Krishna Mukunda Murari Today Episode : కృష్ణతో పాటు డాక్టర్ అమృత కూడా ముకుందని పరీక్షించి ప్రెగ్నెంట్ అని కనిపెట్టేస్తుంది. ఇక కృష్ణ టెన్షన్ చూసిన అమృత భవాని వాళ్లతో కృష్ణలాగే ఆవిడ కూడా ముకుంద నీరసంగా ఉందని అనేస్తుంది. దీంతో కృష్ణ సీనియర్ గైనకాలజిస్ట్ ఇలా చెప్పడం ఏంటని ఆలోచిస్తుంది. తానే తప్పుగా అనుకున్నానేమో అని మరో సారి టెస్ట్ చేసి కన్ఫ్మమ్ చేసుకుంటుంది. ఇక కృష్ణ.. ముకుంద ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. 


భవాని: ఇప్పుడు బాగానే ఉందా ముకుంద.


ముకుంద: కొంచెం నీరసంగా ఉంది అంతే ఆంటీ.


ఆదర్శ్‌: ఎందుకు ఉండదు. రాత్రంతా నిద్రపోకుండా తెల్లారి లేచి ఏం తినకుండా చావు దగ్గరకి వెళ్తే కళ్లు తిరగక ఏమవుతుంది. 


మురారి: చావు దగ్గరకు వెళ్లడం ఏంటి.


ఆదర్శ్‌: తన పాత ఇంటి ఓనర్‌కి సీరియస్‌ అయి చనిపోతే హాస్పిటల్‌కి వెళ్లింది.


మురారి: మనసులో.. ఏం చెప్పాలో తెలీక అలా చెప్పినట్లుంది. వేరే ఏదో కారణం చెప్పొచ్చు కదా. బిడ్డకు ప్రాణం పోయడానికి వెళ్లి చావుకి పోయానని చెప్పడం ఎందుకు. 


ఇక పూజ పూర్తి చేయడానికి అందరూ బయటకు వెళ్తారు. పంతులు అందరి హారతి ఇచ్చి పూజ పూర్తి చేస్తారు. మరో వైపు కృష్ణ డాక్టర్ అమృత అబద్ధం ఎందుకు చెప్పారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అమృత అక్కడికి వస్తుంది. 


అమృత: తింగరి ఎందుకు అలా చేశావు. ఎందుకు అందరి ముందు నిజం దాచావు. 


కృష్ణ: మీరు ఎందుకు దాచారు ఆంటీ.


అమృత: ఇది మీ ఫ్యామిలీ విషయం. నువ్వే దాచావు అంటే బయటకు తెలియనిది ఏదో జరుగుతుందని అర్థమైంది. అందుకే నేను చెప్పలేదు. 


కృష్ణ: బాగానే ఆలోచించారు ఆంటీ. పెళ్లికాకుండానే ఇలా అయిందని నేను నిజం చెప్పలేదు.


అమృత: ఎవరు అతను.


కృష్ణ: ఆదర్శ్. 


అమృత: అనుకున్నా చాలా ఇష్టంగా అతను తన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 


కృష్ణ: అవును ఆంటీ ఆదర్శ్‌ తనని ప్రేమిస్తున్నాడు. పెద్దత్తయ్య కూడా పెళ్లి చేయాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే బాగోదు కదా మీరు కూడా చెప్పొద్దు ఆంటీ. వెంటనే పెద్దత్తయ్యతో మాట్లాడి వాళ్ల విషయం చెప్తా. తర్వాత అత్తయ్య వాళ్లకి మెల్లగా నేనే విషయం చెప్తాను.


ఇక డాక్టర్‌ అమృతకి రేవతి, కృష్ణ కలిసి తాంబూళం ఇస్తారు. అమృత వెళ్లిపోతుంది. మరోవైపు ముకుంద జరిగిందతా తలచుకుంటుంది. ఇద్దరు డాక్టర్లు ఏం లేదు అని చెప్పడం విని ఆలోచనలో పడుతుంది.


ముకుంద: కృష్ణ అంటే నేనే సరోగసీ మదర్ అని మురారి చెప్పుంటాడు కాబట్టి గర్భవతి అని చెప్పలేదు. మరి డాక్టర్ అమృత ఎందుకు చెప్పలేదు. పెళ్లి కాకుండా తల్లి అయ్యానని చెప్తే నా పరువు పోతుందని చెప్పలేదా..అందరి ముందు చెప్పలేకపోయినా అత్తయ్య ఫ్రెండ్ కాబట్టి ఆవిడకి అయినా చెప్పుండాలి కదా. అలా చెప్తే ఈ టైంకే ఆవిడ నాకు అడిగేది కదా. లేదంటే నిజంగానే నేను తల్లిని కాలేదా. అంటే సరోగసీ ప్రాసెస్ సరిగా జరగలేదా.. అసలు నేనే సరోగసీ మదర్ అని మురారి కృష్ణకు చెప్పాడా లేదా.. 


ఇక ఈ విషయం కృష్ణకు తెలుసా లేదా అని మురారిని అడుగుదామని ముకుంద కాల్ చేద్దామని అనుకుంటుంది. పక్కనే కృష్ణ ఉంటే ప్రాబ్లమ్ అవుతుందని మెసేజ్ చేయాలనుకుంటుంది. తానే సరోగసీ మదర్ అని కృష్ణకు చెప్పారా అని మెసేజ్ చేస్తుంది. దీంతో మురారి లేదు అని మెసేజ్ చేస్తాడు. దీంతో సరోగసీ ప్రాసెస్ సక్రమంగా జరిగిందా లేదా అని మళ్లీ ఆలోచనలో పడుతుంది.


మురారి మళ్లీ ముకుందకు మెసేజ్ టైప్ చేస్తుండగా కృష్ణ వచ్చి ఫోన్ లాక్కుంటుంది. ఘోరం జరిగిపోయిందని వెంటనే ఆదర్శ్‌కి మీరాకి పెళ్లి చేసేయాలి అని చెప్తుంది. 


మురారి: మొన్నటి నుంచి చూస్తున్నా వాళ్ల పెళ్లి చేసేయాలి చేసేయాలి అంటున్నావ్ వాళ్ల పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది. 


కృష్ణ: జరిగింది తెలిస్తే నాకన్నా ముందు మీరే తొందర పడతారు. ఇప్పుడు మీరా గర్భవతి. 


మురారి: మనసులో.. హమ్మయ్యా.. సరోగసీ ప్రాసెస్ సక్సెక్ కాలేదేమో అని టెన్షన్ పడ్డాను. సక్సెస్ అయింది. 


కృష్ణ: అమృతగారు కూడా నాలాగే ఆలోచించి పెళ్లి కాని పిల్ల పరువు పోకూడదు అని అందరి ముందు చెప్పలేదు.


మురారి: మనసులో.. ఓ ఆవిడ కూడా కన్ఫ్మమ్ చేశారా ఇక నో టెన్షన్. అయినా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు కృష్ణ. 


కృష్ణ: మీరా తల్లి కాబోతుంది అని అందరికీ తెలిసే లోపే ఆదర్శ్‌తో పెళ్లి చేసేస్తే ఏ టెన్షన్ ఉండదు.


మురారి: మీరా తల్లి కాబోతుంది అంటే ఆదర్శ్‌తో పెళ్లి చేస్తా అంటావేంటి. 


కృష్ణ: ఏసీపీ సార్ ఆదర్శ్, మీరాలు కలిసి తిరగడం చూస్తే చంటి పిల్లాడు కూడా మీరా కడుపులో ఉన్నది ఆదర్శ్‌ బిడ్డే అని అంటాడు. 


మురారి: (మనసులో.. మీరా కడుపులో ఉన్నది మా బిడ్డ అని ఈ తింగరికి తెలీదు అందుకే ఆదర్శ్ కారణం అనుకుంటుంది.) వాళ్ల పెళ్లి జరగడం కుదరదు. కృష్ణ నన్ను ఏమీ అడగకు. వదిలేయ్.


కృష్ణ: ఇంత సీరియస్ మ్యాటర్‌ని సింపుల్‌గా వదిలేయమని అంటున్నారు అంటే ఏదో కారణం ఉంటుంది. ఏంటో చెప్పండి ఏసీపీ సార్ చెప్పండి. మీరా మీద మీకు ఏమైనా అనుమానం ఉందా.


మురారి: ఆదర్శ్‌కి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు.  


కృష్ణ: ఏం మాట్లాడుతున్నారు. అంటే మీకు మీరా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలుసు.. చెప్పండి ఏసీపీ సార్ ఎవరు..


మురారి: మనమే.. మీరా తల్లి కావడానికి కారణం మనమే. 


కృష్ణ: ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సార్.


మురారి: అవును మీరా కడుపులో పెరుగుతున్నది మన బిడ్డే. సరోగసీ  మదర్ ఎవరు ఎవరు అని అడిగావ్ కదా. తనే. తనే ఇప్పుడు మన బిడ్డను మోస్తుంది. అందుకే ఆదర్శ్‌తో పెళ్లి చేయడం కుదరదు అర్థమవుతుందా..


మరోవైపు మధు సినిమా కథ రాస్తుంటాడు. భవాని వచ్చి మాట్లాడుతుంది. దీంతో డైరెక్టర్ కావడం నా కల అని ఒక్క ప్రొడ్యూసర్ ఓకే చెప్తే చాలు అని అంటాడు. దీంతో భవాని దేవి తనకే ఒక కథ చెప్పి మెప్పిస్తే తానే ప్రొడ్యూస్ చేస్తానని చెప్తుంది. మరోవైపు మధు సంతోష పడుతుంది.


మురారి: అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి కృష్ణ. సరోగసి మదర్ ఎవరో తెలిస్తే దగ్గరకుండి అన్నీ చూసుకుంటా అన్నావు. ఇప్పుడు ఎదురుగానే ఉన్నా పట్టించుకోవడం లేదు. ఏంటి నీ ప్రాబ్లమ్.


కృష్ణ: అదే నా ప్రాబ్లమ్. మీరా కాకుండా వేరే ఎవరో నా బిడ్డను మోస్తున్నందుకు సంతోషంతో ఎగిరి గంతేసేదాన్ని. 


మురారి: మీరా అయితే ఏంటి ప్రాబ్లమ్.


కృష్ణ: తను మీరు అనుకున్నంత మంచిది కాదు. పైకి ఒకలా ఉంటుంది. మనసులో మరోలా ఉంటుంది. 


మురారి: మనకోసం తను ఇంత చేస్తే నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్.


కృష్ణ: నేను తప్పుగా ఆలోచించడం కాదు ఏసీపీ సార్. తన ఆలోచనలోనే ఎక్కడో తప్పు ఉంది. సరోగసీ మదర్‌గా ఉండమని మీరు తనని బతిమాలారా. 


మురారి: లేదు తన ఇష్టంతోనే ముందుకు వచ్చిందని చెప్పాను కదా.


కృష్ణ: అదే నేను ఆలోచిస్తున్నా ఏసీపీ సార్. ఒక ఆడది సరోగసీ మదర్‌గా ఉండటం ఎంత కష్టమో తెలుసా. పిల్లలుండి వేరే వారి బిడ్డను మోయడమే కష్టం. అలాంటిది పెళ్లి కాని అమ్మాయి. తనంతట తానే ముందుకు వచ్చిందని మీరు నమ్ముతున్నారా. ఇలా చేస్తే ఒక రకంగా తన జీవితాన్ని త్యాగం చేసినట్లు. ఏం ఆశించకుండా ఇంత పెద్ద త్యాగం చేస్తుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు ఏసీపీ సార్. 


మురారి: నువ్వు నెల తప్పావు అని అందరూ సంతోషించారు. ఇప్పుడు ఎలా అని ఆలోచించే టైంలో మీరా దేవతలా వచ్చి ఆదుకుంది. కొంచెం పాజిటివ్‌గా ఆలోచించు. 


కృష్ణ: తను మన ఇంట్లో మన అందరితో కలిసి ఉంటుంది. వాంతులవుతాయి. కడుపు పెరుగుతుంది. అందరికీ అనుమానం వస్తుంది కదా అప్పుడేంచేస్తారు. ఆ ప్రమాదం మీరు ఆలోచించలేదా. పైగా దీని వల్ల మనం ఆదర్శ్‌ని బలి చేస్తున్నాం ఏసీపీ సార్. ఆదర్శ్‌ మీరాని ప్రేమిస్తున్నాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ : రివేంజ్ ప్లాన్ చేసిన అత్తాకోడళ్లు.. విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ మంటలు!