Krishna Mukunda Murari Today Episode: రేవతి అందరి కోసం భోజనాలు సిద్ధం చేస్తుంది. భవానిని పిలిచావా అని నందూని అడుగుతుంది. ఇక నందూ ముకుంద కోసం అడిగితే అప్పుడే ముకుంద వస్తుంది. తాను వడ్డిస్తాను అని రేవతిని అడుగుతుంది. అందుకు రేవతి వద్దు అంటుంది.


ముకుంద: చిన్నత్తయ్య నా బాధను అర్థం చేసుకోండి. పెద్దత్తయ్యకి నేను ఎదురుగా ఉంటే గిట్టడం లేదు. ఇక్కడ కూర్చొంటే తాను వెళ్లిపోతుంది. ప్లీజ్ చిన్నత్తయ్య దయచేసి కూర్చొండి. 
కృష్ణ: మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. పెద్దత్తయ్య మీకు ఓ గుడ్ న్యూస్.
భవాని: ఏంటో చెప్పు కృష్ణ. ఏంటి చెప్పవే..
కృష్ణ: అదే ఆదర్శ్‌ ఆచూకి తెలిసింది. రేపు వెళ్లి మేం అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తున్నాం.
భవాని: అవునా కృష్ణ. వెరీగుడ్. 
మురారి: అవును పెద్దమ్మ మేం తిరిగి వచ్చేది ఆదర్శ్ తోనే.. 
కృష్ణ: ( ముకుందని భోజనానికి కూర్చొమంటే భవాని కోపంతో మధుని అక్కడికి పిలుస్తుంది. దీంతో ముకుంద ఏడుస్తూ వెళ్లిపోతుంది.) అంటే మీరు ముకుందని వడ్డించొద్దు అన్నారు. కనీసం పక్కన కూడా కూర్చొవద్దు అన్నారు అందుకే బాధతో వెళ్లిపోయింది.
భవాని: కృష్ణ అనవసరమైన విషయాలు చెప్పకుండా ఒక మంచి విషయం చెప్పావు దాని గురించి మాట్లాడు. ఆదర్శ్ రావడం అనేది మంచి విషయమే.. కానీ వచ్చాక ఏం జరుగుతుందో అదే తెలీడం లేదు.
కృష్ణ: చెప్పాను కదా అత్తయ్య ఏం జరిగినా నాదే బాధ్యత అని.
భవాని: మురారి రేపు మీరు వెళ్తున్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు. నీ స్థానంలో ఆదర్శ్.. ఆదర్శ్ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావ్ ఇంటికి వస్తావా.. తీసుకొచ్చిన అంత తేలిక కాదు ఇక్కడ ఉండటం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వాడు రావడం ఎంత సంతోషంగా ఉందో వచ్చాక ఏం జరుగుతుందో అనే టెన్షన్ అంత కన్నా ఎక్కువగా ఉంది. 


మెహతా: సార్.. ఆదర్శ్‌ జాబ్ రిజైన్ చేశాడు. అవును సార్ ఆరు నెలలు అవుతుంది అంట.
కృష్ణ: రిజైన్ చేసి ఎక్కడు ఉంటున్నాడు.
మెహతా: అక్కడే దగ్గర్లో పల్లెటూరిలో ఉంటున్నాడు. ఇంతకాలం దేశానికి సేవ చేసినందుకు ఆ ఊర్లో ఆర్మీ అతనికి ఆ స్థలాన్ని ఇచ్చారంట. అక్కడే ఉంటున్నారు. 
కృష్ణ: ఆ ఊరి పేరు తెలుసా..
మెహతా: ఆ ఊరి పేరు యూరి అండి కశ్మీర్‌కు కొద్దిగ దూరంలో ఉంది. ఇక కారులో కృష్ణ, మురారి బయల్దేరుతారు. 


ముకుంద: ఇప్పుడు ఆదర్శ్ వస్తే ఏం చేయాలి. మురారికి ఆదర్శ్‌తో కలిసి ఉంటాను అని మాటిచ్చాను. ఉండాలా.. నా ప్రేమను చంపుకోవాలా.. 
ముకుంద ఆత్మ: చంపుకోవాలి తప్పదు.
ముకుంద: చంపుకోవడానికా నేను ఇంతకాలం ఎదురు చేసింది.
ముకుందఆత్మ: వెయిట్ చేసి ఏం చేశావ్ నువ్వు చీటర్‌వి అని మీ పెద్దత్తయ్య మనసులో నాటుకునేలా చేశావ్. 
ముకుంద: పెద్దత్తయ్య ఇవాళ కాకపోయినా రేపు అయినా మారుతుంది. నేను ఎవరి మాట వినను. వెళ్లిపో..


మరోవైపు మురారి, కృష్ణలు కారులో ఆదర్శ్‌ కోసం బయల్దేరుతారు. ఇద్దరూ మధ్యలో ఆదర్శ్ గురించి మాట్లాడుకుంటారు. మధ్యలో ఓ చోట హోటల్‌ దగ్గర ఆగి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు. తినేసి కశ్మీర్ చేరుకుంటారు. అక్కడ మెహతా చెప్పిన యూరి వచ్చేస్తారు. ఆదర్శ్ కోసం వెతుకుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: త్రినయని సీరియల్ జనవరి 20th: తన మీద ఒట్టు వేసి గాయత్రీ దేవి జాడ చెప్పమన్న నయని.. విశాలాక్షిని చూపించిన విశాల్!