Skanda VS Bhagavanth Kesari TRP Ratings: ప్రేక్ష‌కుల మూడ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. బాగా ఆడుతుంద‌నుకున్న సినిమాని తిర‌స్క‌రిస్తారు. సాదాసీదాగా ఉంద‌నుకున్న సినిమాని ఆద‌రిస్తారు. థియేట‌ర్ల‌లో నెగ‌టివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల‌ను ఓటీటీల్లో, టీవీల్లో వేసిన‌ప్పుడు తెగ చూసేస్తారు. గ‌తంలో కొన్ని సినిమాల‌కు అలానే జ‌రిగింది. ఉదాహ‌ర‌ణ‌కు 'ఆరెంజ్' సినిమా.. రిలీజైన‌ప్పుడు అది డిజాస్ట‌ర్. చాలా నెగ‌టివ్ టాక్ వ‌చ్చింది. కానీ, ఆ త‌ర్వాత ఆ సినిమాకి భ‌లే క్రేజ్ వ‌చ్చింది. టీవీలో వేస్తే.. ఎగ‌బడి చూస్తారు. ఇక రీ రిలీజ్ గురించైతే చెప్ప‌క్కర్లేదు. థియేట‌ర్లు అన్నీ హౌస్ ఫుల్. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఈ వార్త మొత్తం చ‌దివితే మీకే అర్థం అవుతుంది. 


'స్కంద హిట్టు'.. 'భ‌గ‌వంత్ కేస‌రి' ఫ‌ట్టు


హీరో రామ్ న‌టించిన 'స్కంద - ది ఎటాక‌ర్' సినిమా థియేటర్లలో డిజాస్ట‌ర్. ఇక బాల‌కృష్ణ న‌టించిన ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమా సూప‌ర్ హిట్. అయితే, ఇప్పుడు ఆ రిజ‌ల్ట్ తారుమారు అయ్యింది. ఈ సినిమాలు టీవీల్లో వేస్తే.. 'స్కంద' హిట్టు, 'భ‌గ‌వంత్ కేస‌రి' ఫ‌ట్టు. ఈ రెండు సినిమాల‌ను టీవీలో ఒకేరోజు ప్ర‌సారం చేశారు. స్టార్ మాలో 'స్కంద‌', జీ తెలుగులో 'భ‌గ‌వంత్ కేస‌రి' ప్ర‌సారం చేశారు. అయితే, 'స్కంద' సినిమానే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆద‌రించార‌ని టీఆర్పీ రేటింగ్స్ చెప్తున్నాయి. 'స్కంద'కి 8.4 టీర్పీ రేటింగ్ రాగా.. 'భ‌గ‌వంత్ కేస‌రి'కి 7.69 రేటింగ్ వ‌చ్చింది. ఇక గ‌తంలో 'విన‌య విధేయ రామ' సినిమాకి కూడా బుల్లితెర‌లో ఇంతే ఆద‌ర‌ణ ల‌భించింది. ఆ సినిమా థియేట‌ర్ల‌లో మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 


పెద్ద‌గా రాని క‌లెక్ష‌న్స్.. 


రామ్ పోతినేని న‌టించిన 'స్కంద' సినిమాకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో రామ్ ఊర‌మాసు గెట‌ప్ లో క‌నిపించారు. డ్యూయెల్ రోల్ చేశారు. 2023లో విడుద‌లైన ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్​ని అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీలో రామ్ పోతినేని సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటించగా, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలో కనిపించింది. 


‘భగవంత్ కేసరి’.. మంచి హిట్ టాక్ తెచ్చుకోవ‌డమే కాకుండా.. క‌లెక్ష‌న్లు కూడా భారీగా సాధించింది. రిలీజైన 18 రోజుల్లోనే దాదాపు రూ.139.19 కోట్ల రూపాయ‌లు సాధించింది ఈ సినిమా. దీంతో బాల‌య్య బాబు ఫ్యాన్స్ అప్ప‌ట్లో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఇక ఈ సినిమాలో కూడా శ్రీలీల కీలక పాత్ర పోషించారు.  బాలయ్యకు జంటగా కాజల్ న‌టించారు.  ఇక ఈ సినిమాతో పెళ్లి తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు కాజల్. సెంటిమెంట్ తో  క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. శ్రీ‌లీల కూడా ఈ సినిమాలో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ వేసి మెప్పించింది. విలన్‌గా అర్జున్ రాంపాల్ కూడా తన యాక్షన్‌తో ప్రశంసలు పొందారు.


Also Read: హీరోయిన్‌తో వర్మ పార్టీ - ‘వ్యూహం’ రిలీజ్‌పై అప్డేట్, వారందరినీ టార్గెట్ చేస్తూ పోస్టులు