Naga Panchami Serial Today Episode
వైదేహి: అవసరం అయినప్పుడు మరో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు.
మోక్షతండ్రి: వైదేహి పిల్లలకు అదేనా మనం నేర్పించాల్సింది. అలాంటి సంసృతిని మనం ప్రోత్సహించకూడదు.
వైదేహి: సుఖం సంతోషం లేని పెళ్లిళ్లు అనవసరం అండి. మన మోక్ష వారసత్వం లేకుండా ఇలాగే ఉండిపోమని కోరుకుంటున్నారా.
మోక్ష: మమ్మీ మా గురించి మీరు డిస్కషన్ చేయడం అనవసం. సంతోషంగా లేమని మేము ఎప్పుడు చెప్పాం.
వైదేహి: కోడళ్ల కడుపు పండినప్పుడే మోక్ష కొడుకులు ఆనందంగా ఉంటారు.
మోక్షఅత్త: జ్వాలాకు కూడా పిల్లలు లేరు కదా మరి వారి విషయంలో ఎప్పుడు ఏం అనలేదు ఎందుకు వదినా.
వైదేహి: మోక్ష ఎవర్ని అయినా పేరున్న సిద్ధాంతిని పిలుస్తాను. మీ ఇద్దరి జాతకాలు చూపించి భార్య వలన నీకు ఏదైనా కీడు ఉందని తెలిస్తే మాత్రం మరో మాటకు అవకాశం ఇవ్వను. అప్పుడు నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే.
మోక్ష: అవసరం లేదు మమ్మీ. మా విషయంలో మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం.
వైదేహి: మీరు హ్యాపీగా ఉంటే అంతే చాలా మోక్ష. త్వరగా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పక పోతే మాత్రం మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మీ ఇద్దరికి టెస్ట్‌లు చేయిస్తాను. పంచమి మోక్షల విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నా సందేహాలు తొలగితేనే నేను కుదురుగా ఉండగలను.
మోక్ష: మీరేం కంగారు పడకండి మమ్మీ. త్వరలోనే మేం గుడ్ న్యూస్ చెప్తాం. కానీ నాది ఒకటే కోరిక మీరంతా పంచమిని బాగా చూసుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరూ తన మనసును కష్టపెట్టకూడదు. అలా అయితేనే మీరు కోరుకున్నది జరుగుతుంది. లేదంటే మేమిద్దరం మీకు కనిపించనంత దూరం వెళ్లిపోతాం. మీరు మమల్ని మళ్లీ ఎప్పుడు చూడలేరు. రా పంచమి.
మోక్షతండ్రి: అనవసరంగా మోక్ష మనసు కష్టపెట్టావు వైదేహి. ఇది కరెక్ట్ కాదు.
మరోవైపు జ్వాలా, చిత్రలు వైదేహికి పంచమి గురించి తగిలిస్తారు. ఇక మేఘన తన ఆశ్రమానికి ఫణేంద్రని తీసుకొస్తుంది. ఇక మేఘన తన మాయమాటలతో ఫణేంద్రని నమ్మిస్తుంది. నాగదేవత శాపం వల్ల తాను అక్కడికి చేరింది అని చిన్న చిన్న మంత్ర శక్తులు నేర్చుకున్నానని చెప్తుంది. దీంతో మేఘన మాటలు నమ్మేసిన ఫణేంద్ర తనని నాగలోకం తీసుకెళ్లి నాగదేవతను ఒప్పిస్తాను అని చెప్తాడు. ఇక యువరాణిని ఎలా అయినా తీసుకెళ్లిపోతానని ఫణేంద్ర అంటాడు.
మేఘన: మోక్ష చనిపోడానికి యువరాణి ఒప్పుకోదు. మోక్ష చనిపోతే కాని యువరాణి నాగలోకం రాలేదు. సమస్య అదే కదా యువరాజా. ముందు మోక్షని బతికిస్తానని పంచమికి చెప్పు.
ఫణేంద్ర: అదెలా సాధ్యం.
మేఘన: నాగమణి సాయంతో. యువరాణికి కావాల్సింది మోక్ష ప్రాణాలు.. మీకు కావాల్సింది యువరాణి నాగలోకం రావడం. ఆలోచించు ఫణేంద్ర. నాగలోకం వదిలి శాశ్వతంగా భూలోకంలో నువ్వు ఉండగలవా. మన యువరాణి పరిస్థితి కూడా అదే. ఒక్కసారిగా ఈ లోకాన్ని తన వాళ్లని వదులు కోవాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది.
ఫణేంద్ర: నాగమణిని భూలోకం తీసుకురావడం చాలా కష్టం.
మేఘన: యువరాణిని నాగలోకం తీసుకెళ్లడం కంటే కష్టం కాదు ఫణేంద్ర. నువ్వు తలచుకుంటే యువరాణిని సంతోషంగా నీతో పాటు నాగలోకం తీసుకెళ్లగలవు.
ఫణేంద్ర: అలా చేయాలి అన్నా నాగమణిని నేను తీసుకురాలేను. నాగ వంస్తులు మాత్రమే ఆ నాగమణిని తాకగలరు. యువరాణి ముందుగా అక్కడికి వస్తే కానీ అది సాధ్యం కాదు.
మేఘన: మనసులో.. ఇంత చిక్కుముడి పడిందేంటి.. కానీ ఎలా అయినా నాగమణిని భూలోకంలోకి తీసుకొచ్చి తీరాలి.
ఫణేంద్ర: యువరాణి ముందుగా నన్ను నమ్మి నాగలోకం రావాలి. ఆ తర్వాత నాగమణి గురించి ఆలోచించాలి.
మేఘన: యువరాణిని నమ్మించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయు ఫణేంద్ర నాగకన్యగా నన్ను యువరాణికి పరిచయం చేసి తనతో పాటు వాళ్ల ఇంట్లో ఉండేలా చేయి. మిగిలిన విషయాలు అన్నీ నేను చూసుకుంటాను. యువరాణిని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను నన్ను నమ్ము. నాగమణి గొప్పతనం గురించి మోక్షని నాగమణితో బతికించవచ్చని యువరాణిని నమ్మించి మోక్షని కాటేసి చంపేలా చేస్తాను. అలాగే మోక్షకి ప్రాణం మీద ఆశ కలిగించి చనిపోయినా నాగమణితో మళ్లీ బతుకుతాను అనేలా చేసి అందుకు సిద్ధం చేస్తాను. నన్ను నమ్ము ఫణేంద్ర నేను ఆ పని చేయగలను. కానీ కచ్చితంగా నువ్వు నాగమణిని తీసుకొస్తా అంటేనే..
ఫణేంద్ర: చాలా కష్టం మేఘన. కానీ నేను నాగమణి తీసుకురావడానికి యువరాణికి సాయం చేస్తాను.
మోక్ష: పంచమి నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మా మమ్మీ విషయం నాకు బాగా తెలుసు పంచమి. తను అనుకున్నది సాధించిన వరకు వదిలిపెట్టదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ మన పరిస్థితి వేరు. నువ్వు మాత్రమే ఈ ఇంట్లో ఉండగలవు. అది తల్లివైతేనే.
పంచమి: మీకు అంతా తెలుసు మోక్షాబాబు. మనది పరిష్కారం లేని సమస్య. మీకు పిల్లలే ముఖ్యమైతే మీ జీవితంలోనుంచి పక్కకు తప్పుకోమని చెప్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
మోక్ష: అలా అనకు పంచమి. నాకు నువ్వు ముఖ్యం. మాకు అసలు పిల్లలే అవసరం లేదు అని నేను మా మమ్మీకి చెప్పుకోగలను. నేను ఏ సుఖం కోరుకోవడం లేదు. నా ఆశయం ఒక్కటే పంచమి. నువ్వు ఈ లోకంలో ఉండాలి. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో గౌరవంగా తిరగాలి. అవి రెండూ జరగాలి అంటే ఉన్నది ఒకటే మార్గం. నువ్వు తల్లివి అవ్వాలి. అలా లేదు అంటే నువ్వే మరేదైనా అవకాశం ఉంటే చెప్పు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఎదురు చెప్పను పంచమి. నన్ను నిరాశగా మాత్రం ఈ లోకం నుంచి సాగనంపకు. నేను లేకపోయినా నా భార్య అయినా సంతోషంగా ఉండాలి.
పంచమి: మీరు మీ ప్రాణ గండం జరిగిపోయిన తర్వాత దాని గురించి ష్ర
ఆలోచిస్తున్నారు మోక్షాబాబు. అసలు ఆ గండం రాకుండా ఉండటం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. మిమల్ని కాపాడుకోగలనను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను మోక్ష బాబు. నా కన్న తల్లి చావుకి అసలైన కారణం నువ్వు కాదు. ముఖ్య కారకుడు ఆ నంబూద్రీ. అందుకే ఘోరమైన చావు చచ్చాడు.
మోక్ష: పంచమి నిజంగా నంబూద్రీ గారు చనిపోయారా.
పంచమి: అవును మోక్షా బాబు. నేనే కాటేసి చంపాను. నా కన్న తల్లి పగ, నాగ లోకం ప్రతీకారం నంబూద్రీ చావుతో తీరిపోయింది. ఇక ఎవర్నీ నేను చంపాల్సిన అవసరం లేదు. మీరు భయపడతారు అని ఇంతవరకు నంబూద్రీ చనిపోయిన విషయం నేను మీకు చెప్పలేదు. ఆయన చెల్లెలు కరాళి మోహినిగా పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చింది పాముల విషం మీద ప్రయోగం చేయడానికి కాదు. నేను ఇష్టరూపనాగునని తనకి తెలుసు. నేను పాముగా మారి తన అన్నని కాటేయడం కూడా తను చూసింది. ఎలా అయినా నన్ను బంధించి నా ద్వారా నాగలోకంలోని నాగమణిని సంపాదించి తన అన్నను బతికించుకోవాలని తన అన్న శరీరాన్ని ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకుంది.
మోక్ష: ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు పంచమి.
పంచమి: మీరు ఇంకా బయపడిపోతారని చెప్పలేదు మోక్షబాబు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను. మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అందుకే మీమల్ని కాపాడుకోగలనని నేను బలంగా నమ్ముతున్నాను.
మోక్ష: నాగమణితో ప్రాణాలు కాపాడొచ్చా పంచమి.
ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!