Krishna Mukunda Murari Today Episode: ఆదర్శ్‌ ముకుంద మారిపోయింది అనుకొని తనని వదిలేసి వెళ్లినందుకు సారీ చెప్తాడు. ముకుంద చేతులు పట్టుకొని ఇకపై కలిసి ఉందామని చెప్తాడు. ఆదర్శ్‌ మాటలకు ముకుంద తల పట్టుకుంటుంది. తన అత్తయ్య, ఇంట్లో వాళ్లను రప్పించడానికి ఆదర్శ్ రావడానికి ఒప్పుకున్నా కానీ ఆదర్శ్‌ని మ్యానేజ్ చేయడం కష్టమని రోజు రోజుకు తనమీద ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నాడు అని ఫీలవుతుంది. ఎక్కువ రోజులు ఆదర్శ్‌ని దూరంగా ఉంచలేను అని ఏదో ఒకటి చేయాలి అని ముకుంద అనుకుంటుంది.


మురారి: ఏంటి మేడమ్ రింగ్ చూసి మురిసిపోతున్నారు. 
కృష్ణ: మురిసిపోవడం కాదు ఏసీపీ సార్ పట్టలేని అంత సంతోషంగా ఉన్నాను. ముకుంద మీతో నా వేలికి ఉంగరం తొడిగించింది అంటే అంత కంటే గొప్ప మార్పు ఇంకేం ఉంటుంది చెప్పండి.
మురారి: నిజమే నాకు చాలా సంతోషంగా ఉంది. కలా నిజమా అన్నట్లు ఉంది. 
కృష్ణ: కానీ పెద్దత్తయ్యకు ఇంకా ముకుంద మీద నమ్మకం కలిగిందా లేదని అనుమానంగా ఉంది అంతే..
మురారి: ఇంత జరిగాక నమ్మకుండా ఎలా ఉంటుంది చెప్పు కచ్చితంగా నమ్ముతుంది. ఒకవేళ కాస్తో కూస్తో అనుమానం ఉన్నా మన శోభనం జరిగితే పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. 


భవాని: తనలో తాను.. నిజంగానే ముకుంద కృష్ణ మీద అభిమానంతో అలా చేసిందా లేదంటే ఆదర్శ్‌తో రింగ్ తొడిగించుకోవడం ఇష్టం లేక అలా చేసిందా.. కృష్ణ మీద లేనిపోని అభిమానం చూపిస్తుంది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి. ముకుంద ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకూ అనుమానం పెరుగుతుందే తప్ప నమ్మకం అస్సలు రావడం లేదు. నా అనుమానమే నిజం అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన నా కొడుకు ఏమైపోతాడు. ముకుంద మారలేదు అని తెలిస్తే ఉంటాడా.. ఈ సారి వెళ్తే ఈ జన్మలో మళ్లీ కనిపిస్తాడా.. అసలు ముకుందలో మార్పు రాకపోతే కృష్ణ, మురారి జీవితంలో మళ్లీ ఏ సమస్యలు మొదలవుతాయో ఏంటో.. 
రేవతి: అక్కా.. ఏంటి అక్కా ఆలోచిస్తున్నారు. మీరు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది అక్క. పంతులు గారు వచ్చి పది పదిహేను రోజుల వరకు ముహూర్తాలు లేవు అన్నప్పటి నుంచి మీలో మార్పు వచ్చింది. అందుకే పంతులు గారితో మాట్లాడి పెట్టుడు ముహూర్తం పెట్టించనా.. 
భవాని: పెట్టుడు ముహూర్తమా..
రేవతి: అవును అక్క రేపు ఓ ముహూర్తం ఉంది. మీరు సరే అంటే మురారి వాళ్లకు ఆదర్శ్ వాళ్లకి రేపే ముహూర్తం పెట్టించేస్తాను.
భవాని: పది పదిహేను రోజుల తర్వాత ముహూర్తం ఉంది అన్నారు కదా మళ్లీ పెట్టుడు ముహూర్తం పెట్టించాల్సిన అవసరం ఏముంది. 
రేవతి: ఇది అందరు చేసే పనే అక్క. కొందరికి ఆరునెలలు, ఏడాది వరకు ముహూర్తాలు లేకపోతే ఇలా చేస్తారు. 
భవాని: ఇది అన్నిరోజులు సమస్య కాదు కదా.. జస్ట్ పదిరోజులు ఓపికపట్టలేవా.. కావాలి అంటే మురారి వాళ్లకు పెట్టు ఆదర్శ్ వాళ్లకి ఇప్పుడే వద్దు.
రేవతి: అదేంటి అక్క ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకపోతే బాగోదు కదా.. ఇద్దరికీ ఒకేసారి జరగాలి అనే కదా ఇంత వరకు ఆగాం. వాళ్లకు పెళ్లి అయి ఏడాది అయిపోయింది. భార్య భర్తల్లా ఒకటి కాకపోతే ఎలా అని..
భవాని: మనసులో.. భార్యాభర్తల్లా ఒకటి కాకపోతే ఎలా అని నువ్వు ఆలోచిస్తున్నావ్.. అదే శోభనం జరిపిస్తే ఎక్కడ వాళ్ల జీవితాలు అంధకారం అయిపోతాయా అని నేను భయపడుతున్నాను. ఆదర్శ్‌ అంటే ఇష్టం లేకుండా ముకుంద ఎన్నాళ్లు నాటకం ఆడుతుంది. శోభనం రోజు అయినా బయట పడాల్సిందే కదా.. అదే జరిగితే ఆదర్శ్ తట్టుకోగలడా.. అందుకే కావాలనే ఇలా శోభనం జరగకుండా ఆపుతున్నాను. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి. 


కృష్ణ: ఏమైంది అత్తయ్య ఇందాక పెద్దత్తయ్య దగ్గరకు చాలా హుషారుగా వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఇలా డల్ అయిపోయారు ఏమైంది. 
భవాని: మీ పెద్దమ్మ సంగతి నాకు ఏం అర్థంకావడం లేదురా.. నిజానికి మీ పెద్దత్తయ్య హ్యాపీగా లేరు కృష్ణ. మీ శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టించాలా అని అడిగాను దానికి కావాలి అంటే మురారి వాళ్లుకు పెట్టుకో ఆదర్శ్‌ వాళ్లకి ఇప్పుడు వద్దు అంటున్నారు.
కృష్ణ: అవునా ఎందుకు అత్తయ్య. 
రేవతి: ఏమో తెలీదు.
మురారి: పెద్దమ్మ వద్దు అంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. 


భవాని: రేవతి మాట్లాడిన విషయమే నువ్వు మాట్లాడటానికి వచ్చి ఉంటే వద్దు కృష్ణ. 
కృష్ణ:  ఎందుకు పెద్దత్తయ్య అంత కోపంగా ఉన్నారు. మీకు ఇష్టం లేని పనులు కోపం తెప్పించే పనులు ఎవరూ చేయరు. అత్తయ్య కూడా.. కానీ ఇప్పుడు అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది. ఆ మూహుర్తం ఏదో రేపే ఉంది అంట.
భవాని: ఉంటే నీకు మీ ఆయనకు ఏర్పాటు చేసుకోండి. అంతేకానీ ఆదర్శ్‌ వాళ్లకి వద్దు. 
కృష్ణ:  ఏంటి అత్తయ్య అలా మాకు మేం పెట్టుకునే వాళ్లమే అయితే ఇంత వరకు ఆగుతామా.. వాళ్లకి జరిగినప్పుడే మాకు కూడా జరగాలి అనే కదా ఇన్ని రోజులు వాయిదా వేశాం.
భవాని: చేశావ్ కదా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. కొత్త ప్రయోగాలు చేయకుండా మీ గురించి ఆలోచించుకోండి. 
కృష్ణ: ఏసీపీ సార్ అత్తయ్య ఏవేవో చెప్పారు కానీ అవి కారణాలు అనిపించలేదు. ఇంకా ఏదో ఉంది. 
మురారి: ఆదర్శ్‌, ముకుంద క్లోజ్‌గానే ఉన్నారు కదా. నాకేం అర్థం కావడం లేదు.
కృష్ణ: చాలా చెప్పాను అత్తయ్యతో ఇంకొక్క మాట చెప్తే నాలుగు తగిలించి బయటకు గెంటేస్తారు అని మీ ఇష్టం అని చెప్పి వచ్చేశాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: త్రినయని సీరియల్ ఫిబ్రవరి 2nd: గాయత్రీ పాప చేయి తగిలి ఊడిన నాగవల్లి పత్రాలు.. చీరతో మరో కుట్ర చేయనున్న తిలోత్తమ!