేని శ్రద్ధ తీసుకుంటున్నావ్. 


మోక్ష: మా పిల్లల విషయంలో మేం జాగ్రత్తలు తీసుకుంటే తప్పు ఏముంది వదినా.


జ్వాల: ఏం తప్పు లేదు కానీ భయం ఎందుకు అని. ఈ పిల్లల విషయంలో ఏదో మిస్టరీ దాగి ఉంది. లేకపోతే పంచమి ఇంత ఆందోళన పడదు. 


పంచమి: నేనేమీ ఆందోళన పడటం లేదు. కావాలి అంటే మీ అబ్బాయి విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. మేమేం మీలా ఎత్తిపొడుపుల మాటలు మాట్లాడం.


జ్వాల: నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు పడుతున్న తపన  చూస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అక్షరాభ్యాసం రోజున కూడా పరుగున వెళ్లి ఈ రుద్రాక్షమాల కట్టావ్. ఒకవేళ నీ పాత వాసనలు నీ కూతుళ్లకు వచ్చాయేమో అని నువ్వు కంగారు పడుతున్నట్లున్నావ్. 


చిత్ర: అవును అక్క ఆ పాము లక్షణాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. 


వైదేహి: మీరు తెలివి ఉండే మాట్లాడుతున్నారా. అంతా మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. బంగారం లాంటి పిల్లల్ని పట్టుకొని మీరు ఏదేదో మాట్లాడటం కరెక్ట్ కాదు చెప్తున్న. పిల్లల మనసు గాయపడితే మాన్పించలేం. జాగ్రత్తగా మాట్లాడండి. 


మోక్ష: అయినా వదినా మా పిల్లల విషయంలో మీ జోక్యం ఏంటి. ప్రతీ సారీ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు.


వైదేహి: చూడు జ్వాల పిల్లల పట్ల బాధ్యతతో పాటు భయం ఉండటం కూడా సహజమే. వాళ్ల పిల్లలకు ఏ హాని కలగకూడదు అని వాళ్లు ఏవో జాగ్రత్తలు పడితే మీకు వచ్చిన నష్టం ఏంటి. 


పంచమి: మరొక్క సారి మా పిల్లల విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను అక్క.


జ్వాల: సరే సరే పెద్ద అయిన తర్వాత మీ అందరి సంగతి నా కొడుకు చూసుకుంటాడు. రారా ఘనా.


నాగేశ్వరి నాగదేవత దగ్గరకు వెళ్లి పంచమి సామాన్యురాలు కాదని కారళిని గుర్తించి తన జాగ్రత్తలో తను ఉందని చెప్తుంది. కరాళి ఆడపులిలా తన పిల్లలకు రక్షణగా ఉందని అంటుంది. దాంతో నాగదేవత ఏదో ఒక పౌర్ణమి రోజు మన కార్యం నెరవేరుతుంది. పాప పాముగా మారుతుందని అంటుంది.. మరోవైపు పిల్లలు ఆడుకుంటుంటే పంచమి చూస్తూ ఉంటుంది. పిల్లలను పడుకోమంటే నాన్న వచ్చే వరకు పడుకోమని అంటారు. ఇంతలో వైదేహి అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీరా... ఇలా స్పాట్‌లో పెడితే ఎలా? దేవరకొండకు రష్మిక రిప్లై