Naga Panchami Today Episode సుబ్బు తన మాటలతో పంచమిని ఆలోచనలో పడేస్తాడు. తాను ఒక నిర్ణయానికి వచ్చేశాను అని పంచమి అంటుంది. తాను తన భర్తకు ఎలాంటి సంతోషం ఇవ్వలేను అని సుబ్బుతో చెప్తుంది. మోక్షాబాబుకి ఆనందం ఇవ్వడమే తనకు కావాలని అని.. మేఘన అనే మంచి అమ్మాయి దొరికింది అని పెళ్లి చేసుకొని వాళ్లయినా సంతోషంగా ఉండటమే తనకు తృప్తి అని పంచమి అంటుంది. 


సుబ్బు: ఒక భ్రమలో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేరు. ఇప్పుడు అదే నీ పరిస్థితి. నీ దృష్టి అంతా నీ భర్త సంతోషంగా ఉండాలి అనే దానిమీద ఉంది. అందుకే నీ కంటికి ఏమీ కనిపించదు. నీ చెవికి ఏ మాట వినినించదు. 
పంచమి: నువ్వేం చెప్పినా నా మంచికే చెప్తావు సుబ్బు. కష్టమో నష్టమో భార్యభర్తలు కలిసే పంచుకోవాలి అనే ధర్మం కోసం ఆలోచిస్తే అది నా స్వార్థం అవుతుంది. ఏ ఆటంకం లేకుండా మేఘనతో మోక్షాబాబుని వేడుకో సుబ్బు. వస్తాను సుబ్బు. 


మరోవైపు ఫణేంద్ర పాములా మారి మేఘన గదికి వెళ్తాడు. అక్కడ మేఘన, జ్వాల శరీరంలో ఉన్న నంబూద్రీ ఆత్మ మాట్లాడుకోవడం చూస్తాడు. కరాళి అంటూ నంబూద్రీ మాట్లాడటం ఫణేంద్ర వింటాడు. తన పెళ్లిని ఆపాలని చాలామంది చూస్తున్నారు అని అందులో ముఖ్యంగా జ్వాల ఉందని కరాళి తన అన్నతో చెప్తుంది. ఇక మోక్షని మభ్యపెడుతూ ఉండమని నంబూద్రీ కరాళికి చెప్తాడు. ఏం జరిగినా మోక్షని తీసుకెళ్లి మోక్షని ఆహుతి ఇచ్చి నా శక్తులు పొందుతాను అని కరాళి అంటుంది. ఇక ఫణేంద్ర పాము అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ సౌండ్ చేయడంతో మేఘన కంగారు పడుతుంది. ఇక మేఘన ఫణేంద్ర పాముని చంపేయమని జ్వాలని ఆవహించిన నంబూద్రీకి చెప్తుంది. ఇక కర్ర తీసుకొని పామును కొట్టేందుకు జ్వాలని ఆవహించిన నంబూద్రీ వస్తాడు. ఇంతలో పంచమి రావడం చూసి వెనక్కి వెళ్లిపోతారు.


ఫణేంద్ర: పంచమి నీతో ఒక విషయం చెప్పాలి. నిన్ను మర్చిపోయి మోక్ష మేఘనను పెళ్లి చేసుకోవడం ఇంత త్వరగా జరుగుతుందని నేను ఊహించలేదు. ఆ గొప్పతనం అంతా నీదే. మీరు నాగలోకానికి యువరాణి. త్వరగా నాగలోకాని వెళ్లాలి అనే ఆశ నీకు ఉందని నిరూపించావు పంచమి. నువ్వు నాగలోకం రావడానికి ఇంకెంత సమయం పడుతుందా అని భయపడ్డాను. కానీ ఇక ఎలాంటి ఆటంకం లేకుండా చాలా సులభంగా మనం మన నాగలోకానికి వెళ్లిపోతున్నాం. ఈ విషయం తెలిస్తే నాగలోకం నాగదేవత ఎంత ఆనందిస్తారో తెలుసా పంచమి. ఇప్పుడే నాగదేవతను ప్రసన్నం చేసుకొని నీకు ఇష్టరూప శక్తులు ప్రసాదించమని కోరుకుంటాను. అలాగే నీకు స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తాను. ఇక మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లిపోదాం పంచమి. నువ్వు కూడా నాగదేవతని వేడుకో.
పంచమి: ఆగు ఫణేంద్ర. నువ్వు వెళ్లిపో ఫణేంద్ర. నేను నాగలోకానికి రాలేను. నీకు ఇక్కడ పనిలేదు. నువ్వు నాగలోకం వెళ్లిపోవచ్చు. 
ఫణేంద్ర: నాగలోక వంశస్తులు ఇచ్చిన మాట తప్పరు పంచమి. మోక్ష పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నాగలోకం వచ్చేస్తా అని చెప్పావు. మోక్ష పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంకా నీకు అభ్యంతరం ఏంటి పంచమి.
పంచమి: కరాళి. కరాళి ప్రాణాలతో ఉన్నంత వరకు మోక్షా సంతోషంగా ఉంటారు అని నేను నమ్మడంలేదు ఫణేంద్ర. కరాళి అంతం నేను చూసిన తర్వాతే నేను ఈ భూలోకాన్ని వదిలిపెట్టగలను.
ఫణేంద్ర: అది జరగని పని అని నీకు తెలుసు. నాగలోకం రాకుండా ఉండటం కోసం ఇలా మాట మార్చుతున్నావు. 
పంచమి: నా కన్న తల్లి చావులో మోక్షాబాబు తప్పు లేదు అని తెలిసినా పగ ప్రతీకారంతో నా తల్లి పగనేనే కాటేయాలి అన్న నెపంతో నా భర్త ప్రాణాలు నాతోనే తీయించే పని చేశారు. మరో సారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా.
ఫణేంద్ర: నువ్వు నాగలోకం రావడం తప్పించడం ఎవరి తరం కాదు. 
పంచమి: ఇప్పుడు నేను నాగలోకం రాలేను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలీదు.
ఫణేంద్ర: మోక్షకు ప్రాణ గండం తప్పిపోయింది అన్న ధైర్యంతో మాట్లాడుతున్నావ్ పంచమి.
పంచమి: నా భర్తను కాపాడుకోవాలి అని చెప్తున్నా.
ఫణేంద్ర: నాగలోక యువరాజుగా నాకు అంతే పౌరుషం ఉంది. నిన్ను తీసుకెళ్లకుండా నాగలోకం వెళ్లను. నేను తలచుకుంటే మోక్షని కాటేసి చంపడానికి రెండు నిమిషాలు పట్టదు. 
పంచమి: నాగలోకాన్ని తలకిందుల చేస్తాను. నాగదేవతని ప్రశ్నిస్తాను. 
ఫణేంద్ర: అంత ఆవేశం వద్దు నీ అవసరం నాగలోకానికి చాలా ఉంది. 
పంచమి: ఎంత టైం అయినా పట్టొచ్చు. ప్రస్తుతం నేను నాగలోకం రాలేను.  


ఫణేంద్ర: నువ్వు కరాళి అని నాకు తెలిసిపోయింది మేఘన. కానీ ప్రస్తుతం ఆ విషయం పంచమికి చెప్తే నీకు మోక్షకు పెళ్లి చేయదు. తను నాతో నాగలోకం రాదు అందుకే చెప్పలేదు. 


మరోవైపు వైదేహి అందర్ని పిలిచి పెళ్లి పనులు చేయమని చెప్తుంది. ఇంతలో మోక్ష వచ్చి నిశ్చితార్థం జరగకుండా పెళ్లి గురించి ఎందుకు అని అంటాడు. అయినా ఈ పెళ్లి జరగదు అని అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  గుంటూరు కారం: ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?