Brahmamudi Serial Today Episode: శ్వేత  భయపడుతూ ఇంట్లో ఎవరో ఉన్నారని కర్ర తీసుకుని వెతుకుతుంది. ఇంతలో బయట నుంచి ఎవరో కాలింగ్‌బెల్ నొక్కగానే భయంగా మెయిన్‌ డోర్‌ దగ్గరకు కర్ర పట్టుకుని వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేసి కర్రతో కొట్టబోతుంటే చేతులు అడ్డంగా పెట్టి ఏయ్‌ శ్వేత నేను రాజ్‌ ఎందుకు కొడుతున్నావు అనడంతో శ్వేత రాజ్‌ను చూసి ఏడుస్తుంది. ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్తుంది. రాజ్‌ పద చూద్దాం అంటాడు. హాల్లోకి వెళ్లిన శ్వేత రాజ్‌కు టీవీని చూపిస్తూ..


శ్వేత: నేను బెడ్‌రూంలో పడుకుని ఉన్నాను. కానీ టీవీ ఆన్‌ అయింది. మెయిన్‌ డోర్‌ కూడా లాక్‌ చేశాను కదా? మరి టీవీ దానంతట అదే ఎలా ఆన్‌ అవుతుంది.


రాజ్‌: టీవీని వేరే వాళ్లు ఎవరో వచ్చి ఆన్‌ చేయలేదు.  నువ్వే ఆన్‌ చేశావు.


శ్వేత: వాట్‌ నేనెలా ఆన్‌ చేస్తాను. నేను బెడ్‌ రూంలో ఉన్నాను కదా


రాజ్‌: కానీ నిన్న రిమైండర్‌ ఎదో పెట్టుకున్నట్లున్నావు. టీవీ దానంతట అదే ఆన్‌ అయ్యింది.


అనగానే నిజమే రాజ్‌ నిన్న ఏదో సిరీస్‌ వస్తే చూసి మళ్లీ చూడ్డానికి రిమైండర్‌ పెట్టాను. అంటుంది. మరోవైపు రాజ్‌ ఆఫీసు నుంచి శృతి, కావ్యకు ఫోన్‌ చేస్తుంది. సార్‌ ఇంకా ఆఫీసుకు రాలేదని ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తున్నారని చెప్తుంది. దీంతో కావ్య షాక్‌ అవుతుంది. 2 కోట్ల ప్రాజెక్టు అని డిజైన్‌ లేట్‌ అయితే ప్రాజెక్టు మిస్‌ అవుతుందని శృతి చెప్పగానే ఆ డీటెయిల్స్‌ నాకు పెట్టు నేను పూర్తి చేస్తాను అని చెప్తుంది కావ్య. మరోవైపు శ్వేత భయపడుతుంటే రాజ్‌ ధైర్యం చెప్తుంటాడు. ఇంతలో ఎవరో చాటునుంచి రాజ్‌, శ్వేత క్లోజ్‌గా ఉన్న ఫోటోస్‌, వీడియోస్‌ తీస్తారు. మరోవైపు కావ్య డిజైన్స్‌  వేసి శృతికి పంపిస్తుంది. ఇంతలో కావ్య ఫోన్‌కు రాజ్‌, శ్వేత క్లోజ్‌గా ఉన్న ఫోటోస్‌, వీడియోస్‌ పంపిస్తారు అజ్ఞాత వ్యక్తి అవి చూసిన కావ్య షాక్‌ అవుతుంది. డిజైన్స్‌ పక్కకు పెట్టేసి రూంలో లైట్‌ ఆఫ్‌ చేసుకుని ఏడుస్తూ కూర్చుని రాజ్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది కావ్య.


అనామిక కాఫీ తీసుకుని కళ్యాణ్‌ దగ్గరకు వస్తుంది.


అనామిక: కళ్యాణ్‌ మీ అన్నయ్య ఆఫీసుకు వెళ్లారు. నువ్వు ఎప్పుడు వెళ్తావు ఆఫీసుకు


కళ్యాణ్‌: నేను రోజూ వెళ్లను ఆఫీసుకు ఎప్పుడైనా అన్నయ్యకు వర్క్‌ ఎక్కువుందంటే అప్పుడే వెళ్తాను.


అనామిక: మరి రోజూ ఏం చేస్తుంటావు?


ఇంతలో అక్కడకు రాహుల్‌ వస్తాడు.  


రాహుల్‌: ఏ ముంది అనామిక ఆ పిచ్చి రాతలు రాస్తూ కూర్చుంటాడు. ఏం చేస్తాం చెప్పు మొత్తం రాజ్‌ చేతిలోనే ఉంది. నన్నేమో ఆఫీసుకు రానివ్వడు. కళ్యాణ్‌ను అవసరం ఉంటే తప్పా పిలవడు. ఏంటో..


కళ్యాణ్‌: చూశావా అనామిక అందరికీ నావి పిచ్చి రాతలుగానే కనిపిస్తాయి. కానీ వాటిని కవితలుగా చూసింది నువ్వు మాత్రమే.. నన్నుగా గుర్తించి ప్రేమించింది నువ్వే అందుకే నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను.


నువ్వు ఇలా ఇంట్లో కూర్చుని కవితలు రాస్తుంటే నీ భార్యగా నాకేం గౌరవం ఉంటుంది అని అనామిక మనసులో అనుకుంటుంది. కళ్యాణ్‌ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదని లంచ్‌ రెడీ అయితే పిలుస్తానని చెప్పి వెళ్లిపోతుంది అనామిక.  లోపలికి వెళ్తున్న  అనామికకు రుద్రాణి ఎదురొచ్చి నీ బాధ నాకు అర్థం అవుతుంది. అంటూ రెచ్చగొడుతుంది. మీరు నాకు సాయం చేస్తానంటే మొత్తం మార్చేస్తాను అంటుంది. ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది రుద్రాణి. రుద్రాణికి  తన ప్లాన్‌ గురించి చెప్తుంది అనామిక. సరే బాగుంది అంటూ లోపలికి వెళ్తుంది. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు వారికి కావ్య కాఫీ తీసుకొస్తుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు.


అపర్ణ: రేయ్‌ ఎక్కడికి వెళ్లావు. ఇప్పుడొస్తున్నావు.


రాజ్‌ తడబడుతుంటే కావ్య ఆఫీసుకు వెళ్లి వస్తున్నారు అని చెప్తుంది. రాజ్‌ కూడా అవును ఆఫీసుకు వెళ్లి వస్తున్నాను అంటాడు. కావ్య అనుమానంగా రాజ్‌వైపు చూస్తుంది.


అపర్ణ: అదేంట్రా రాత్రంతా అక్కడే ఉన్నావా ఏంటి?


రాజ్‌: అవునత్తయ్యా చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ మిస్‌ అవుతారోనని అల్లారం పెట్టుకుని మరీ లేచి వెళ్లారు.


అపర్ణ: ఎందుకు నాన్నా అంత కష్టపడుతున్నావు.


కావ్య: కొత్త కొత్త డిజైన్స్‌ కనిపెట్టడానికి చాలా కష్టపడుతున్నారు.


అనగానే రాజ్‌ షాకింగ్‌ గా చూస్తుంటాడు. రుద్రాణి ఇదేదో తేడా ఉందని మనసులో అనుకుంటుంది. తన పక్కనే కూర్చున్న ధాన్యలక్ష్మీకి రాజ్‌ ను అంతలా మెచ్చుకోవడం ఏంటి? మెల్లగా కళ్యాణ్‌ చేతికి కూడా బిజినెస్‌ పగ్గాలు అప్పజెప్పమని అడుగు అని నూరిపోస్తుంది. దీంతో ఆలోచనలో పడిపోతుంది ధాన్యలక్ష్మీ. పైన బెడ్‌రూంలో రిలీఫ్‌గా పడుకున్న రాజ్‌కు  ఆఫీసు నుంచి శృతి ఫోన్‌ చేస్తుంది. వెంటనే రాజ్‌కు ప్రాజెక్టు గుర్తుకువస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా ఆలోచిస్తుంటాడు. కావ్య పేపర్స్‌ తీసుకొచ్చి రాజ్‌ ముందు పెడుతుంది.


రాజ్‌: ఏంటివి?


కావ్య: డిజైన్స్‌... రుద్రా గ్రూపు వాళ్లకు మీరివ్వాల్సిన డిజైన్స్‌..


 అని కావ్య చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. డిజైన్స్‌ చూసి ఏమైనా అడగాలా? అంటాడు రాజ్‌. మీరేమైనా చెప్పాలా? అంటూ వెళ్లిపోతుంది కావ్య. దీంతో రాజ్‌ కోపంగా శృతికి ఫోన్‌ చేసి కావ్యకు ఎందుకు ఫోన్‌ చేశావని తిట్టి ఫోన్‌ పెట్టేస్తాడు. తర్వాత కావ్యకు నా మీద అనుమానం వచ్చిదా? లేక అర్థం చేసుకుందా? నాకర్థం కావడం లేదే అనుకుంటాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   


Also Read: అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? నిజమెంతంటే!