Naga Panchami Today Episode: పంచమి రూపంలో కరాళి నాగలోకం చేరుకుంటుంది. నాగలోకం సౌందర్యాన్ని తెగ పొగిడేస్తుంది. తర్వాత నాగమణి దగ్గరకు వెళ్తుంది. నాగమణి చూసి ఎగిరి గంతేస్తుంది. నాగమణిని పట్టుకోవాలి అని చూస్తుంది కానీ ఐదు తలల పెద్ద పాము బుసలు కొట్టడంతో భయపడుతుంది. 


కరాళి: ఎంతో కష్టపడి రూపం మార్చుకొని నాగలోకం వచ్చాను. ఇక్కడ చూస్తే నాగమణి దగ్గరకే వెళ్లలేకపోతున్నాను. ఫణీంద్ర చెప్పినట్లు ఒక్క నాగవంశస్తులు తప్ప మరెవ్వరూ నాగమణి దగ్గరకు వెళ్లే అవకాశమే లేనట్లుంది. తొందర పడి అనవసరమైన ప్రయత్నం చేసినట్లున్నాను. మహాంకాళి చెప్పినట్లు ఇక్కడికి వచ్చి నా శక్తులను కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఎటూ కాకపోయింది. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కానీసం నాగ చంద్రకాంత మొక్కని అయినా సంపాదించి దానితో అయినా మా అన్నని బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మొక్క నీటి అడుగున దొరుకుతుంది  అని మాట్లాడుకున్నారు. అటు వైపు వెళ్లి వెతికితే ప్రయోజనం ఉండొచ్చు. 


పంచమి: మోక్షా బాబు కళ్లు తెరవండి మోక్షాబాబు. 
నాగసాధువు: పంచమి ఈ లేపనం కొద్దిగా పంచమి కళ్లకు పెట్టు నిద్ర రాకుండా చేస్తుంది. 
ఫణేంద్ర: యువరాణి.. నాకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా చెప్తున్నా ఏదో మోసం జరిగిపోయింది. మనం చేయాలి అనుకున్న పని ఒకవేళ నాగదేవతకి తెలిసిపోయి నీ రూపంలో ఎవరినైనా నాగకన్యని పంపించిందేమో.. 
నాగసాధువు: ఏమైనా జరిగుండొచ్చు. కానీ మనం ఇప్పుడు మోక్షని బతికించుకోవడం ఎలా.. 
పంచమి: మోక్షాబాబుకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను ఫణేంద్ర మా పాపం నీకే తగులుతుంది.
ఫణేంద్ర: యువరాణి.. నా ప్రయత్నం నేను చేశాను. విషం చాలా వరకు లాగేశాను.
నాగసాధువు: బతికే అవకాశం ఉందా లేదా అది చెప్పు ఫణేంద్ర. 
ఫణేంద్ర: ఇష్టరూపనాగ విషం ఒక్క చుక్క ఒంట్లో ఉన్నా బతకడం కష్టం స్వామి. విషం రక్తంలో కలిసిపోయింది. నాగచంద్రకాంత మొక్క ఒక్కటే ఈ పరిస్థితుల్లో విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. 
పంచమి: అయితే నేను బతకడం అనవసరం ఫణేంద్ర. నీ కాళ్లు పట్టుకుంటాను దయచేసి నన్ను కాటేసి చంపేయ్.. మోక్షాబాబు కంటే ముందే నేను చచ్చిపోవాలి. పాముగా మారి త్వరగా నన్ను కాటేయ్ ఫణేంద్ర. కాటేయ్..
నాగసాధువు: పంచమి.. కొంచెం ఓపిక పట్టమ్మా. ఈ క్షణం ఉండినట్లు ఇంకో క్షణం ఉండకపోవచ్చు. మనం ఆశను చంపుకోకూడదు. మోక్షకు ఆయువు రాసి ఉంటే పరలోకం ఉన్నా సరే ప్రాణాలు తిరిగివస్తాయి. ఫణేంద్ర ఈ వేరును బాగా గట్టిగా మోక్షా కాలికి రాయు. పంచమి మీ అమ్మకి కబురు చేసి పిలిపిస్తాను. 
పంచమి: వద్దు స్వామి తను ఈ పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేదు. 
నాగసాధువు: మంచి అయినా చెడు అయినా పెద్దవాళ్లతో పంచుకోవాలి అమ్మ. ముందు చెప్పకపోతే తప్పు అయిపోతుంది. 
ఫణేంద్ర: నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే .. రకరకాల సందేహాలు వస్తాయి స్వామి. మూమూలుగా మారుతాను. 
నాగసాధువు: మరో ముఖ్యమైన విషయం పంచమే పాముగా కాటేసింది. అందుకే ఇలా వికటించింది అన్న సమాచారం బయటకు తెలీకపోవడమే మంచిది. దానివల్ల ప్రయోజనం లేకపోగా లేని పోని అపనిందులు మోయాల్సి వస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి కాపాడుతాడో తెలీదు. నువ్వు ధైర్యంగా ఉండు ఏదో ఒక మార్గం కనిపించకతప్పదు. 


మరోవైపు కరాళి నాగలోకంలోని కొలనుల దగ్గర ఎవరూ చూడకుండా నాగచంద్రకాంత మొక్క కోసం వెతుకుతుంది. ఫణేంద్ర చెప్పిన మంత్రం చెప్పి కొలనులోకి దిగుతుంది. ఆ మంత్రం వల్ల నీటిలో మునగకుండా నడుచుకుంటూ వెళ్తుంది. నాగ చంద్రకాంత మొక్కని చూస్తుంది. నాగ చంద్రకాంత మొక్క తీయగానే చూట్టూ ఉండే అగ్ని శకలు కరాళి మీద దాడి చేస్తాయి. ఆ మొక్కని కింద పెట్టేయగానే దాడి ఆగిపోతుంది.


నాగలోకంలో దేన్ని తాకినా ప్రాణాలు పోయేలా ఉన్నాయని కరాళి అనుకుంటుంది. అయినా సరే మొక్క తీసుకెళ్లాలి అని నిర్ణయించుకొని మంత్రం చదువుతుంది. అప్పుడు ఆ మొక్క పట్టుకున్నా ఏం కాదు. ఇక ఆ మొక్క తీసుకెళ్తుండడంతో ఓ నాగకన్య చూస్తుంది. తానే యువరాణి అనుకొని కరాళితో నాగకన్య మాట్లాడుతుంది. నాగ చంద్రకాంత మొక్కతో మీకు ఏం పని అని అడుగుతుంది. ఇక ఆ విషయం నాగదేవతకు చెప్తాను అని నాగకన్య అంటుంది.


ఫణేంద్ర చెప్పిన మంత్రం చదివి అక్కడి నుంచి కరాళి వెళ్లిపోతుంది. ఆ విషయం నాగదేవతకు చెప్పాలి అని నాగకన్య వెళ్తుంది. మరోవైపు మోక్షకు నాటు వైద్యం చేస్తుంటారు. ఫణేంద్ర మామూలుగా మారి వస్తాడు. పంచమి మోక్షకు పసరు పడుతుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ జనవరి 18th: రామ్‌కి ముద్దు పెట్టేసిన సీత, కోడలికి చుక్కలు చూపించాలని చిన్న అత్తామామల ప్లాన్!