Guppedantha Manasu February 9th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 9 ఎపిసోడ్)


రిషి దూర‌మైన బాధ‌ను త‌ట్టుకోలేక మళ్లీ తాగాలని నిర్ణ‌యించుకుంటాడు. ఇంతలో అనుపమ వచ్చి ఆబాటిల్ లాక్కుని క్లాస్ పీకుతుంది. 
మహేంద్ర: రిషి దూర‌మైన నిజాన్ని నమ్మలేకపోతున్నాను..రిషి నా జీవితం, వాడే నా ప్రాణం. 
అనుపమ: డ్రింక్ చేస్తే రిషి తిరిగొస్తాడా
మహేంద్ర: రిషి నా ప్రేమ‌కు సాక్ష్యం. జ‌గ‌తి నాకు దూర‌మైన‌ప్పుడు నేను బ‌తికింది రిషి కోస‌మే. ప‌సిత‌నంలోనే వాడు నాకు అండ‌గా నిలిచాడు. బాధ‌లో ఉన్న‌ప్పుడు నా భుజం త‌ట్టాడ‌ని రిషి జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకుంటాడు. రిషి ఒక అద్భుతం. వాడు నా బంగారం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత జగతి ఫొటో దగ్గరకు వెళ్లి బాధపడతాడు...రిషి ఒక్క క్ష‌ణం క‌నిపించ‌క‌పోతే నా మ‌న‌సు కుదురుగా ఉండ‌దు. అలాంటి రిషి శాశ్వ‌తంగా దూరమ‌య్య‌డ‌నే నిజాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ు, బాధ‌ను త‌ట్టుకోవ‌డానికి తానే తాగాల్సిందే. రిషికి అమ్మ జ‌గ‌తి అంటే ప్రాణ‌ం అందుకే న‌న్ను ఒంట‌రిగా వ‌దిలేసి జ‌గ‌తి ద‌గ్గ‌ర‌కు రిషి వెళ్లిపోయాడ‌ు. నాకు ఈ జీవితం వ‌ద్దు, నేను ఎవ‌రి కోసం బ‌త‌కాలంటూ ప‌క్క‌నే ఉన్న చెట్టుకు త‌న త‌ల‌ను గ‌ట్టిగా కొట్టుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు. 
అది చూసి అనుప‌మ కంగారు ప‌డుతుంది. మ‌హేంద్ర‌ను ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. నేను నా రిషి ద‌గ్గ‌ర‌కు వెళ‌తాన‌ని ప‌ట్టుప‌డ‌తాడు. నువ్వు వ‌సుధార కోస‌మైనా బ‌తికి ఉండాలి. త‌న‌కు తోడుగా ఉండి ధైర్యం చెప్పాల‌ని మ‌హేంద్ర‌కు న‌చ్చ‌చెబుతుంది  
మహేంద్ర: రిషి త‌న‌ ప్రాణ‌మ‌ని వ‌సుధార అనుకుంది.తన కోసం ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించింది. చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను గెలిపించుకుంది.
అనుపమ: రిషి చ‌నిపోయాడంటే వ‌సుధార న‌మ్మ‌డం లేదు. ఫొటోకు వేసిన దండ కూడా తీసేసింది
మహేంద్ర: తనింకా రిషి ఉన్నాడనే భ్రమలోనే ఉంది
అనుపమ: నువ్వు తనతో పాటే ఉండి వసుధారని ఆ భ్రమ నుంచి నువ్వే బయటకు తీసుకురావాలి. డ్రింక్ చేయాలి, చనిపోవాలనే తెలివితక్కువగా ఆలోచించకు


Also Read: ఎండీ సీట్ కాదు క‌దా కాలేజీ గేట్ కూడా దాట‌నివ్వ‌ను, బాలయ్యలా వసు స్ట్రాంగ్ వార్నింగ్!


రాజీవ్-చక్రపాణి


రిషి గురించి ఆలోచిస్తూ వ‌సుధార బాధ‌ప‌డుతుంటుంది. అప్పుడే పూల‌దండ‌తో గుమ్మంలో రాజీవ్ అడుగుపెడ‌తాడు. రాజీవ్‌ను చూడ‌గానే చ‌క్ర‌పాణి ఆవేశానికి లోన‌వుతాడు. ఎందుకొచ్చావ్ ఇక్క‌డికి అని నిల‌దీస్తాడు. మ‌ర‌ద‌లు దుఃఖంలో ఉంటే రాకుండా ఎలా ఉండ‌గ‌ల‌ను. రిషి పోయిన బాధ నుంచి వ‌సుధార‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే బాధ్య‌త నాపైనే ఉంది. త‌న‌ను నేనే క‌దా ఓదార్చాల‌ి అంటాడు. అయినా చ‌క్ర‌పాణి ఆవేశం త‌గ్గ‌దు. మీరు నాకు మ‌ళ్లీ పిల్ల‌ను ఇచ్చే మామ‌. మీరు అన‌వ‌స‌రంగా ఆవేశ‌ప‌డ‌టం మంచిది కాద‌ని రాజీవ్ కూల్‌గా బ‌దులిస్తాడు. 


Also Read: దేవయాని, శైలేంద్రకి ఇచ్చిపడేసిన వసు - కొత్తవ్యక్తి వసుకి ఎందుకు హెల్ప్ చేసినట్టు!


రాజీవ్-వసుధార


రిషి ఫొటోకు దండ వేద్దామంటే ఎక్క‌డ క‌నిపించ‌డం లేదేంటి అని వ‌సుధార‌ను అడుగుతాడు రాజీవ్‌. రిషి బ‌తికే ఉన్నాడ‌ని వ‌సుధార బ‌దులిస్తుంది. అది నీ ఊహ మ‌ర‌ద‌లు పిల్లా...అందులో నుంచి బ‌య‌ట‌కు రా, మ‌రి పిచ్చిదానిలా ప్ర‌వ‌ర్తించ‌కు అంటాడు. ఒక‌వేళ రిషి బ‌తికే ఉంటే ఇప్పుడే ఇక్క‌డ‌కు ర‌మ్మ‌ను అంటాడు. నువ్వు కోరుకుంటున్న‌ట్లు రిషి వ‌స్తే తన మెడలో ఈ దండ వేసి స్వాగతం పలుకుతాను..లేదంటే ఫొటోకు దండ వేసి సంతాపం తెలుపుతాను. నిన్ను తీసుకెళ్తుంటే అడ్డుపడిన వాడు ఏడి ( కొత్త క్యారెక్టర్) అని అడిగితే నాకు తెలియదు అంటుంది వసుధార. అయినా రిషి లేడ‌ని నువ్వేం బాధ‌ప‌డ‌కు. నీకు నేను ఉన్నా. రిషి లేన‌ప్పుడు ఇంకా ఈ ఇంట్లో ఉండ‌టం ఎందుకు. నాతో పాటు వ‌చ్చేయ్ అంటూ వ‌సుధార చేయిప‌ట్టుకోబోతాడు రాజీవ్‌. చక్రపాణి అడ్డుపడతాడు


Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!


చక్రపాణి- రాజీవ్


మాటలతో ఇంకా ఎందుకు దాన్ని హింసిస్తున్నావ్ అని చక్రపాణి ఆవేశపడతాడు. నువ్వు ఇంకో క్ష‌ణం ఇక్క‌డే ఉంటే నిన్ను చంపి నేను జైలుకు వెళ్తాన‌ని రాజీవ్‌ను బెదిరిస్తాడు చ‌క్ర‌పాణి.  నాకు ఏమ‌న్నా అయితే వ‌సుధార ఒంట‌రిదైపోతుంది ఇప్పుడు నా అవ‌స‌రం వ‌సుకు చాలా ఉంది. నేను నా కోసం కాక‌పోయినా వ‌సుధార కోస‌మైనా ప్రాణాల‌తో బ‌తికి ఉండాల‌ండాలని కూల్ గా బదులిస్తాడు రాజీవ్. కొట్టేందుకు వెళ్లిన తండ్రిని ఆపిన వసుధార కుక్కలు మొరిగాయని ఆవేశపడి చేయి చేసుకోవద్దని వారిస్తుంది. నువ్వు నన్ను దేంతో పోల్చినా నాకు ఆనందమే అంటాడు రాజీవ్. నువ్వు నాపై దెబ్బపడితే చూస్తూ ఉండవని అర్థమైందని తన స్టైల్లో రిప్లై ఇస్తాడు. రిషి ఫొటోకి దండ వేద్దామనుకుంటాడు ఆ దండ లాక్కుని విసిరేస్తుంది వసుధార. రిషి బతికి ఉన్నంత కాలం నన్ను శత్రువులా చూశాడు...కనీసం పోయిన తర్వాత అయినా ఫ్రెండ్ లా చూద్దాం అనుకుంటే నువ్వు దండని నేలపాలు చేయడం బాలేదంటాడు.  నువ్వు ఇంకో క్ష‌ణం ఇక్క‌డే ఉంటే పోలీసుల‌కు ఫోన్ చేస్తాన‌ని రాజీవ్‌ను బెదిరిస్తుంది వ‌సుధార‌. ఆ మాటలకు వెనక్కు తగ్గిన రాజీవ్ ఇప్పుడు వెళ్లి మళ్లీ వస్తానంటాడు. ఇంతలో చక్రపాణి వైపు తిరిగి..మీ తలకు దెబ్బతగిలింది కదా తగ్గిందా అని అడుగుతాడు. అంటే తనను కొట్టి రిషి సర్ ని తీసుకెళ్లింది రాజీవ్ అని అనుమాన పడతాడు చక్రపాణి. 


Also Read: మౌని అమావాస్య రోజు ఈ రాశులవారిపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి , ఫిబ్రవరి 09 రాశిఫలాలు


మరోవైపు వసుధార రిషి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది..మహేంద్ర, అనుపమ అన్నం తినిపించాలని అనుకుంటారు....
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..