Krishna Mukunda Murari Today Episode : పంతులు ముకుందతో ఒక సారి మీ భర్తను కూడా రమ్మని చెప్పండి అని అంటే ముకుంద ఫీలవుతుంది. ఇంతలో కృష్ణ వాళ్ల అయిన మిలటరీ ఆఫీసర్ తర్వాత వస్తారు అని చెప్తుంది. తర్వాత అందరి దంపతులతో పంతులు మొక్కకి నీరు పోయిస్తారు. ఇక భవాని తన కుటుంబంలో కలహాలు రాకుండా.. తాను కలలు కన్న తన కుటుంబాన్ని తీర్చిదిద్దు అని దేవుడికి కోరుకుంటుంది. తర్వాత కృష్ణ హారతి ఇస్తుంది. ఇక తాను తీసుకుంటానని ముకుందకు హారతి పళ్లెం ఇస్తుంది. ఇక కృష్ణ హారతి తీసుకునే టైంలో ఆగిపోతుంది.
ముకుంద: అంతా నా వల్లే నేను చేసిన తప్పునకు ఏ దేవుడు క్షమించడు. కృష్ణ ప్లీజ్ ఏం అనుకోకు. నీకు ఏం జరగదు కృష్ణ.
కృష్ణ: ఊరుకో ముకుంద.. ఏం కాదు.
రేవతి: అక్క నాకు కొంచెం భయంగా ఉంది అక్క. ఇందాక పూజలో అలా జరగడం. పంతులు గారు కూడా భయపడ్డారు.
భవాని: నువ్వేం టెన్షన్ పడకు రేవతి. ఇన్నాళ్లు వాస్తవాలు తెలీక సమస్యలు సృష్టించుకున్నాం. కానీ ఇప్పుడు అన్నీ తెలిశాక ఆ మాత్రం ప్రమాదాన్ని ఆపలేమా..
మధు: బ్రో స్పీడ్‌గా నడవకు నీకు పంచె కట్టుకోవడం రాదు కదా.. ఊడిపోగలదు.
మురారి: అలా ఏం లేదు కృష్ణ కట్టింది ఇప్పుడు కబడ్డీ కూడా ఆడొచ్చట.
కృష్ణ: సార్ మీరే కట్టుకున్నాను అని చెప్పొచ్చు కదా నా పేరు చెప్పకపోతే ఏమయ్యేది.
మరోవైపు మురారి భవాని సెల్ తేవడానికి మేడ మీదకు వెళ్తాడు. అయితే మురారి పంచె ఊడేలా ఉంటుంది. దాన్ని కృష్ణ చూస్తుంది. అనవసరంగా ఇందాక పంచె తొక్కాను అని తనని తాను తిట్టుకుంటుంది. ఇక పంచె ఊడే టైంలో మురారికి డైనింగ్ టేబుల్ దగ్గర ఛైర్ ఇస్తూ కూర్చొమంటుంది. అందరూ భోజనాలు చేస్తారు. తర్వాత పతంగులు ఎగరేయాలి అనుకుంటారు.
మురారి: పంచె ఊడిపోయేలా ఉంది కృష్ణ ఏం చేయను.
కృష్ణ: నేను ఇందాకే చూశాను.
భవాని: ఏమైంది మురారి.
మురారి: కృష్ణ అందరి తిండి అయిపోయింది. నాదీ అయిపోయింది. నేను ఇప్పుడు ఎలా లేవాలి. మీరందరూ వెళ్లండి నేను మొదటి నుంచి తింటాను.
కృష్ణ: ఆపండి సార్ ఆ షాక్‌తో ఇంకెంత తింటారు. ఏం లేదు. ఏసీపీ సార్ పంచె ఊడిపోయింది. మీరందరూ ఉన్నారని ఆ షాక్‌తో తింటూనే ఉన్నారు.
రేవతి: రేయ్ ఆ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదరా.. పదండి అక్కా.
ఇక అందరూ మేడ మీదకు వెళ్లి గాలిపటాలు ఎగరేస్తారు. ఇక కృష్ణ మురారి అనుకొని భవానితో ఏవేవో అనేస్తుంది. ఇక మురారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఇక ముకుంద కృష్ణ గాలిపటం కట్ చేసేస్తుంది. దీంతో కృష్ణ బుంగ మూతి పెట్టుకుంటుంది. తర్వాత మురారి గాలిపటం ఎగరేస్తుంది.
కృష్ణ: (ముకుందకు తనకు మధ్య జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటూ) ఏంటి ముకుంద మారదు అని హారతి సూచిస్తుందా.. గాలిపటం కావాలనే తెంపేసిందా.. లేదు లేదు ఎంతైనా ముకుంద ఆడపిల్ల ఇంత దారుణంగా బిహేవ్ చేయదు.
మురారి: కృష్ణ ఒక్కదానివే రూంలో ఏం చేస్తున్నావ్.. సరే కానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పాలి. సినిమా రిలీజ్ చేయడానికి ముందు ఏం చేస్తారు.
కృష్ణ: టీజర్ రిలీజ్ చేస్తారు. అయినా మధుని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగతారు ఏంటి.
మురారి: అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సరే.. ఎలక్షన్ ముందు ఏం చేస్తారు.
కృష్ణ: ప్రచారం చేస్తారు.
మురారి: వెరీగుడ్.. సినిమా రిలీజ్‌కు ముందు టీజర్ ఎలాగో రేపు మన శోభనానికి ముందు ఇప్పుడు టీజర్ రిలీజ్ చేద్దామా..
కృష్ణ: అదేం కుదరదు. ఆదర్శ్ వచ్చాక ముకుంద లైఫ్ సెట్ అయ్యాక.
మురారి: ఇన్ని రోజులు నేను నీ మాట విన్నాను ఇప్పుడు నువ్వు నా మాట విను. నేను నీ మొగుడిని కాబట్టి పెళ్లం నా మాటే వినాలి.
ఉదయం కృష్ణ ముగ్గు పెట్టడానికి వస్తే అంతకు ముందే ముగ్గు వేసి రంగులు కూడా వేసుంటారు. కృష్ణ వచ్చి అందరినీ అడుగు తుంది ఎవరు వేశారు అని. ఎవరు వేశారా అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్ జనవరి 16: విశాలాక్షి చేయి పట్టుకొని పాము అంటూ రచ్చ చేసిన తిలోత్తమ!