Jagadhatri  Serial Today Episode: బయట బట్టలు ఆరేస్తున్న ధాత్రిని చూసి కేదార్‌ రొమాంటిక్‌గా ఫీలవుతుంటాడు. తర్వాత ధాత్రి, కేదార్‌ రామ్మూర్తి ఇంటికి వెళ్లగానే వాళ్ల భార్య ఏడుస్తూ ఉంటుంది. కిడ్నాపర్లు ఫోన్‌ చేశారని డబ్బులు రెడీగా ఉంచానని చెప్తుంది. ఇంతలో కిడ్నాపర్లు ఫోన్‌ చేయడంతో ధాత్రి చెప్పినట్లే వారితో మాట్లాడుతుంది రామ్మూర్తి భార్య. కిడ్నాపర్లు డబ్బులు తీసుకుని వికారాబాద్‌ రూట్‌లో రమ్మని చెప్పడంతో ధాత్రి, కేదార్‌ కూడా ఆమెతో పాటు వెళ్లడానికి రెడీ అవుతారు. వాళ్ల టీంను అలెర్ట్‌ చేస్తారు. ధాత్రి, కేదార్‌లతో కలిసి వెళ్తున్న రామ్మూర్తి భార్యకు కిడ్నాపర్లు ఫోన్‌ చేసి రూట్‌ చెప్పి ఒక దగ్గర ఆగమని చెప్పగానే కిడ్నాపర్‌ చెప్పిన ప్లేస్‌కు వెళ్తారు.


ధాత్రి: కేడీ ఇదంతా గవర్నమెంట్‌ క్వార్టర్స్‌ లాగా ఉన్నాయి కదా?


కేదార్‌: అవును జేడీ..


ధాత్రి: బ్యాంకు ఎంప్లాయీస్‌ కాలనీ ఇది. ఆ కిడ్నాపర్‌ ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు.


కేదార్‌: గవర్నమెంట్‌ క్వార్టర్స్‌ లో కిడ్నాప్‌ చేసి దాచేంత ధైర్యం ఎవరైనా ఎందుకు చేస్తారు.


ధాత్రి: గవర్నమెంట్‌ ఉద్యోగులు ఈ పని కచ్చితంగా చేయరు. ఎవరైనా ఇల్లు రెంట్‌కు తీసుకుని ఈ పని ఎందుకు చేసి ఉండరు.


కేదార్‌: అవును ధాత్రి ఇక్కడి కంటే సేఫ్‌ ప్లేస్‌ ఇంకెక్కడ ఉంటుంది.


ధాత్రి: అయితే ఈ కాలనీలో ఎన్ని రెంట్‌ ఇండ్లు ఉన్నాయో తెలుసుకుంటే కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది.


కేదార్‌: ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేది ఎవరు?


ధాత్రి: ఈ కాలనీ ప్రెసిడెంట్‌ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ మొత్తం ఇస్తాడు.


అని ఇద్దరూ కలిసి కాలనీ ప్రెసిడెంట్‌ దగ్గరకు వెళ్తారు. కాలనీలో రెంట్‌కు ఇచ్చిన ఇండ్ల సమాచారం తీసుకుని అక్కడకు వెళ్లి వెతికితే ఎవ్వరూ దొరకరు దీంతో కేదార్‌, ధాత్రి తిరిగి రామ్మూర్తి భార్య ఉన్న దగ్గరకు వెళ్తారు. ఇంతలో కిడ్నాపర్లు ఫోన్‌ చేసి ఎందుకు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని కోప్పడుతుంటే కేదార్‌ తుమ్ముతాడు వెంటనే కిడ్నాపర్‌ ఫోన్‌ కట్‌ చేసి మన జాగ్రత్తలో మనం ఉండాలని మిగతా కిడ్నాపర్లకు చెప్తాడు. మరోవైపు కౌషికి ఇంట్లో ఫైల్‌ చూస్తూ.. సుజాతను కాఫీ అడుగుతుంది. సుజాతకు బదులు సురేస్‌ కాఫీ తీసుకొస్తాడు. పక్కనుంచి చూస్తున్న వైజయంతి, నిషిక కుళ్లుకుంటారు.


వైజయంతి: నేను ఎందుకు? వీళ్లిద్దరూ దగ్గరుంటే దగ్గరైపోతారని భయపడ్డానో ఇప్పుడు అర్థం అయ్యిందా? ఇందుకే ఈ అబ్బోడు చాలా మంచోడు.. అంత మంచోణ్ని చాలా రోజులు ద్వేషించడం చాలా కష్టం.


సురేష్‌: తీసుకో కౌషికి..


ధాత్రి: కేదార్‌ ఈ కాఫీతో వాళ్లిద్దర్ని ఒక్కటి చేద్దాం.. ఏంటి వదిన కాఫీ తీసుకుని తాగితే మా అన్నయ్య కాఫీయే బెస్ట్‌ అని ఒప్పుకోవాల్సి వస్తుందని తాగడం లేదా?


కేదార్‌: మీరిలాగే పడుకుని పగటి కలలు కంటూ ఉండండి ఒప్పేసుకుంటాం..


ధాత్రి: మరి అంత భయం లేనప్పుడు కప్పు కాఫీ తాగడానికి అంత ఆలోచన ఎందుకో? భయమే కదా?


కేదార్‌: ఏంటి భయమా? మాకా? మేడం మీరు మర్చిపోయినట్టున్నారు. వజ్రపాటి ఇక్కడ. భయానికి మీనింగ్‌ తెలియని బ్లడ్‌ మాది.


అంటూ ఇద్దరూ కలిసి కౌషికి కాఫీ తీసుకుని తాగేలా చేస్తారు. దీంతో సురేష్‌ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కాఫీ తాగిన కౌషికి మౌనంగా ఉండిపోతే మా అక్క మూడ్‌ చూస్తుంటే కాఫీ బాగాలేన్నట్టుంది.. షుగర్‌ తక్కువ అయ్యిందేమో అంటాడు కేదార్‌. దీంతో సురేష్‌ కరెక్టే వేశానని కౌషికి చేతిలోని కాఫీ కప్పు తీసుకుని తాగుతాడు. దీంతో కేదార్‌, ధాత్రి కలిసి సురేష్‌ను ఆటపట్టిస్తారు. ఇంతలో కౌషికి ఆఫీసుకు వెళ్తుంది. తాము ఏదో ఒకటి చేసి సురేష్‌, కౌషికిలను కలవకుండా చేయాలని ప్లాన్‌ వేస్తారు వైజయంతి, నిషిక. సురేష్‌ స్కూటర్‌ లో గాలి తీసేస్తారు. అది చూసిన సురేష్‌ కౌషికిని తన ఆఫీసులో డ్రాఫ్‌ చేయమని అడుగుతాడు. దీంతో కౌషికి సరేనని వెయిట్‌ చేస్తుంటే వైజయంతి, నిషికలు వెళ్లి స్కూటీ దాచిపెట్టి సురేష్‌ వెళ్లిపోయాడని కౌషికికి చెప్తారు. దీంతో కౌషికి కోపంగా వెళ్లిపోతుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన సురేష్‌కు కూడా నువ్వేంటే ఇష్టం లేదు కాబట్టే  కౌషికి వెళ్లిపోయింది అని చెప్పగానే సురేష్‌ ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: బిగ్‌బాస్‌ షోపై యాంకర్‌ రవి సంచలన వ్యాఖ్యలు, ఓటీటీకి బ్లాక్‌బస్టర్‌ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!