Naga Panchami Today Episode: ఒకసారి చనిపోయిన మనిషి మళ్లీ బతకడం అసాధ్యమని.. తాను చనిపోతే మళ్లీ మిమల్ని ఎవర్నీ చూడలేను అని పంచమితో చెప్పుకొని మోక్ష ఏడుస్తాడు. ఒక్కసారి తన వాళ్లతో మాట్లాడాలి అని ఉందని మోక్ష అంటాడు. పంచమి కూడా ఏడుస్తూ మాట్లాడమని చెప్తుంది. మోక్ష ఫోన్ తీస్తాడు. తన ఇంట్లో వాళ్లకి వీడియో కాల్ మాట్లాడుతాడు. అర్జెంటుగా తనని చూడాలి అని వచ్చేయ్ మని ఇంట్లో వాళ్లు రమ్మని అంటారు. తన తల్లితో మాట్లాడుతూ మోక్ష ఏడుస్తాడు.
మోక్ష: నాకు రావాలి అని ఉంది అమ్మా.. నేను వచ్చినా మీరు నాతో ఏం మాట్లాడలేరు. ఎందుకంటే అప్పుడు నాకు ఏ కష్టాలు ఉండవు. అమ్మా ఒకసారి శబరికి ఇవ్వు.
శబరి: మనవడా నువ్వు మా కళ్ల ముందే ఉండాలి.. ఎక్కడికీ తిరగనవసరం లేదు. వెంటనే వచ్చేయ్ మోక్ష.
మోక్ష: ఏం శబరి నేను కంటికి కనిపిస్తేనే గుర్తొంటానా.. లేకపోతే నన్ను మర్చిపోతారా.. త్వరలోనే వస్తాను శబరి నన్ను తనివి తీరా చూసుకొని ఎంత టైం అయినా మాట్లాడు నేను ఎదురు మాట్లాడను. సరేనా..
మీనాక్షి: మోక్ష పంచమి కోసం లేనిపోని అనుమానాలు అన్నీ లేవనెత్తుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే తొందరగా ఇంటికి వచ్చేయండి. మీరు వస్తే కానీ ఆ అనుమానాలు అన్నీ తీరవు.
మోక్ష: పంచమి నా ప్రాణం అత్తయ్య. నేను ఎక్కడ ఉంటే తను అక్కడే ఉంటుంది. నాలో ప్రాణం లేనప్పుడు మాత్రమే తను నాతో కలిసి ఉండలేదు. సరే వదినలకు ఫోన్ ఇవ్వు.
జ్వాల: ఏంటి మోక్ష ఇంట్లో వాళ్లందరిని అడిగి మరీ మాట్లాడుతున్నావ్.
వైదేహి: మోక్ష నువ్వు ఇప్పుడే ఇంటికి వస్తున్నావ్. లేదంటే నా మీద ఒట్టే.
మోక్ష: వస్తాను అమ్మా వస్తాను. ఇక మోక్ష ఇంట్లో అందరూ ఏడుస్తారు. జ్వాల చిత్రలు మాత్రం సంతోషంగా ఉంటారు. ఇక మోక్ష పంచమిని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు.
మరోవైపు ఫణేంద్ర ఓ చోట ఒంటరిగా ఉంటే అక్కడికి పంచమిలా రూపం మార్చుకున్న మేఘన అక్కడికి వస్తుంది.
ఫణేంద్ర: మూలికలు కోసం వెళ్లిన నాగసాధువు వచ్చారా యువరాణి. ఆలస్యం అయితే మళ్లీ నీకే ప్రమాదం.
మేఘన: ఫణేంద్ర నన్ను పంచమి అని నమ్మేశాడు.
ఫణేంద్ర: రాత్రికి రాత్రే నువ్వు వెళ్లి చంద్రకాంత మొక్క తీసుకురావాలి. తెల్లారిన తర్వాత నన్ను నిందించి ప్రయోజనం ఉండదు. మోక్ష ప్రాణాలు పోతే మళ్లీ తిరిగిరావు.
మేఘన: ఆ మంత్రం జపిస్తే నేను కచ్చితంగా నాగలోకం వెళ్లి రాగలనా యువరాజా.. మనసులో.. ఫణేంద్ర నన్ను పంచమి అని నమ్మాడు అంటే ఇక భయం లేదు.
ఫణేంద్ర: ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు యువరాణి. ఇష్టరూపనాగజాతి అత్యంత కఠిన సమయంలో ఆ మంత్రం జపించి నాగలోకం వెళ్లడానికి ఉపయోగించుకుంటుంది. నీ కోసం నేను ఆ మంత్రం దారపోయడానికి సిద్ధపడ్డాను.
మేఘన: ఈ మేఘన ఆ మంత్రం కోసమే కాచుకుకూర్చొంది ఫణేంద్ర.
ఫణేంద్ర: యువరాణి మీరు ధైర్యంగా మోక్షని కాటేయొచ్చు. అప్పుడు నేను ఆ మంత్రం చెప్తాను. మీరు వెంటనే నాగలోకం వెళ్లిపోతారు. ఆ మొక్కని తెచ్చేస్తారు.
మేఘన: ఆ మంత్రం ఇప్పుడే చెప్పు యవరాజా.
ఫణేంద్ర: అంటే కాటేసిన తర్వాత నేను చెప్పను అని భయమా యువరాణి. సరే అయితే ఇప్పుడే చెప్తాను. నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా విను. కానీ నోటితో మాత్రం చెప్పొద్దు. మంత్రం మనసులో ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు. కానీ నాగలోకాన్ని మనసులో తలచుకొని వెంటనే నాగలోకం వెళ్లాలిఅని బలంగా నమ్మి ఈ మంత్రం పటిస్తే చాలు వెంటనే వెళ్లిపోవచ్చు. ఇక మంత్రం ఫణేంద్ర పంచమి అనుకొని మేఘనకు చెప్పేస్తాడు.
మేఘన: మొత్తానికి ఈ ఫణేంద్రను వంచించి మంత్రం సంపాదించాను. ఇక నాగలోకం వెళ్లి నాగమణిని సంపాదించాలి.
నాగసాధువు: వెతికి వెతికి రెండు మూడు మూలికలు తీసుకొచ్చాను అమ్మా.. ఇవి అన్ని రకాల విషాలకు కాస్త ఉపశమనం ఇస్తాయి.
పంచమి: అంతా ఫణేంద్ర మీద ఆధారపడి ఉంది స్వామి. తను చెప్పింది అంతా వాస్తవం అయితే ఏ సమస్యా ఉండదు.
నాగసాధువు: ఫణేంద్ర మాటల్లో నాకు ఏ మాత్రం అనుమానం ఉన్నట్లు తోచడం లేదు పంచమి.
మోక్ష: ఒకవేళ అతను అబద్ధం చెప్పినా మనం చేయగలిగింది లేదు స్వామి.
ఫణేంద్ర: మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగండి ఆలస్యం మాత్రం చేయొద్దు.
నాగసాధువు: నేను కొన్ని వేర్లు తెచ్చాను ఫణేంద్ర. అవసరం అయితే ఉపయోగిద్దాం. కాటు వేయకముందే ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలేమో నువ్వే చెప్పాలి.
ఫణేంద్ర: భయపడితే రక్త ప్రసరణ వేగంగా జరిగి విషం త్వరగా తలకెక్కి మెదడు పనిచేయడం మానేస్తుంది. పరిస్థితి అంత వరకు రానివ్వకూడదు. విషం శరీరం లోకి వెళ్తున్న కొద్ది భరించలేని బాధగా ఉంటుంది. దాని వల్ల మనం కేకలు వేస్తూ అవయవాలు అటూ ఇటూ కదిలించడం వలన విషం త్వరగా రక్తంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
నాగసాధువు: బాధ తెలీకుండా ఉండటానికి ఏమైనా మూలికలు ఉపయోగించవచ్చా.
ఫణేంద్ర: దానివల్ల శరీరం మొద్దబారి నిద్ర ముంచుకొస్తుంది. ఏ కీటకం కుట్టినా వీలైనంత వరకు కళ్లు మూతలు పడకుండా.. నిద్ర రాకుండా చూసుకోవాలి. ఎంత బాధనైనా పంటి కింద బిగపెట్టుకొని శ్వాస కొంచెం కొంచెం తీసుకొని చనిపోతాను అన్న భయాన్ని వదిలేసి గుండె నెమ్మదిగా కొట్టుకునేలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. నేను పక్కనే ఉంటాను కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా చెప్తూ ఉంటాను. యువరాణి పాముగా మారిన వెంటనే కాటు వేయడం మంచిది. ఆలస్యం అయ్యే కొద్ది కోరల్లోకి విషం ఎక్కువగా చేరుతుంది. చీకటి పడి చాలా సేపు అయింది. ఇంకా ఆలస్యం చేస్తే రాత్రి లోపు నాగలోకం వెళ్లి ఆ మూలికలు తీసుకురావడం కష్టం అని ఫణేంద్ర చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 16th: ఆరిపోయిన హారతి, ముకుందపై మళ్లీ కృష్ణకు అనుమానం వచ్చిందా!