Nindu Noorella Saavasam Serial Today Episode: అరుంధతి లేని టైం చూసుకుని గుప్త తన రింగు కోసం వెతుకుతుంటాడు. ఇంతలో గుప్తకు రింగు దొరుకుతుంది. అది తీసుకుని హ్యపీగా ఫీలయిన గుప్త అసలు ఇది నా అంగుళీకమేనా అని పరిక్షించి చూస్తాడు. అది తన రింగేనని ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో అరుంధతి గుప్తను వెతుక్కుంటూ వస్తుంది. గుప్త హ్యాపీగా ఉండటం చూసి ఎందుకు అంత సంతోషంగా ఉన్నారని అడుగుతుంది. దీంతో గుప్త తన రింగు చూపిస్తాడు. దీంతో అరుంధతి షాక్‌ అవుతుంది. ఇదొక రోజు నాకు టైం ఇవ్వండి అని అడుగుతుంది. నేను ఏం చేయలేనని ఇక మనం వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటాడు. ఉంగరాన్ని తలకు పెట్టుకుని మంత్రాలు చదువుతుంటాడు. అరుంధతి దేవుణ్ని మొక్కుతుంది. పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజు టైం ఇవ్వమని వేడుకుంటుంది. ఇంతలో గుప్త ఒక్కడే పైకి వెళ్తాడు. మళ్లీ కిందకు వచ్చిన గుప్త ఏం జరిగిందని చూడగానే అరుంధతి అంజు బాడీలోకి వెళ్లిపోయి ఉటుంది.  


గుప్త: వద్దు బాలికా నువ్వు చేయుచున్నది చాలా తప్పిదము. నీ మంచి కోరి చెప్పుచుంటిని వెంటనే నువ్వు బయటికి రమ్ము. బాలికా చెప్పినది వినుము..


దూరం నుంచి చూస్తున్న మిగతా పిల్లలు ఆశ్యర్యంగా చూస్తుంటారు. గుప్త అంజు వెంట పడితే అంజు తప్పించుకుని తిరుగుతుంది. అంజు లోపలికి వెళ్లగానే గుప్త కిందపడిపోతాడు.


గుప్త: కూష్మాండం బద్దలైపోయింది.


అంజు: నా పిల్లలకే నన్ను దూరం చేయాలని చూస్తారా? మా ఆయనకే అన్యాయం చేయాలని చూస్తారా?


గుప్త: ఈ బాలిక నా ప్రాణం మీదకే తెచ్చుచున్నది.


అంటూ అంజును పట్టుకోవడానికి ప్రయత్నించి మళ్లీ కిందపడిపోతాడు. మిగతా పిల్లలు లోపలికి వచ్చి అంకుల్‌ ఏమైంది అని అడగ్గానే గుప్త చూస్తుండిపోతాడు. మరోవైపు నీల బయపడుతూ అమర్‌ డూప్లికేట్‌, వర్జినల్‌ నగలు తీసుకెళ్లిపోయాడు మనోహరి అమ్మ ఫోన్‌ ఎత్తడం లేదని అనుకుంటుండగానే మనోహరి వస్తుంది. తన ఫోన్‌ ఎక్కడో మర్చిపోయాను వెతుకుదాం పద అని నీలను తీసుకుని రూంలోకి వెళ్లి ఫోన్‌ వెతుకుతుంది. ఫోన్‌ దొరకగానే జ్యువెలరీ షాప్‌  అతను చాలా సార్లు ఫోన్‌ చేశాడనగానే.. అమర్‌ బాబును అతను కలిశాడు. నగలు ఉన్న బ్యాగ్‌ ఇచ్చాడు అని నీల చెప్పగానే కంగారుగా మనోహరి  బయటకు వెళ్తుంది. మరోవైపు జువెల్లరీ షాపకు రాథోడ్‌తో కలిసి మిస్సమ్మ వెళ్తుంది. మనోహరి నగలు తీసుకొచ్చిన విషయం అడగ్గానే అసలు నగలకు నకిలీ చెయ్యమని చెప్పారు. చేశాక ఇప్పుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని మా సార్‌ తీసుకుని వెళ్లారు అని సేల్స్‌ మెన్‌ చెప్పడంతో మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


మిస్సమ్మ: మనోహరి నగల్ని కరిగిస్తుంది. తాకట్టుపెడుతుంది అంటే డూప్లికేట్‌ నగలు చేపిస్తుంది. అంటే వర్జినల్‌ని ఎవరికో ఇవ్వబోతుంది. ముందు మనం మనోహరిని ఆపాలి. ఇంటికి వెళ్దాం పద.


రాథోడ్‌: అమ్మో ఎంత పని చేస్తుంది. వెళ్దాం పద మిస్సమ్మ.


అని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. మరోవైపు మనోహరి కారులో స్పీడుగా వెళ్తుంటే అరుంధతిని చంపిన తమిళ డ్రైవర్‌ వచ్చి అడ్డుపడతాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే మీరు జైలుకు పోవడం ఖాయం అంటాడు. నీకు ఇవ్వడానికే నగలు ఏర్పాటు చేశాను. అది ఇప్పుడు అమర్‌ చేతికి వెళ్లింది. వెంటనే ఆ బ్యాగు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని మనోహరి వెళ్లిపోతుంది. స్పీడుగా వెళ్తున్న మనోహరికి అమర్‌ అడ్డుగా వస్తాడు. ఎం జరిగిందని అడుగుతాడు. ఏం లేదు నీకు నగలు ఇచ్చాడట కదా అని చెప్పగానే అవి మిస్సమ్మకు ఇచ్చానని అమర్‌ చెప్పడంతో కంగారుగా మనోహరి  ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న బ్యాగును తీసుకొచ్చి తమిళ డ్రైవర్‌కు ఇస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఎలాంటి రిస్క్ తీసుకోడానికైనా సిద్ధపడే అఖిల్ - అక్కినేని వారసుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?