Trinayani Today Episode: విశాల్ తిలోత్తమ వడ్డించిన పాయసం తింటాడు. దీంతో తిలోత్తమ పునర్జన్మలో పుట్టిన గాయత్రీ దేవిని నువ్వు చూశావా అని విశాల్‌ని అడుగుతుంది. దీంతో విశాల్ చూశానని చెప్తాడు. నయనితో పాటు అందరూ షాక్ అవుతారు. ఇక విక్రాంత్, సుమను ఇంటి నుంచి వెళ్లిపోమంటే.. విశాల్ అక్కడికి వస్తాడు. నయని కూడా వచ్చి ఎంతో ప్రేమగా ఉండే తన భర్త ఇన్నాళ్లు గాయత్రీ అమ్మగారి జాడ తనతో చెప్పలేదు అని ఫీలవుతుంది. ఇక విశాల్ నేను చెప్పను మీరు లోతుగా ఆలోచించండి అని అంటాడు.
నయని: మమల్ని లోతుగా ఆలోచించమని అంటారు కానీ మీరు మాత్రం విషయాన్ని పూర్తిగా విడమర్చి చెప్పరు అంతే కదా బాబుగారు..
విశాల్: ఇప్పుడు అమ్మ విషయం పొడిగించిన కొద్ది కొత్త సమస్యలు వస్తాయి నయని.
సుమన: అర్థమైందా అక్క తొమ్మిది నెలలు బిడ్డని కడుపులో మోసి పురుటినొప్పులు పడేది మనం. మీ మగాళ్లేమో ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు అని నోర్లు మూయించి సమాధానం దాటేస్తారు.
విక్రాంత్: ముందు నువ్వు నాకు ఏం అన్యాయం చేయబోతున్నావో అది చెప్పు తర్వాత ఈ సమాధానం చెప్తారు.
సుమన: మీ పెద్దమ్మ ఎక్కడ అన్నప్పుడు విశాల్ బావగారే నోరు మెదపనప్పుడు నా నుంచి సమాధానం ఆశించకండి. నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయాలి అని చూస్తే పొద్దున్న నా శవాన్ని మీరు బయట పెడతారు చెప్తున్నా.
నయని: చెల్లి ఏంటి ఆ మాటలు..
సుమన: బెదిరింపు కాదు అక్క. పగలు ఆడపిల్లలా.. రాత్రి పాము పిల్లలా ఉండే నా కూతురుని మీ మరిది గారు చూసుకోలేరు అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను.
ధురందర: వదినా రేపు గాయత్రీ అక్కయ్య ఇంటికి వస్తుంది కదా..
హాసిని: మీరు అలా చెప్తే గుండె ఆగి పోయేలా ఉన్నారు వీళ్లిద్దరూ..
తిలోత్తమ: మేమెందుకు పోతాం.
హాసిని: ఎక్కడికి పోరా.. ఈ పాటికి నడవడం వచ్చిన గాయత్రీ అత్తయ్య కోసమైనా వెతుక్కుంటూ వెళ్లాలి కదా..
తిలోత్తమ: ఇదిగో వస్తుంది అదిగో వచ్చింది అని చెప్తునూ ఉన్నారు. కానీ రావడం లేదు.
ధురందర: తీసుకురావడం లేదు అంతే. అవును వదినా విశాల్ తన మొదటి బిడ్డను చూశాను అని చెప్పకనే చెప్పాక ఇక రాదు అని అమాయకపు ప్రశ్నలు ఎందుకు.
వల్లభ: చూశాను అన్నాడు కానీ ఎక్కడ, ఎప్పుడు చెప్పలేదు కదా..
పావనా: అడగలేదు.. చెప్పలేదు.. పాయసం తిన్నాక ఒకే ప్రశ్న అడిగారు అంతేకదా..
తిలోత్తమ: రేపు అడగొచ్చు కదా..
హాసిని: చెల్లికే ఇప్పటి వరకు చెప్పని వాడు మనం అడిగితే చెప్తాడా..
తిలోత్తమ: నాకు కావాలి.. విశాల్ చెప్పే సమాధానం..
ధురందర: ఏదో కారణం ఉండే చెప్పలేదేమో.. మా ఆయన అన్నట్లు ఏదో కారణం ఉండే ఉంటుంది కాదా.
వల్లభ: కానీ మేము వదలం కదా.. కచ్చితంగా నిజం రాబట్టే తీరుతాం.
హాసిని: మనసులో.. వీళ్లు వదిలేలా రారే.. ఎంత దారి మల్లించినా గాయత్రీ అత్తయ్య గురించే మాట్లాడుతున్నారే..
సుమన: గాయత్రీ అత్తయ్యని చూశాను అని విశాల్ బావగారు అన్నారు కదా.. ఏమక్కా అడిగావా ఎక్కడ, ఎప్పుడు అని..
నయని: ఇన్నాళ్లు ఎందుకు చెప్పకుండా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను.
విశాలాక్షి: ఇక ఊరికే ఉండటం అనవసరం.
వల్లభ: ఆ పాయసం వల్ల అసలు నిజమే కాదు అసలు రంగు కూడా బయట పడింది. ఈ గారడి పిల్లకు థ్యాంక్స్.
విశాల్: ఏమైంది ఎందుకు అందరూ ఇలా నిల్చొన్నారు.
తిలోత్తమ: కన్న కూతురుని విశాల్ చూశాను అని నిన్న చెప్పాడు కదా.. ఎక్కడ ఉందో చెప్తే వెళ్లి సాదరంగా ఇంటికి తీసుకురావాలి అనుకున్నాం.
నయని: గాయత్రీ అమ్మగారిని ఎక్కడ చూశారు బాబుగారు.
విశాల్: గుడిలో..
తిలోత్తమ: ఇప్పుడు తను ఎక్కడ ఉంది.
వల్లభ: ఈ ప్రశ్నను తమ్ముడు మూగబోతాడు అని తెలిసే వాళ్ల అమ్మ ఫొటో తెచ్చాను మమ్మీ.
తిలోత్తమ: ఈ ఫొటో మీద ప్రమాణం చేసి గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో విశాల్ చెప్పాలి.
హాసిని: ఇది అన్యాయం..
సుమన: మీరు చెప్పండి బావగారు..
నయని:( తిలోత్తమ విశాల్ చేతిని తీసుకొని గాయత్రీ దేవి ఫొటో మీద ఒట్టు పెట్టించబోతే.. వెంటనే నయని ఆ చేతిని తీసుకొని తన మీద ఒట్టు పెట్టించుకుంటుంది.) అవును బాబుగారు మీరు ఒట్టు వేయాల్సింది. అమ్మగారి ఫొటో మీద కాదు నామీదే. ఎందుకు అంటే నా బిడ్డ విషయంలో ఇప్పుడు మీరు అబద్ధం చెప్తే పోయేది నా ప్రాణం అని మీరు గుర్తుపెట్టుకోండి.
విక్రాంత్: పాపం అందరూ కలిసి బ్రోని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు.
విశాల్: చెప్తాను.. నేను కన్న కూతురు ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది. ఈ ఇంట్లోనే ఉంది. అంటూ విశాల్ విశాలాక్షిని చూపిస్తాడు.
పావనా: ఇలా చెప్పావ్ ఏంటి అల్లుడూ నేను ఊహించలేదు.
వల్లభ: ఏయ్ చిన్న పిల్లగా ఉండాల్సిన గాయత్రీ పెద్దమ్మ ఇంత పెద్ద పిల్లగా ఎలా ఉంటుంది.
తిలోత్తమ: అమ్మానాన్న అన్నందుకు విశాలాక్షిని మీ కూతురులా చూస్తారు కానీ మీరు అయితే కనలేదు విశాల్.
విశాల్: నేను నిజమే చెప్తున్నా అమ్మా.
తిలోత్తమ: ఈ విశాలాక్షి మీరు కన్న కూతురా..
విశాల్: అవును.
ఫ్లాస్ బ్యాక్‌లో విశాల్, హసిని ఏం చేయాలా అని మాట్లాడుకుంటారు. అప్పుడు విశాలాక్షి వస్తుంది. గాయత్రే మీ కన్నకూతురు అని నీకు తెలిసిపోయిందా అని విశాల్, హాసినిలు కంగారు పడతారు.
విశాలాక్షి: నేను చెప్పేది కంగారు పడకుండా వినండి.. నాన్న గాయత్రీ పాపనే తన కన్నబిడ్డ అని చెప్తూనే వాళ్లని ఆయోమయంలో పడేయాలి.
విశాల్: విశాలాక్షి నిజం చెప్తే వాళ్లు ఊరుకుంటారా..
విశాలాక్షి: ఊరుకోరు నాన్న నా మీద పడి అరుస్తారు.
హాసిని: నీకు ఏంటి సంబంధం.
విశాలాక్షి: నేనే నాన్న కన్న కూతురు అని చెప్తారు కాబట్టి. ఎందుకుంటే వీళ్లు ఆరోజు గుడిలో కన్నది నన్ను.
హాసిని: నిన్ను కనడం ఏంటి..
విశాల్: వదినా ఆగు మనం గుడిలో విశాలాక్షిని చూడలేదు అని చెప్తుంది.
విశాలాక్షి: గాయత్రీ పాపలా చూశారు. అవును నాన్న జీవం అందరికీ నిజం చెప్తూ గాయత్రీ పాప వైపు చేయి చూపించాడు. అయితే తన ప్రాణం పోకపోవడానికి కారణం అప్పుడు గాయత్రీ పాపలా అతడికి కనిపించి దారి మళ్లించింది నేనే. నీ కన్న కూతురు నీ దగ్గర ఉంటే నేను గారడి చేస్తూ గాయత్రీ పాపలా కాస్త ముందుకు వెళ్లి జీవానికి కనిపించాను. అంటే అప్పుడు గాయత్రీ నేనే కదా..
హాసిని: ఇప్పుడు కూడా గాయత్రీ నువ్వే అన్నా తప్పులేదు ప్లాన్ అర్థమైంది విశాల్.
విశాల్: అవును వదినా విశాలాక్షి చేసే మ్యాజిక్ ఇలా ఉపయోగపడింది. థ్యాంక్యూ సోమచ్ తల్లి.
సుమన: ఈ కొత్తనాటకం ఏంటి అత్తయ్య మా అక్క పెళ్లి అయి నాలుగేళ్లే అవుతుంది. పదేళ్లు ఎక్కడ అవుతుంది. ఇదేంటి..
తిలోత్తమ: నిజం చెప్పు విశాల్ నీ భార్య మీద ఒట్టు వేశావు.
నయని: బాబుగారు మన బిడ్డ విషయంలో అమ్మగారి విషయంలో మీరు తమాషా చేయరు ఇలా ఎందుకు చెప్తున్నారు అని నయని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్ జనవరి 19th: నాగదేవతకు నిజం చెప్పిన నాగకన్య, విషమంగా మోక్ష పరిస్థితి