Naga Panchami Today Episode : నాగేశ్వరి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. కరాళి కుట్రలకు అంతే లేకుండా పోయిందని.. యువరాజు ఫణేంద్రను నాగలోకం నాశనం చేయడానికి ఓ పావులా ఉపయోగించుకుంటుందని నాగదేవతతో నాగేశ్వరి చెప్తుంది. 


నాగదేవత: ఫణేంద్ర అంతకు తెగించాడా మన నాగలోకానికి ద్రోహం తలపెట్టాడా. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 
నాగేశ్వరి: మన జాతి వైరమైన గరుడ లోకంతో చేతులు కలిపి ఫణేంద్రను గరుడ శక్తిగా మార్చి పంచమి అంటే ఇష్టపడని తోటి కోడలు అయిన జ్వాల కడుపులో ప్రవేశపెట్టింది. పంచమి ప్రసవించకుముందే గర్భాన్ని ఛిద్రం చేయాలని ప్లాన్ చేసింది. కరాళి ఎత్తు ఫలించిందంటే మన మహారాణి పుట్టుక ప్రశ్నార్థకం అవుతుంది. 
నాగదేవత: గరుడ శక్తిని తక్కువ అంచనా వేయలేం. నాగలోకాన్ని నాశనం చేయడం కోసం గరుడ లోకం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు.
నాగేశ్వరి: మన లోకానికి మహారాణి లేదన్న విషయం గరుడ లోకానికి తెలిసిపోయింది నాగదేవత.
నాగదేవత: ఆ బిడ్డని పుట్టకుండా చేస్తే మన లోకానికి మహారాణి ఉండరని వాళ్ల ఆలోచన. అలా జరగకుండా చేయాలి నాగేశ్వరి. శాపగ్రస్తుడైన ఫణేంద్రకు ఇప్పుడు మన ఇష్టరూప శక్తులు లేవు అందుకే మనం ఇప్పుడు ఫణేంద్ర జాడ తెలుసుకోలేం. తను నాగుగా మారలేడు కాబట్టి అతడిని పసిగట్టడం కష్టం. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. పంచమి ప్రసవించాలి. ఆ బిడ్డ మన లోకానికి మహారాణిలా రావాలి.  


రఘురాం, వైదేహి పంచమిని పిలిచి తమ దగ్గర కూర్చొపెట్టుకుంటారు. బాగోగులు అడిగి తెలుసుకుంటారు. ఎప్పుడూ దిగులుగా కనిపిస్తున్నావని ఏమైందని అడుగుతారు. ఇక వైదేహి పంచమిని దగ్గరగా తీసుకొని తన కూతిరిలా చూసుకుంటానని చెప్తుంది. ఇక ఇంట్లో తనకు ఏ లోటు లేదుని పంచమి అంటుంది. 


వైదేహి: అన్ని మర్చిపో పంచమి నీకు మేం ఉన్నాం. ఈ సమస్య వచ్చినా మాతో ధైర్యంగా చర్చించు.
రఘురాం: నువ్వు సంతోషంగా ఉండు పంచమి. నీకు జ్వాలకు పుట్టిన బిడ్డల కోసం మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. 


ఇంతలో మోక్ష వస్తే రఘురాం పంచమిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లమని చెప్తాడు. మోక్షసరే అంటాడు. ఇక మోక్ష పంచమి ఇద్దరూ బయటకు వెళ్లారు.


మరోవైపు చిత్ర భర్త ల్యాప్‌టాప్‌ చూస్తూ ఉంటుంది. చిత్ర కంగారు పడుతుంది. భార్గవ్ భార్య దగ్గర నుంచి ల్యాప్‌టాప్ తీసుకొని చూసి షాక్ అయిపోతాడు. అందులో చిత్ర ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే మెడిసిన్ కోసం చూస్తుంది. అవి ఎందుకు చూశావని అడుగుతాడు. ఇప్పుడు నీకు ఈ ట్యాబ్లెట్స్‌తో అవసరం ఏంటి అని అడుగుతాడు. దాంతో చిత్ర పంచమి, జ్వాలల గర్భాలు నాశనం చేయాలని అంటుంది. మనకి అదృష్టం లేనప్పుడు ఎదుటి వారి అదృష్టం దూరం చేయాలి కదా అని అంటుంది. 


భార్గవ్: నువ్వు చాలా క్రూయల్‌గా ఆలోచిస్తున్నావ్ చిత్ర.
చిత్ర: గట్టిగా అరవకండి ఎలా అయినా సరే పంచమి, జ్వాలల గర్భాలు పోగొట్టాలి. వాళ్లకి పిల్లలు పుడితే మనకు ఆస్తిలో వాటా తగ్గిపోతుంది.
భార్గవ్: ఇలా చేయడం ఎంత నేరమో తెలుసా.
చిత్ర: అందుకే కదా నీ ల్యాప్‌టాప్‌లో వెతికింది. వాళ్ల గర్భం పోయి ఏదైనా కేసు అయిందనుకో ఆ నేరం నీ మీదకు వస్తుంది.
భార్గవ్: నీకు ఎంత ధైర్యం భర్తని అని కూడా చూడకుండా నువ్వు నన్ను ఇరికించాలి అని చూస్తావా.
చిత్ర: అరవకు ఈ విషయం బయటకు వెళ్తే నువ్వే జైలుకి వెళ్తావు. 
భార్గవ్: నీ తెలివి తేటలు చూస్తుంటే భయం వేస్తుంది. 
చిత్ర: మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు. నేను ఈ ట్యాబ్లెట్స్ తెచ్చి ఇద్దరికి ఇచ్చి వాళ్ల గర్భాలు పోయేలా చేస్తా అప్పుడు ఆస్తి మొత్తం నా కూతురికే దక్కుతుంది. ఈ విషయం అసలు బయటకు రాకూడదు. 


మోక్ష పంచమిలు పడుకొని ఉంటే జ్వాలలోని గరుడ శక్తి ప్రభావం వల్ల జ్వాల వాళ్ల దగ్గరకు వస్తుంది. పంచమి గర్భాన్ని పగతో చూస్తుంది. పంచమి గర్భం మీద చేయి వేయాలని చూస్తుంది. మోక్ష కదలడంతో వెనక్కి వెళ్తుంది. మరోసారి పంచమి గర్భం పట్టుకోవాలని చూస్తుంది. పంచమి నిద్ర లేచే సరికి జ్వాల వెళ్లిపోతుంది. జ్వాల వెనకే పంచమి కూడా వెళ్తుంది. దీంతో పంచమిని జ్వాల గొంతు పట్టుకొని గాలిలో లేపేస్తుంది.  


పంచమి పక్కనే ఉన్న ప్లవర్ వాజ్‌తో పంచమి జ్వాలని ఒక్కటిస్తుంది. ఇంతలో మోక్ష పరుగున వస్తాడు. పంచమి జ్వాలని కొట్టడానికి మీదకు వెళ్తుంది. అందరూ అక్కడికి వచ్చే సరికి జ్వాల ప్లేట్ తిప్పేస్తుంది. పంచమే తనని తన బిడ్డను చంపాలని చూస్తుందని అంటుంది. జ్వాల అబద్ధం చెప్పడంతో పంచమి జ్వాల చెంప పగలగొడుతుంది. దీంతో మోక్ష పంచమిని తిడతాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: శివం భజే... యంగ్ హీరో అశ్విన్ బాబు రౌద్ర రూపం చూశారా?