Naga Panchami Today Episode:

  నాగకన్య నాగదేవతని దర్శించుకొని యువరాణి నాగలోకం వచ్చిందని చెప్తుంది. దాంతో నాగదేవత నిజమా యువరాణి ఎక్కడ ఉంది. యువరాజు ఈ విషయం నాకు చెప్పలేదు అని నాగదేవత ప్రశ్నిస్తుంది. యువరాణిని ఎవరూ తీసుకురాలేదని తనే దొంగతనంగా వచ్చిందని నాగకన్య చెప్తుంది.


నాగదేవత: యువరాణి దొంగతనంగా వచ్చిందా.. నువ్వు చెప్పిన దానిలో ఏదైనా తప్పిదం ఉంటే నీకు మరణ శిక్ష తప్పదు.
నాగకన్య: తెలుసు మాతా. నేను నా కంటితో చూశా యువరాణి నీటి అడుగున ఉన్న నాగ చంద్రకాంత మొక్కను దొంగిలించుకొని వెళ్తుంటే నేను పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ తాను ఏదో మంత్రం చదివి నాకు దొరకకుండా మాయం అయిపోయింది మాతా. నేను చెప్పేది నిజం మాతా.
నాగదేవత: ఒక ముఖ్యమైన సమాచారం ధైర్యంగా నాతో చెప్పినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను. ఇక నువ్వు వెళ్లొచ్చు. యువరాణి ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. యువరాణి, యువరాజు కలిసి నాకు తెలీకుండా ఏవో కుయుక్తులు పన్నుతున్నారు. నన్నే మోసం చేసి నాగలోకానికి ద్రోహం తలపెట్టిన యువరాణిని, యువరాజును క్షమించకూడదు. 


మహాంకాళి: (పంచమి రూపంలో ఉన్న మేఘన చంద్రకాంత మొక్కతో భూలోకంలోకి వస్తుంది.) మహాంకాళి పెద్దగా నవ్వుతూ.. కంటితో చూస్తే కానీ నాగమణి మహాత్యం నీకు తెలీలేదా కరాళి.. ఈ మొక్క నీ అన్నను ఏమాత్రం బతికించలేదు. కేవలం విషానికి విరుగుడుగా మాత్రమే పనిచేస్తుంది. పోయిన ప్రాణాలను తిరిగిపోయలేదు. నాగలోకం వెళ్లి నువ్వు నీ శక్తులన్నీ పొగొట్టుకున్నావు. నాగమణిని సంపాదించుకోలేకపోయావు. ఇక నువ్వు ఓ సాధారణ మనిషిలానే జీవించాలి.
కరాళి: అలా నేను బతకలేను మాతా. మాంత్రికురాలిగా మాత్రమే ఈ కరాళి బతకాలి.
మహాంకాళి: అది ఇక జరగని పని.. నీకు తిరిగి శక్తులు కావాలి అంటే నువ్వు ఓ పని చేయాలి కరాళి. కఠిన బ్రహ్మచర్యంతో ఉన్న మోక్షని ఆహుతి ఇవ్వగలిగితే నీకు నీ శక్తులు తిరిగి వస్తాయి. చెప్పు కరాళి ఆ సాహసం నువ్వు చేయగలవా.. ఆ శక్తులు అలాంటి బలినే కోరుకుంటాయి.
కరాళి: అందుకు నేను సిద్ధమే.. నా రూపాన్ని నాకు తిరిగి ప్రసాదించండి. ఈ మొక్కని ఇక్కడే దాచి అక్కడి పరిస్థితి చూడాలి. నేను పంచమి రూపంలో నాగలోకం వెళ్లినట్లు అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా చూడాలి. 


నాగదేవత: చూడమ్మా నువ్వు పంచమిని దూరంగా తీసుకెళ్లు. 
పంచమి: నేను వెళ్లను స్వామి మోక్షా బాబుని వదిలి నేను ఎక్కడికి వెళ్లను నేను ఇక్కడే చనిపోతాను.
గౌరి: పంచమి మోక్షాకు ఏమీ కాదు. నీ శివయ్యే బతికిస్తాడు.
ఫణేంద్ర: ఏంటి మేఘన ఇంత ఆలస్యం అయింది.
పంచమి: ఘోరం జరిగిపోయింది మేఘన మోక్షాబాబు ఎలా అయిపోయాడో చూడు.
మేఘన: అయ్యో చూస్తుంటేనే భయం వేస్తుంది.
ఫణేంద్ర: నాగదేవతకు తెలిసిపోయినట్లుంది అందుకే అంతా చెడగొట్టింది. 
మేఘన: స్వామి నాకు చాలా రకాల వైద్యాలు తెలుసు. నాకు తెలిసిన విద్యతో చాలా మందికి నయం చేశాను. 
నాగసాధువు: తప్పులేదు అమ్మా నీకు తెలిసిన వైద్యం చేయి. ఇప్పుడు చేయి దాటిపోయిన సమయం. మనకు తెలిసిన అన్ని వైద్యాలు చేస్తేనే మేలు. ఈ సృష్టిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అమ్మా.. ఈ అడవిలో అన్ని రకాల మూలికల మొక్కలు దొరుకుతాయి. నువ్వు వెళ్లి నీకు కావాల్సిన ఆకులు, మొక్కలు వెతుకమ్మా... తప్పకుండా దొరకుతాయి. 


మోక్ష కుటుంబ సభ్యులు అంతా చేరుకుంటారు. వాళ్లని చూసిన మేఘన వాళ్లకు కనపడకుండా దాక్కుంటుంది. మోక్షని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తారు. డాక్టర్ మోక్షని చూస్తాడు. ఇక ప్రయోజనం లేదని.. పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్తాడు. పేరుకు గుండె కొట్టుకుంటుందని.. మోక్ష ఇక లేనట్లే అని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. అందరూ పెద్దగా ఏడుస్తారు. 


మేఘన: ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి.. మోక్షాబాబుకి ఏం కాదు. నేను చాలా సేపు వెతికితే అడవిలో ఒక అరుదైన మొక్క కనిపించింది. నాకు తెలిసి ఈ పసరు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. 
నాగసాధువు: అది ఏం మొక్క తల్లి. నాకు తెలిసి అలాంటివి ఈ అడవిలో లేవు.
మేఘన: నాకు ఇది ఏ మొక్కో తెలీదు స్వామి కానీ ఈ అడవిలో విచిత్రంగా ఈ ఆకులు కనిపించాయి. ఎంత వరకు పనికొస్తుందో తెలీదు. కానీ ఏదో ప్రయత్నం చేద్దాం. 
వైదేహి: ఏదో ఒకటి చేసి నా బిడ్డని బతికించమ్మా.. మేఘన చంద్రకాంత మొక్క ఆకులు రసం మోక్షకు పడుతుంది. మరోవైపు ఫణేంద్రకు అనుమానం వస్తుంది. అలా చూస్తూ ఉంటాడు. మేఘన మోక్షకు ఆ చంద్రకాంత మొక్క పసరు పట్టగానే మోక్ష ఎప్పటిలా మారి కళ్లు తెరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ జనవరి 20th: చేతులు కలిపిన రుద్రాణి, అనామిక – కావ్యకు శ్వేత, రాజ్ క్లోజ్ గా ఉన్న వీడియోస్ పంపిన అజ్ఞాత వ్యక్తి