Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అనుకి రాజనందిని ఆవహిస్తుంది. నా ప్రేమనే అనుమానిస్తారా అంటూ ఆవేశంతో ఊగిపోతుంది.ఆమె ఆవేశానికి మేలి ముసుగు జారి కింద పడిపోతుంది. అనుని చూసిన సుబ్బు దంపతులు ఆశ్చర్యానికి గురవుతారు. ఆ హడావుడి కి ఆర్య కూడా అక్కడికి వచ్చి అను ని చూసి షాక్ లో ఉండిపోతాడు.


అను: వాళ్ళిద్దరి పీక పట్టుకొని పైకి ఎత్తేసి నా ప్రేమని శంకిస్తారా.. నేను నా ఆర్య సార్ కోసమే బ్రతుకుతున్నాను ఆయన క్షేమం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఆయన క్షేమంగా ఉండాలని ఆయనకు దూరంగా ఉంటున్నాను, ఆయననే తలుచుకొని బ్రతుకుతున్నాను అని చెప్పి వాళ్ళిద్దర్నీ చావ చితక్కొడుతుంది.


వెంటనే పద్దు సుబ్బు పర్సులో ఉన్న అమ్మవారి కుంకుమ తీసి అనుకి పెడదామనుకుంటుంది కానీ అంతలోనే ఆర్యని చూసి అతనికి కుంకుమ ఇస్తుంది. ఆర్య కుంకుమ తీసుకువెళ్లి అను నుదుటన పెడతాడు. వెంటనే శాంతిస్తుంది అను.


కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్య చేతిలో ఉంటుంది అను.


ఆర్య : నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అను అని అడుగుతాడు.


అను : వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలాగా భయపడిపోయి ఆర్య దగ్గర నుంచి దూరంగా వచ్చేసి నేను మీకు దూరంగా ఉండాలి, నేను మీకు దగ్గరగా ఉంటే మీకు క్షేమం కాదు దయచేసి నన్ను నా పిల్లల్ని వదిలేయండి అని వేడుకుంటుంది.


ఆర్య : అను నేను చెప్పేది విను నువ్వు అనుకుంటున్నది ఏది నిజం కాదు ఇప్పుడే నేను నీకు నిజం నిరూపిస్తాను అని అక్కడే ఉన్న మాన్సీ తో నిజం చెప్పిస్తాడు.


మాన్సీ : ఆ ఇంట్లో నువ్వు ఉంటే నా ఆటలు సాగటం లేదని అలా చేశాను, దయచేసి నన్ను క్షమించు అంటుంది.


అను: కోపంతో రగిలిపోతూ నిన్ను క్షమించాలా.. క్షమించే అంత చిన్న తప్పు చేసావా నువ్వు, నీవల్ల దేవుడు లాంటి భర్తకి దూరంగా ఉండవలసి వచ్చింది కళ్ళు తెరవకముందే తండ్రిని బిడ్డల్ని వేరు చేశావు, నా బిడ్డలకి తండ్రి ప్రేమని లేకుండా చేసి అవమానాలు పాలు చేసావు, పిల్లలతో ఒంటరి ఆడది ఇంత కష్టపడుతుంటే నీకు జాలి వెయ్యలేదా, అడవిలో మృగం కన్నా నీచంగా ప్రవర్తించావు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఆర్య కూడా వాళ్ళిద్దర్నీ బయటికి పొమ్మని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాన్సీ, ఛాయదేవి.


అను: ఆర్యతో మాన్సీ మేడం మాటలు నమ్మి తప్పు చేశాను క్షమించండి మీరు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అనే భయంతోనే ఇలా చేశాను అని వేడుకుంటుంది.


ఆర్య : మన ఇద్దరి మధ్య క్షమాపణ ఏంటి, నువ్వు ఏం చేసినా నా కోసమే చేస్తావని నాకు తెలుసు కానీ ఇంకెప్పుడూ ఇలా చేయకు నన్ను వదిలి వెళ్ళద్దు అంటాడు.


అను: ఇంకెప్పుడూ ఇలా చేయను, ఆఖరి ఊపిరి వరకు మీతోనే కలిసి ఉంటాను అని సారీ అని హత్తుకుపోతుంది. 


వాళ్ళిద్దర్నీ అలా చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటారు సుబ్బు దంపతులు.


తర్వాత ఆర్య పిల్లల దగ్గరికి వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. నేనే మీ నాన్నని అని చెప్తాడు.


పిల్లలు: మాకు తెలుసు నాన్న అంటారు.


ఆ మాటలకి ఆశ్చర్యపోతారు అను దంపతులు.


అను: మీకు ముందే తెలుసా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.