'రాజుగారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu). 'హిడింబ'తో మాస్ రూటులోకి వచ్చారు. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
రౌద్ర రూపంలో అశ్విన్ బాబు!
Ashwin Babu First Look From Shivam Bhaje: 'శివం భజే' టైటిల్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. లేటెస్టుగా విడుదల చేసిన హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన చెప్పారు.
'శివం భజే' ఫస్ట్ లుక్ చూస్తే... ఒంటి కాలి మీద నిలబడటమే కాదు, ఒంటి చేత్తో ఓ మనిషిని పైకి ఎత్తిన అశ్విన్ బాబు రౌద్ర రూరంలో కనపడతారు. ఆయన వెనుక అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనుక ఒక దేవుడి విగ్రహం కూడా కనిపించాయి. మరి, 'శివం భజే'లో ఆయన ఏం చూపించబోతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొన్ని రోజులు ఆగితే తప్ప ఈ లుక్ వెనుక రహస్యం ఏమిటి? అనేది రివీల్ కాదు.
'శివం భజే' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ''మా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో వైవిధ్యమైన కథతో అశ్విన్ బాబు హీరోగా ఈ సినిమా నిర్మిస్తున్నాం. కొత్త కథ, కథనాలతో దర్శకుడు అప్సర్ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. దాశరథి శివేంద్ర అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేశాం. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ రాజీ పడకుండా మూవీని ప్రొడ్యూస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా జూన్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ... ''టైటిల్ కంటే ఎక్కువ స్పందన ఫస్ట్ లుక్, అశ్విన్ బాబుకు రావడం సంతోషంగా ఉంది. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి సహకారంతో అంచనాలకు మించి సినిమా రూపొందుతోంది. త్వరలో టీజర్, సాంగ్స్ రిలీజ్ గురించి అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.
Also Read: మెగా డాటర్ నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్... జనసేనకు ఆయన వ్యతిరేకమా?
'శివం భజే' సినిమాలో బాలీవుడ్ నటుడు, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవా'తో పాటు రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలు తెలుగులో ఆయన చేశారు. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయిక. 'హైపర్' ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి,దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, 'షకలక' శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనాయా సుల్తానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సంగీత దర్శకుడు: వికాస్ బడిస, ఫైట్ మాస్టర్: పృథ్వీ - రామకృష్ణ, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం: అప్సర్.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం