Naga Panchami Today Episode: మోక్ష కోసం వైదేహి ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షి పాలు తీసుకొచ్చి ఇచ్చినా తాగదు. ఇంట్లో అందరూ దిగులుగా కూర్చొని ఉంటారు. వైదేహికి తన భర్త రఘురామ్ నచ్చచెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మోక్ష తాత ఫొటో గోడ మీద నుంచి కింద పడిపోతుంది. దీంతో శబరి తన భర్త ఫొటో పట్టుకొని మోక్షా.. మోక్షా అని ఏడుస్తుంది. 


శబరి: అయ్యో భగవంతుడా మోక్షాకు ఏం కాకుండా చూడు స్వామి. నా మనవడు నిండు నూరేళ్లు బతకాలి స్వామి. అర్థాంతరంగా నా మనవడిని తీసుకెళ్లిపోవద్దు స్వామి. 
రఘురామ్: అమ్మా ఇప్పుడు ఏమైంది. నాన్న ఫొటో కింద పడితే మోక్షని తలచుకొని ఏడుస్తావెందుకు.
శబరి: నీకు తెలీదురా.. దేవుడి మాయలు రకరకాలుగా ఉంటాయి. కారణం లేకుండా ఏదీ జరగదురా.. దేవుడు మనకు అన్నీ చూపిస్తాడు. కానీ మనమే వాటిని గుర్తించలేము. మోక్షా.. ఫొటో ఊరికే కింద పడలేదురా రఘురాం. నా మనవుడు క్షేమంగా ఉండాలి. కావాలంటే నన్ను తీసుకెళ్లిపో స్వామి నా మనవడిని కాపాడు. చెప్పటానికి నాకు నోరు రావడం లేదురా కానీ మీకు చెప్పాలి. చెప్తాను. 


ఫ్లాష్ బ్యాక్


శబరి భర్త ఓ ఎరుపు రంగు క్లాత్‌లో కొబ్బరికాయ, ఆకువక్క, పసుపుకొమ్ములు కలిపి ముడుపులా చుడతారు. ఎందుకు అలా కడుతున్నారు అని శబరి అడిగితే నా ప్రాణాన్ని ఇందులో వేసి కడుతున్నాను శబరి అని తన భర్త సమాధానం ఇస్తారు. ఆ ముడుపును తీసుకెళ్లి దేవుడి దగ్గర ఉంచుతారు. 


శబరిభర్త: ఆ ముడుపు ఎందుకు కట్టానో చెప్తాను శబరి. మా వంశపార పర్యంగా నాగ గండం ఉంది. దీంతో మా వంశంలో తరానికి ఒక్కరు చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కట్టిన ఈ ముడుపు చెడిపోయేటప్పుడికి నా గండం దగ్గర పడినట్లు. అందులో ఉంచిన కొబ్బరికాయ నల్లగా అయిపోతే అందులో గండం ఉన్న వ్యక్తి మరణానికి దగ్గర అయినట్లు లెక్క.
శబరి: ఆ గండం నుంచి బయట పడే మార్గం చూడండి. పాముకాటుకి ఇలా మన వంశంలో ఎంత మంది బలి అవుతారు అండీ.
శబరిభర్త: నిజమే శబరి.. కానీ దాన్ని తప్పించలేం శబరి. మా పెద్ద వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను కూడా ఎంతో మందిని సందర్శించాను. కానీ ప్రయోజనం లేదు. మా తాతగారు నాగగండంతో చనిపోయారు. ఆ గండమే నాకు ఉంది. అలాగే మన మనవడు మోక్షా జాతకంలోనూ ఉంది. నా కోసం కాకపోయినా మన మనవడు గండం తప్పించం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నా శబరి. 


శబరి: (ప్రస్తుతం) నాకు అది అపశకునంలా అనిపించి వెళ్లి ముడుపు విప్పి చూశాను. ఆ ముడుపులోపల నల్లగా మాడిపోయినట్లు ఉంది. చూస్తే తెల్లారే నాటికి మీ నాన్నగారు చనిపోయి ఉన్నారు. మీకు ఎవరికీ తెలీకుండా మన మోక్షకి కూడా నాగగండం ఉందని ముడుపు కట్టి పూజగదిలో ఉంచాను. ఆ ముడుపు విప్పి చూసే ధైర్యం నాకు లేదు. నేను తట్టుకోలేను రా.. మీరు కూడా ఎవరూ దాన్ని విప్పకండి. 
జ్వాల: మేం తెస్తాం బామ్మ ఒకవేళ అది ఏం కాకుండా ఉంటే మోక్షకి ఏం కాలేదు అని ధైర్యంగా ఉండొచ్చు కదా.. అని జ్వాల, చిత్రలు ముడుపు తెచ్చి అందరి ఎదురుగా ఓపెన్ చేస్తారు. చూస్తే ఆ ముడుపు నల్లగా మారిపోయి ఉంటుంది. దీంతో వైదేహి, శబరి గుండెలు పగిలేలా ఏడుస్తారు. 


మరోవైపు మోక్షకు నాటు వైద్యం జరగుతూ ఉంటుంది. అప్పుడే పంచమి వాళ్ల అమ్మ అక్కడికి వస్తుంది. పంచమి తల్లి గౌరి మోక్షని చూసి ఏడుస్తుంది. 


గౌరి: పంచమి మోక్షా ఒళ్లు అంతా చల్లబడిపోయింది.. స్వామి ఇంత చల్లబడిపోతే ప్రాణాలకు ప్రమాదం కదా..
నాగసాధువు: నాకు తెలిసిన అన్ని రకాల నాటు వైద్యాలు చేశానమ్మా. పరిస్థితి చూసి భయం వేసే మీకు కబురు పంపాను. 
గౌరి: అమ్మా పంచమి ఈ అబ్బాయి. 
పంచమి: నాగలోకానికి సంబంధించిన వారు అమ్మా. 
గౌరి: అర్థమైంది అమ్మా నీ కోసం వచ్చారు కదా.. అయ్యా విషానికి విరుగుడు మీకు తెలుసుంటుంది కదా..
ఫణేంద్ర: అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమ్మా. 
పంచమి: అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమ్మా.. నాకు చాలా భయం వేస్తుంది. 
గౌరి: స్వామి ఇలాంటి పరిస్థితిలో కూడా మోక్షా తల్లిదండ్రులకు చెప్పకపోతే బాగోదు స్వామి. మాకు చెప్పుంటే మేం డాక్టర్లను తీసుకొచ్చేవాళ్లం కదా. అని అంటారు. నేను చెప్తాను స్వామి వాళ్లకి.  వాళ్లు తిట్టినా పర్లేదు. గౌరి వైదేహికి ఫోన్ చేస్తుంది. అమ్మా.. ఇలాంటి వార్త నా నోటితో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. మోక్షా బాబు చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు. 
వైదేహి: మోక్షా.. మోక్షాకి ఏమైంది.
గౌరి: అమ్మా మోక్షని పాము కాటేసింది. మీరు వెంటనే బయల్దేరి రండి. మీరు వెంటనే రండి.. మాకు చాలా భయంగా ఉంది. శబరి, వైదేహి ఏడుస్తారు. అందరూ కారులో బయల్దేరుతారు. 


నాగకన్య: ముందుగా నన్ను క్షమించండి నాగదేవత. అత్యవసరం అనిపించి మీ దర్శనం కోసం వేడుకున్నాను. ఓ ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలి. మన యువరాణి నాగలోకం వచ్చింది. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ జనవరి 19th: గిరిధర్‌ని చితక్కొట్టేసిన రౌడీలు, సీతకు హగ్‌ ఇచ్చి ఆ పని చేయకుండా అడ్డుకున్న రామ్