Naga Panchami Today Episode జ్వాల, చిత్ర మాటలను నాగేశ్వరి పాము వినేస్తుంది. ఇద్దరూ మోక్ష తల మీద కుండీ పడేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ నింద పంచమి మీద తోసేసి పంచమిని ఇంటి నుంచి పంపేయాలి అని నిర్ణయించుకుంటారు. ఉదయం వచ్చి ఆ పని చేయాలని తమ గదులకు వెళ్లిపోతారు.
ఇక ఉదయం మోక్ష రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మోక్ష తల పగిలితే పంచమి మీద నింద వేసి అరిష్టం అని చెప్తే.. వైదేహి కడుపులో బిడ్డను తొలగించేస్తుంది అని అనుకుంటారు. ఇక మోక్ష వస్తాడు. మోక్షకు ఫోన్ రావడంతో అక్కడక్కడే తిరుగుతూ మాట్లాడుతాడు. అదంతా నాగేశ్వరి పాము చూస్తుంటుంది.
చిత్ర, జ్వాలలు కర్రతో పూల కుండీ తోయడానికి ప్రయత్నిస్తారు. ఇక అప్పుడే నాగేశ్వరి పాము ఆ కుండీని చుట్టేస్తుంది. అది చూసి చిత్ర, జ్వాలలు భయపడకుండా ఇది కూడా తమకే మంచిది అనుకొని కుండీని తోస్తుంటుంటారు. మొత్తానికి కుండీ కింద పడుతుంది. అయితే నాగేశ్వరి తన తోకతో కుండీని పట్టుకొని మోక్ష మీద కాకుండా పక్కన పడేలా చేస్తుంది. మోక్ష కంగారు పడిపోతాడు. పైకి చేస్తే నాగేశ్వరి పాము ఉంటుంది. ఇంట్లో అందరూ కంగారు పడి బయటకు వస్తారు. పంచమి కూడా వస్తుంది. పామును చూసి షాక్ అయిపోతారు. తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ
చిత్ర: అమ్మో అమ్మో ఇక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పాముకి ఎన్ని తెలివి తేటలు ఈరోజు మోక్షని చంపాలనుకుంది. రేపు మనల్ని కూడా చంపేస్తుంది.
జ్వాల: అలా అమాయకంగా చూడకు పంచమి. నీకు తెలీకుండా ఏం జరగదు. నువ్వే ఆ పాముకు చెప్పి మోక్ష మీద కుండీ పడేలా చేయమన్నావ్.
మీనాక్షి: బుద్ధున్నోలు ఎవరైనా అలా భర్తకు హాని చేయాలని చూస్తారా.
చిత్ర: ఇంకెవరూ చేయరు ఇదిగో ఈ పంచమినే చేస్తుంది. ఎందుకు అంటే తనను ఇంటి నుంచి పంపేస్తారు అన్నప్పుడల్లా ఇలాంటివి ఏదో ఒకటి చేసి కాపాడినట్లు మాయ చేసి ఇంటిలోనే తిష్ట వేస్తుంది.
పంచమి: ప్రమాణ పూర్తిగా నాకు ఏమీ తెలీదు. కావాలని నా మీద అభాండాలు వేస్తున్నారు.
జ్వాల: మాకు అంత అవసరం లేదు. ఆ సోది ఆమె ఏం చెప్పింది నీ వల్ల ఈ ఇంట్లో అరిష్టం అని చెప్పిందా లేదా..
చిత్ర: అప్పుడే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఇంట్లో అందర్ని బలి తీసుకుంటుంది. అది మోక్ష చావుతోనే మొదలైనట్లే ఉంది.
శబరి: నోరు మూయండి ఎప్పుడు అపశకనం మాటలే..
జ్వాల: బామ్మ గారు మీరు మా నోళ్లు మూయించకండి అది సరిగ్గా మోక్ష మీద పడాల్సింది. ఇంచ్ గ్యాప్‌లో మోక్ష తప్పించుకున్నాడు. మోక్ష తల మీద కుండీ పడి ఉంటే ఆ సోది ఆమె మాటలు నమ్మేవారు కదా..
మోక్ష: కొన్ని యాక్సిడెంటల్‌గా జరుగుతాయి. వాటికి మూఢనమ్మకాలకు ముడి పెట్టకండి. పద పంచమి..
కరాళి: అన్నయ్య నీ అవసరం నాకు మళ్లీ పడింది.
నంబూద్రీ: చెప్పు చెల్లమ్మ నీకోసం ఎన్ని రోజులు అయినా ఆత్మగా ఉంటాను.
కరాళి: అన్నయ్య రోజు రోజుకు నా పరిస్థితి హీనంగా మారిపోతుంది. మోక్ష దక్కలేదు. నా శక్తులు పోయాయి. మహాంకాళి దర్శనం ఇవ్వడం లేదు. ఇప్పుడు పంచమి కడుపులో నాకు శత్రువు తయారవుతుంది.
నంబూద్రీ: నువ్వు ఎన్ని చేస్తున్నా పంచమిని జయించలేకపోతున్నావ్.
కరాళి: అవును అన్నయ్య ప్రతీసారి పంచమిదే పై చేయి అవుతుంది. ఇప్పుడు నేను పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణిని నాశనం చేయాలి అన్నయ్య. లేదంటే నా ప్రాణాలకే ప్రమాదం.
నంబూద్రీ: ఇప్పుడు నేను ఏం చేయాలి..
కరాళి: పంచమి కడుపులోని బిడ్డను లోపలే చిధిమేయాలి అన్నయ్య.. నాకు నీ సాయం కావాలి.
నంబూద్రీ: పౌర్ణమి రోజున నాగులన్నీ సంభోగ మైకంలో ఉండి శక్తి హీనంగా ఉంటాయి. వచ్చే పౌర్ణమి శక్తి వంతమైనది ఆరోజు నీ కార్యానికి ముహూర్తం పెట్టుకో నన్ను ఆవాహనం చేసుకో నేను వస్తా..
కరాళి: పంచమి వచ్చే పౌర్ణమి రోజు నీకు ముహూర్తం పెట్టాను. నీ బిడ్డను చిధిమేస్తా..
వైదేహి పంచమిని బయటకు లాక్కొస్తుంది. పంచమిని నిలదీస్తుంది. పాముల భాష నీకు తెలుసని వాటితో సంబంధం ఉందని తెలుసు కానీ అంతకు మించి నీకు పాములకు మధ్య ఏదో ఉందని నిలదీస్తుంది. దీంతో పంచమి నాగేశ్వరి పాము గురించి చెప్తే అత్తయ్య ఇంకా కంగారు పడిపోతారు అని అనుకుంటుంది. ఎందుకు ఆ పాములు ఇంట్లో తిరుగుతున్నాయని వైదేహి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.