Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప భర్త రెండో పెళ్లి, నర్శింహ ఇంటికి వచ్చి గొడవ చేయడం గురించి సుమిత్ర, కార్తీక్, ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటారు. నర్శింహ గురించి తనకు ముందే తెలుసు అని కానీ రెండో పెళ్లి గురించి తెలీదని కార్తీక్ అంటాడు. ఇక పారిజాతం ఫుల్ ఫైర్ అవుతుంది. 


పారిజాతం: మన స్టేటస్ ఏంటి.. ఈ రోజు మన ఇంట్లో జరిగిన గొడవ ఏంటి.. ఇన్నాళ్లలో మన ఇంట్లో ఇలాంటి గొడవలు ఎప్పుడైనా జరిగాయా. కారణం ఎవరు. ఆరోజు అన్నదానం రోజు నీతో వస్తాను అన్నాను వద్దు అన్నావు. అక్కడ నుంచి దీప తీసుకొనిచ్చావ్. అప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది.
కార్తీక్: పారు జరిగిపోయిన విషయాలు వద్దు.
పారిజాతం: నువ్వు ఎందుకురా నన్ను మాట్లాడనివ్వడం లేదు. నీకు అన్ని విషయాలు అందరి కన్నా ముందే తెలుస్తాయి కానీ ఏం తెలీనట్లు ఉంటావ్. ఈ ఇంటికి సమస్యలు దీప రాకతోనే మొదలయ్యాయి. అది వచ్చిన తర్వాత దాని మొగుడు వచ్చి గేటు దగ్గర గొడవ చేశాడు. జరిగిన విషయాలు అన్నీ ఒక్కక్కటి చెప్పి పారు ఫుల్ ఫైర్ అవుతుంది. 
జ్యోత్స్న: శివనారాయణ ఆపమని పారిజాతాన్ని తిడితే.. తాత గ్రానీని ఎందుకు తిడతావు తాను అన్నదాంట్లో తప్పు లేదు. 
కార్తీక్: జ్యోత్స్న..
జ్యోత్స్న: నువ్వు మాట్లాడకు బావ. నీకు మాట్లాడే అర్హతే లేదు. ఈ రోజు జరిగిన దానికి నేను ఎంత బాధ పడుతున్నానో మీరు ఎవరైనా ఆలోచించారా.
దశరథ్: నీకు ఏమైంది అమ్మ.
జ్యోత్స్న: మరేంటి డాడీ మన ముందు నిల్చొడానికి అర్హత లేని వ్యక్తి బావని తిడుతుంటే..నాకు ఎలా ఉంటుందో ఒక్కసారి అయినా ఆలోచించారా.  
సుమిత్ర: వాడో తాగుబోతు. దీప మీద కోపంతో ఏదో వాగాడు. 
జ్యోత్స్న: ఏమైంది మమ్మీ ఆర్ యూ ఆల్ రైట్. దీపని ఒక్కమాట అంటే చాలు మీరంతా ఎందుకు ఇంతలా వెనకేసుకొస్తున్నారు. దీప విషయంలో బావని నిలదీయాల్సిన అవసరం వాడికేంటి. నీకు నా భార్యకు సంబంధం ఏంటని వాడు బావని నిలదీస్తుంటే మీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు అయితే మనసుకి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది మమ్మీ. అంటూ గట్టిగా ఏడుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి బావ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. బావని ఒక్క చిన్న మాట అంటే అత్తతోనే గొడవ పడేదాన్ని. అలాంటిది వాడు ఎవడు బావని అనడానికి. ఎవరు బావని ఇంత తక్కువ చేసి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. కొన్ని మాటలు అయితే వినడానికే అసహ్యంగా అనిపించింది. అలా అనిపించుకునే పొజిషన్‌లో బావ ఎందుకు ఉండాలి. ఇన్నీంటికి కారణమైన దీపకి మీరు ఎందుకు సపోర్ట్‌గా ఉండాలి. దీప ఎవరు మన బంధువా. వాడితో అన్నావు కదా మమ్మీ దీప నా కూతురు అని. మరి నేను ఎవరిని.. తను నేను సమానం అని మాత్రం నేను అయితే అనుకోలేను మమ్మీ. 
సుమిత్ర: నువ్వు పర్సనల్‌గా తీసుకుంటున్నావ్ జ్యోత్స్న.
జ్యోత్స్న: అరే మమ్మీ నీకు అర్థమవుతుందా.. నాకు కాబోయే భర్తని వాడి భార్యతో ముడిపెట్టి మాట్లాడుతుంటే అది నాకు పర్సనల్‌ కాకుండా ఏమవుతుంది. దీప నిన్ను కాపాడింది. నువ్వు సాయం చేశావు. ఇట్స్ ఓవర్. ఇంకా తనని వెనకేసుకొని రాకండి.. వాడు అడిగిన ఏ ప్రశ్నకు బావ దగ్గర సమాధానం లేదు. వాడు అన్న మాటల్లో నిజం ఉందేమో అనిపిస్తుంది బావ.
కార్తీక్: జ్యోత్స్న..
దశరథ్: కార్తీక్ నువ్వు ఆగు.. ఏంటి జోత్స్న అన్నీ తెలిసిన నువ్వు ఇలానా మాట్లాడేది.
జ్యోత్స్న: నో డాడీ.. ఇప్పటి వరకు జరిగిన వన్నీ ఆలోచిస్తుంటే నిజంగానే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దీప ఇక్కడ ఉండటం వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను. కానీ బావ నా ప్రాణం డాడీ. అది నేను పోగొట్టుకోలేను.
శివనారాయణ: చూడమ్మా లేని పోనివి ఊహించుకొని నువ్వు బాధ పడుతున్నావని అర్థమైంది. ఇందంతా నిజం కాదు. వాడు వాడి భార్య వదిలించుకోవడానికి ఏవేవో అంటున్నాడు.
జ్యోత్స్న: అవి బావ ఎందుకు భరించాలి. బావతోనే ఎందుకు ముడి పెట్టాలి. బావనే ఎందుకు అనాలి. అమ్మ ఇప్పుడు కూడా నీకు దీపే కరెక్ట్ అనిపిస్తుంది కదా. అయినా కన్నకూతుర్ని వదిలేసి దీపని సపోర్ట్ చేయడం ఏంటి.
సుమిత్ర: ఇక్కడ అన్యాయం అయిపోయింది దీప.
జ్యోత్స్న: కాదు నేను. నా బాధని పట్టించుకోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ మీకు కొంచెం కూడా ఆలోచన రావడం లేదు. ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగింది.
పారిజాతం: నీ వల్లే నా మనవరాలికి మనస్శాంతి లేకుండా పోయింది. 
సుమిత్ర: అది మీకు మనవరాలు అయితే నాకు కూతురు. 
పారిజాతం: అది నీ కూతురు కాదు.. నీ కూతురు అయింటే ఇలా వదిలేయవు. ఊరికే నా నోరు మూయించడం కాదు. ముందు ఆ దీప మొగుడి నోరు మూయించండి. 
కార్తీక్: నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నేనంటే నాకంటే బాగా మీకే తెలుసు. సుమిత్రతో.. చిన్నప్పుడు నువ్వు నాతో ఓ మాట అన్నావ్. తప్పు చేస్తే భయపడాలి సారీ చెప్తే నేను అర్థం చేసుకుంటా అని అన్నావ. నీకు సారీ చెప్పే అంత తప్పు నేను ఎప్పుడూ చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు కూడా నీకు సారీ చెప్పను అత్త అర్థం చేసుకో..  


దీప జరిగిన రచ్చ అంతా తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. దీప బాధ పడటం చూసి కార్తీక్ దీప దగ్గరకు వెళ్తాడు. దీప తన బతుకు తనని వదిలేయ్ మని తన కారణంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండండి అని ఇంటికి వచ్చి గొడవ చేసిన నర్శింహ కంటే మిమల్ని చూస్తేనే నాకు భయంగా ఉంది అని అంటుంది.కార్తీక్ దీపని క్లాస్ ఇస్తాడు. నర్శింహ వదలడని.. ఊరు వెళ్తే అక్కడ కూడా బ్యాడ్ చేస్తాడని అంటాడు. భవిష్యత్‌లో శౌర్యకి అన్ని విషయాలు తెలిసిపోతుందని ప్రశ్నించడం మొదలు పెడుతుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్‌ సందడి - లోక్‌సభ ఎన్నికల కోసం హైదరాబాద్‌కు!