Krishna Mukunda Murari Today Episode : ముకుంద తన ట్యాబ్లెట్స్ అయిపోయావి అని మధుని తీసుకురమ్మంటుంది. మధు ఇంట్లో ఎవరూ సేవలు చేయడానికి లేరు అని అంటాడు. ఇక ముకుందని చూసి ఆదర్శ్‌ కోపంతో లేచి వెళ్లిపోతాడు. ఇక మిగతా వారితో తన కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు అని తన గురించి ఆలోచించమని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. 


ముకుంద: కృష్ణ ప్రెగ్నెంట్ అనగానే కాళ్ల దగ్గరకు భోజనాలు, జ్యూస్‌లు, జాగ్రత్తలు అవన్నీ నేను అడిగానా.. ట్యాబ్లెట్స్ లేవు తీసుకురమ్మని చెప్పాను అంది కూడా మీ వారసుడి కోసం.


రజిని: ఇదిగో అమ్మాయ్.. వారసుడు వారసుడు అని అన్ని సార్లు అనకు. అసలు నీ బిడ్డకు మురారి తండ్రి అంటే ఎవరూ నమ్మడం లేదు ఇక్కడ.


ముకుంద: నమ్మరు. కలికాలం కదా. సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతారు. డీఎన్‌ఏ టెస్ట్ చేస్తే అప్పుడు నమ్ముతారులే. అసలు మురారినే ఉంటే ఇంత ఇబ్బందే ఉండేది కాదు. నా బిడ్డకు తండ్రి అని తనే ఒప్పుకునేవాడు. అయినా మిమల్ని కాదు మురారిని అనాలి బిడ్డను మోస్తున్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటాను అని మాట ఇచ్చి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. మీరేమో  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మురారి వస్తాడు కదా అప్పుడు నిజం చెప్తాడు. అంత వరకు నన్ను నేనే చూసుకుంటాను. నా ట్యాబ్లెట్స్ నేనే తెచ్చుకుంటాను.


మధు: ఈ మాట ఏదో ముందే చెప్పి ఉంటే ప్రశాంతంగా టిఫెన్ చేసేవాళ్లం.


పెద్దపల్లి ప్రభాకర్, అతని భార్య కృష్ణకు చీర ఇచ్చి గుడికి వెళ్దామని అంటారు. ఇక భవానికి కూడా కొత్త చీర ఇచ్చి జాతరకు రమ్మని పిలుస్తారు. ఇక మురారి గురించి ప్రభాకర్ అడిగితే భవాని కవర్ చేస్తుంది.


భవాని: మనసులో.. భగవంతుడా నీపైనే భారం వేస్తున్నా స్వామి. అక్కడ ఏం జరిగిందో తెలీకుండా చూడు. తెలిస్తే ఈ తింగరిది తట్టుకోలేదు. ఈ సమస్య నుంచి నువ్వే బయట పడేయ్ తండ్రి. 


ఆదర్శ్‌ ఫుల్లుగా తాగి ముకుంద మాటలు తలచుకొని రగిలిపోతాడు. తాగిన మైకంలో తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ముకుంద దగ్గరకు వెళ్లి గురి పెడతాడు. ముకుంద అలా నిల్చుండిపోతుంది. ఇంతలో రేవతి వచ్చి ఆపమని గోల చేస్తుంది. ఇంట్లో అందరూ వచ్చి ఆదర్శ్‌ని అడ్డుకుంటారు. మోసగత్తెను చంపేస్తా అని ఆదర్శ్‌ అరుస్తాడు. అలాగే గాల్లోకి ఫైర్ చేస్తాడు. ఇక రేవతి ఆదర్శ్‌ దగ్గర గన్ తీసుకొని లాగి పెట్టి ఆదర్శ్‌ని ఒక్కటిస్తుంది. అందరూ ఆదర్శ్‌ని తిడతారు.


నందిని: అన్నయ్యా.. ఇంత మూర్ఖంగా ఎలా ప్రర్తిస్తున్నావ్. తన వట్టి మనిషి కూడా కాదు అని మర్చిపోయావా.


ఆదర్శ్‌: అది ఒట్టి మనిషి కాదు. నన్ను మనిషిని కూడా కాకుండా చేసింది. నన్ను ఇంతలా నమ్మించి మోసం చేసిన ఆడదాన్ని నేను ఇంకా ఎక్కడా చూడలేదు. 


రేవతి: తను ఏదో ఆరోపణలు చేస్తుంది మనం నమ్మడం లేదు కదా. అది తప్పు అని నిరూపించే వరకు మౌనంగా ఉండాలి కదా.


ఆదర్శ్: చూడు నువ్వు చేసిన పనికి అందరూ కలిసి నిన్ను చంపేయాలి కానీ ఇంకా జాలి చూపిస్తున్నారు. ఇది.. ఇది నా కుటుంబం.. నా కుటుంబాన్ని మోసం చేయాలి అనుకుంటున్నావా. పిన్ని మురారి వల్లే ఇది తల్లి అయ్యాను అని అంటే ఆవేషంలో మురారిని తిట్టాలనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అన్నింటికీ ఇదే కారణం అనిపిస్తుంది. పోనీ మురారీనే తప్పు చేశాడు అనుకుందాం. వాళ్లు వాళ్లు ఏడ్వాలి కదా నా జీవితంతో ఎందుకు ఆడుకుంది. నాతో పెళ్లి అంటే సరే అంది. ఇలాగే మురారిని కూడా మాయ చేసి ఉంటుంది. అసలు మురారి కనిపించకుండా పోవడానికి కారణం ఇదే. అందుకే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని అంత గట్టిగా చెప్తుంది. చెప్పవే మురారి ఎక్కడ.. చంపేస్తా దాన్ని..


ఆదర్శ్‌ని మధు అడ్డుకొని గదిలోకి తీసుకెళ్తాడు. ఇక రేవతి ముకుందతో వాడు తాగి మాట్లాడు కాబట్టి ఊరుకుంటున్నా వాడు మాట్లాడింది నిజం అని తేలితే ఈ ఇంట్లో అందరూ నిన్ను చంపేస్తారు. 


కృష్ణ, భవానిలను తీసుకొని శకుంతల, ప్రభాకర్ గుడికి తీసుకెళ్తారు. అందరూ కృష్ణ ప్రెగ్నెంట్ అని జాగ్రత్తలు చెప్తారు. అయితే కృష్ణ అందరూ ఇలా మాట్లాడుతున్నారు అని అది అబద్ధం అని తెలిస్తే ఎలా ఫీలవుతారో అని టెన్షన్ పడుతుంది. ఇక ప్రభాకర్ కృష్ణ చేతికి ముడుపు ఇచ్చి కట్టమని చెప్తాడు. కృష్ణ ముడుపు కడుతుంది. తర్వాత ముకుంద మాటలు తలచుకొని కళ్లు తిరిగి పడిపోతుంది.  


మరోవైపు రేవతి భవానికి కాల్ చేస్తుంది. మురారి అక్కడ కూడా లేడు అని భవాని చెప్తుంది. కృష్ణకు తాను ఇంకా నిజం చెప్పలేదు అని ఎవరూ కాల్ చేసినా ఏం చెప్పొద్దని అంటుంది. 


కృష్ణ: ఏడుస్తూ దేవుడిని దండం పెడుతుంది. అసలు ఈ జన్మను నాకు ఎందుకు ఇచ్చావ్. ఎవరికైనా ఒకటో రెండో కష్టాలు ఉంటాయి. నాకు మాత్రం వంద జన్మలకు సరిపడా కష్టాలు ఇచ్చావ్. అంత పాపం నేను ఏం చేశాను. నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడూ అడిగింది లేదు. అమ్మని కావాలి అని ఒకే ఒక కోరిక కోరాను. అది ఆడ జన్మ హక్కు కదా స్వామి. అది కూడా సరిగ్గా నెరవేరనివ్వలేదు. నా బిడ్డను నన్నూ శత్రువులా చూసే ఆ ముకుంద గర్భంలో పెరిగేలా చేశావ్. నిజం బయట పెట్టలేక కన్న బిడ్డలా చూసుకుంటున్న ఇద్దరు అమ్మల్ని మోసం చేస్తున్నాను నేను. మా చిన్నాన్న పిన్నిలను మోసం చేస్తున్నాను. లేని గర్భం ఉన్నట్లు నటించడం ఎంత కష్టమో తెలుసా స్వామి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: తెలుగు హీరోల్లో అతడే నా బెస్ట్ ఫ్రెండ్ - విరాట్ కోహ్లీ