Salaar Vs Dunki, PVR Inox Controversy: బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ కొత్త సినిమా 'డంకీ'కి మేలు చేయాలని ప్రయత్నించిన పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ & మిరాజ్ మల్టీప్లెక్స్‌లకు 'సలార్' టీమ్ స్ట్రాంగ్ షాక్ ఇచ్చింది. ఆ సంస్థలకు చెందిన స్క్రీన్లలో తమ సినిమా విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే... రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు అన్యాయం జరగడం వెనుక షారుఖ్ ఉన్నారని ముంబై మీడియా వర్గాల కథనం!


నమ్మించి మోసం చేసిన పీవీఆర్, ఐనాక్స్!?
బాక్సాఫీస్ బరిలో 'సలార్', 'డంకీ' మధ్య పోటీ ఏర్పడుతుందని, ఆ రెండు చిత్రాలు థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుందని ముందు నుంచి పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ పండితులు ఊహిస్తూ వచ్చారు. సింగిల్ స్క్రీన్లు కావచ్చు లేదా మల్టీప్లెక్స్ స్క్రీన్లు కావచ్చు... ఏరియా, స్టేట్ బట్టి షారుఖ్, ప్రభాస్ క్రేజ్ బేరీజు వేసుకుని థియేటర్లు కేటాయిస్తారని అనుకున్నారు. విడుదల దగ్గరకు వచ్చే సరికి ఆ విధంగా జరగలేదు. 'డంకీ'కి అనుకూలంగా పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ చైన్ నిర్ణయం తీసుకుంది.


Also Read'సలార్' దెబ్బకు బుక్ మై షో క్రాష్ - ఇదీ ప్రభాస్ రేంజ్


దక్షిణాది రాష్ట్రాల్లో పీవీఆర్, ఐనాక్స్ అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లు మాత్రమే. కానీ, ఆ సంస్థకు దేశవ్యాప్తంగా 1650 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నారు. పీవీఆర్, ఐనాక్స్ ఆధ్వర్యంలో ఉన్న ఆ స్క్రీన్లు అన్నిటిలోనూ ఆదివారం వరకు 'డంకీ' సినిమా షోస్ షెడ్యూల్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తొలుత 'డంకీ', 'సలార్'కు సమంగా థియేటర్లు ఇస్తామని చెప్పిన పీవీఆర్, ఐనాక్స్... రాత్రికి రాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. షారుఖ్ ఖాన్ సినిమాకు మేలు కలిగించేలా అడుగులు వేసింది. 'సలార్' సినిమాను పక్కకి తీసి పారేసింది. చెత్త డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలకు తెర తీసింది. 


పీవీఆర్ యజమానికి షారుఖ్ ఫోన్!?
రాత్రికి రాత్రి పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యం ప్లేట్ ఫిరాయించడం వెనుక కింగ్ ఖాన్ షారుఖ్ ఉన్నారని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. 'డంకీ', 'సలార్'... రెండు సినిమాలకు ఈక్వల్ స్క్రీన్లు ఇవ్వాలనిఅనుకుంటున్న విషయం 'డంకీ' బృందానికి తెలిసిన వెంటనే షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగారట.


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు
 
''పీవీఆర్ మల్టీప్లెక్స్ ఓనర్ (యాజమాన్యాని)కి షారుఖ్ ఖాన్ నేరుగా ఫోన్ చేశారు. అంత పెద్ద స్టార్ హీరో నుంచి డైరెక్ట్ ఫోన్ కాల్ రావడంతో పీవీఆర్ ఐనాక్స్ మైంటైన్ చేస్తున్న సింగిల్ స్క్రీన్లు అన్నిటినీ 'డంకీ'కి ఇచ్చారు. దాంతో 'సలార్' సినిమాను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తడానీకి, హోంబలే నిర్మాణ సంస్థకు ఆగ్రహం కలిగింది'' అని ఓ బాలీవుడ్ మీడియా సంస్థ పేర్కొంది. నార్త్ ఇండియాలో స్క్రీన్లు ఇచ్చే వరకు సౌత్ ఇండియాలో ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో తమ సినిమా వేయకూడదని 'సలార్' టీమ్ డిసైడ్ అయ్యింది. అదీ సంగతి!


Also Readప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?