Naga Panchami Today Episode: వైదేహి పంతులుని పిలిపించి మోక్ష, మేఘనల నిశ్చితార్థం, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టమని చెప్తుంది. శబరి, వరుణ్, భార్గవ్‌,  మీనాక్షిలు పంతులు వైపు సీరియస్‌గా చూస్తారు. దీంతో పంతులు వైదేహితో అమ్మా ఎక్కడో తేడా కొడుతుంది. మీరు పెళ్లి ముహూర్తమే అడిగారు కదా అని అడుగుతారు. 


శబరి: వైదేహి ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు రఘురామ్ ఉన్నప్పుడు పెట్టించుకోవచ్చు కదా.. 
వైదేహి: వారు పెళ్లి టైంకి వచ్చేస్తారు అత్తయ్య ముందు ముహూర్తాలు పెట్టించేస్తే తర్వాత అవన్నీ మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పండి పంతులు గారు.
పంతులు: అమ్మా నిశ్చితార్థానికి ఈ రోజు వదిలేసి మూడో రోజు నిశ్చితార్థానికి మంచిదమ్మా. పెళ్లికి ఆరోజు నుంచి 16వ రోజున మంచిదమ్మా.. 
వైదేహి: ఆరోజు ఎవరూ ఏ పనులు పెట్టుకోవద్దు. 
భార్గవ్: ఈ పెళ్లి జరిపించడం నాకు ఇష్టం లేదు..
వరుణ్: నాకూ ఇష్టం లేదు.
శబరి: ఇంట్లో ఆడ పెత్తనం కొంత వరకే పరిమితం అయితే ఆ ఇళ్లు బాగుంటుంది. 
వైదేహి: మీ కొడుకుకు చెప్పకుండా నేను ఏం పని చేయడం లేదు అత్తయ్య.. నిశ్చితార్థం డేట్ కూడా ఫోన్ చేసి చెప్తాను. వీలుండి రాగలిగితే వస్తారు. లేదంటే నేనే దగ్గరుండి జరిపిస్తాను. 
శబరి: అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు జరిపించుకో.. ఏదో ఒకరోజు ఆ పాపం కూడా నువ్వే అనుభవిస్తావ్.. 


జ్వాల: చిత్ర మోక్ష పంచమిని వదిలేసి మేఘనను పెళ్లి చేసుకుంటా అనడంలోనే ఏదో తిరకాసు ఉంది. సడెన్‌గా మోక్ష బుద్ధి ఎందుకు మారింది అనేదే ఇక్కడి ట్విస్ట్. ఈ పెళ్లి ఆగితే సీన్‌లోకి మళ్లీ పంచమి వస్తుంది. అసలు మోక్ష జీవితంలోకి ఇంకా ఎవరూ రాకుండా కొట్టాలి కొడితే.. 


గౌరి: ఫణేంద్ర మీరు వెళ్లడం నాకు ఇష్టం లేదు కానీ అక్కడ ఆ పెళ్లి జరిగితే మోక్షాబాబు ప్రాణాలకు ప్రమాదం అని చెప్తే తప్పక పంపిస్తున్నాను. 
పంచమి: అవునమ్మా నేను వెళ్లకపోతే మోక్షాబాబు అన్నంత పని చేస్తారు. నేను బతికి ఉండగానే నా భర్తను పోగొట్టుకోలేను అమ్మా.. 
గౌరి: నీకోసం మోక్షాబాబు ప్రాణాలకు తెగిస్తున్నారు అంటే మరొక్కసారి ఆలోచించు అమ్మా.. తను నీ నుంచి ఏం ఆశించనప్పుడు నువ్వు మోక్షతో ఉండటమే మంచిది అనిపిస్తుంది. 
ఫణేంద్ర: పంచమికి కావల్సింది మోక్ష సంతోషంగా ఉండటం ఎలా అయినా ఆ పని చేసుకొని వస్తాం.
పంచమి: అవునమ్మా.. మోక్షాబాబు మేఘనని కాకుండా ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నన్ను మర్చిపోయి తను సంతోషంగా ఉండగలరు. 
ఫణేంద్ర: కలిసుండే అవకాశం లేనప్పుడు దూరంగా ఉండటమే మేలు.. 


మేఘన: నంబూద్రితో.. నేను తలపెట్టిన కార్యంలో ఒక ఘట్టం పూర్తి అయింది అన్నయ్య. మోక్షతో నా వివాహానికి నిశ్చితార్థం జరిపించబోతున్నారు. 
నంబూద్రి: ఇంత వరకు వచ్చింది కాబట్టి ఒకసారి ఆలోచించు అమ్మా.. మోక్ష ఉత్తముడు. కోట్ల ఆస్తి నీ జీవితం సుఖంగా జరిగిపోతుంది. 
మేఘన: వద్దు అన్నయ్య నాకు ఈ భోగభాగ్యాల మీద వ్యామోహం లేదు. నా చిరకాల వాంఛ నా జీవితాశయం ఒక్కటే మహా మాంత్రికురాలినై పంచ భూతాలను సైతం భయపెట్టాలి. నేను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను అన్నయ్య. మా వివాహం రోజే మోక్షని తీసుకెళ్లి మహాకాళికి ఆహుతి ఇచ్చి నా శక్తులను నేను పొందుతాను అన్నయ్య. 
నంబూద్రి: మహాకాళి నీకు ఇచ్చిన వరంలో ఏదో మర్మం దాగుంది అని నా అనుమానం కరాళి. మహాకాళి నరబలి కోరడం నేను నమ్మలేకపోతున్నా కరాళి. నీకు ఏదో పెద్ద పరీక్ష పెట్టబోతుంది. అదేదో పసిగట్టి జాగ్రత్తగా అడుగులువేయ్. పంచమి, ఫణేంద్ర నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. 
మేఘన: నేను అన్నింటికీ తెగించే ఉన్నాను అన్నయ్య. ఎవరికీ భయపడటం మాత్రం జరగదు. ఒక్కసారి నా శక్తులు నాకు తిరిగి వచ్చిన తర్వాత వీళ్లందరికీ ఈ కరాళి విశ్వరూపం ఏంటో చూపిస్తాను. 


చిత్ర, జ్వాలలు భార్గవ్, వరుణ్‌లకు వడ్డిస్తూనే వారి మాటలతో మాయచేస్తారు. అమ్మ మాట విని మమల్ని కూడా వదిలేస్తారు అని రెచ్చగొడతారు. మీ సత్తా చూపించండి అని అంటారు. దీంతో వరుణ్, భార్గవ్‌లు మోక్షని పిలుస్తారు. అందరూ బయటకు వస్తారు. ఇద్దరూ మోక్షని రెండో పెళ్లి గురించి నిలదీస్తారు. వద్దని చెప్తారు.  
వైదేహి: రేయ్ నాతో మాట్లాడండి.. ఏంట్రా మీవాగుడు.. మీ ఇష్టాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. మోక్ష మేఘన ఇష్టపడ్డారు అదిచాలు. ఇష్టమైన వాళ్లు ఉండండి.. లేదంటే పోండి..
భార్గవ్: మేఘన ఈ రెండో పెళ్లి చేసుకోవడానికి మీరు ఎలా ఒప్పుకున్నావ్.. 
వైదేహి: ఎప్పుడూ నా ఎదురుగా మాట్లాడని మీరు ఈరోజు నా ముందు నోరెత్తి మాట్లాడుతున్నారు. 
శబరి: వాళ్లు ఏం తప్పుగా మాట్లాడటం లేదు వైదేహి.. నీ నిర్ణయాలే ఎవరికీ మింగుడు పడటం లేదు. 


మరోవైపు జ్వాలలోకి నంబూద్రి వస్తాడు. చిత్ర భయపడుతుంది. హల్‌లో జరుగుతున్న డిస్కషన్‌ దగ్గరకు వచ్చి మేఘనకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది. నీ పెళ్లిని ఎవరూ ఆపలేరు అని మాట్లాడుతారు. జ్వాల మాటలకు చిత్ర షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ ఫిబ్రవరి 2nd : పెళ్లి ఆపేయమంటూ దివ్యని రెచ్చగొట్టిన హరీష్.. అనుని భయపెట్టిన మాన్సీ, ఛాయదేవి!