Trinayani serial actress Pavithra video: 'త్రినయని' ఫేమ్, సీరియల్ నటి పవిత్ర జయరాం మరణ వార్త టీవీ ఇండస్ట్రీకి పెద్ద షాక్. బుల్లితెర ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం అయ్యో అనుకున్నారు. ఆమె మరణాన్ని తట్టుకోలేని నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రోడ్ యాక్సిడెంట్ (Trinayani Serial Actress Death)లో పవిత్ర మృతి చెందితే... ఉరి వేసుకుని చందు మరణించారు. అయితే, ఇప్పుడు నెట్టింట పవిత్ర ఉరి వేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముంది? కొత్త ట్విస్ట్ ఏమిటి? అని చూస్తే... 


'త్రినయని'లో ఉరి వేసుకున్న తిలోత్తమ!
Trinayani Serial Making Video: 'త్రినయని' సీరియల్ ద్వారా పవిత్ర జయరాం తెలుగు టీవీలో పాపులర్ అయ్యారు. ఇక్కడి ప్రజలకు తెలిశారు. అందులో ఆవిడ తిలోత్తమ క్యారెక్టర్ చేశారు. ఆ సీరియల్ ఫాలో అయ్యే ప్రేక్షకులు ఒక్కసారి ఓ ఏడాది, ఏడాదిన్నర వెనక్కి వెళితే... తిలోత్తమ ఉరి వేసుకునే సన్నివేశం వుంటుంది. అప్పట్లో ఆ సీన్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు పవిత్ర జయరాం. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.


'త్రినయని' కథలో భాగంగా పవిత్ర ఉరి వేసుకుంటే... నిజ జీవితంలో చందు ఉరి వేసుకున్నారు. ఇప్పుడీ కంపేరిజన్ కొందరు ప్రేక్షకుల్లో వచ్చింది. ఏది ఏమైనా ఇద్దరు ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం.


Also Read: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన చందు






ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవుగా!?
పవిత్ర జయరాం, చందు... బ్యాక్ టు బ్యాక్ రెండు మరణాలు, వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపణలు & ప్రత్యారోపణలు కొత్త సీరియల్ తీయడానికి అవసరమైన ముడిసరుకు అందించాయి. ఒక్కటి మాత్రం నిజం... అటు పవిత్రకు, ఇటు చందుకు వేరువేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. 


పవిత్ర, చందు పెళ్లి చేసుకున్నారో? లేదో? ఎవరికీ క్లారిటీ లేదు. చందుతో తనకు పెళ్లి అయ్యిందని పవిత్ర ఫోన్ చేసి మరీ చెప్పిందని చందు భార్య శిల్పతో పాటు చందు తండ్రి కూడా వెల్లడించారు. పవిత్ర జయరాం భర్తకు విడాకులు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దాన్ని పవిత్ర కుమార్తె పత్రీక్ష ఆ మాటలను తోసి పుచ్చారు. ఆ పుకార్లను ఖండించారు. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.


Also Readచందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?



'త్రినయని' సీరియల్ ఫేమ్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం మీద ఆయన తండ్రి మీడియా సాక్షిగా అనుమానం వ్యక్తం చేశారు. కాళ్ళు రెండూ కట్టేసిన వ్యక్తి ఎలా ఉరి వేసుకుంటాడని ప్రశ్నించారు. శిల్ప ఆరోపణలకు గానీ, చందు తండ్రి ప్రశ్నలకు గానీ ఇంకా సమాధానాలు రాలేదు. పవిత్ర పిల్లలు పెద్దవాళ్ళు, పైగా తండ్రి ఉండటంతో భవిష్యత్తుకు ఎటువంటి భయాలు అవసరం లేదు. చందు, శిల్ప దంపతుల కుమార్తె, కుమారుడు పదేళ్ల లోపు వారే. దాంతో ఆ చిన్నారుల భవిష్యత్ ఏమిటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీవీ ఇండస్ట్రీ సాయం చేస్తే బావుంటుందని పలువురి అభిప్రాయం.