Krishna Mukunda Murari Today Episode కృష్ణ, మురారిలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లగేజ్ సర్దుకొని వస్తారు. రేవతి చూసి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇంట్లో అందరూ వాళ్ల దగ్గరకు వస్తారు. దానికి మురారి మా ఇంటికి వెళ్తున్నాం అని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అని అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.


మీరా: మనసులో.. మురారి కోసమే ఇంత కష్ట పడి ఇక్కడికి వస్తే వెళ్లిపోతా అంటాడు ఏంటి.
రేవతి: మీ ఇంటికా ఓరేయ్ తల ఏమైనా తిరగుతుందా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు.
కృష్ణ: క్షమించండి అత్తయ్య మేం ఇక్కడ ఉండటం కొంతమందికి ఇష్టం లేదు. ఇక్కడే ఉండి వాళ్లని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వేరే ఇంటికి వెళ్లిపోతున్నాం. వాళ్లు అయినా సంతోషంగా ఉంటారు కదా అందుకే వెళ్లిపోతున్నాం. మీకు అర్థమైంది కదా అత్తయ్య.
మీరా: అదర్శ్‌ ఏమన్నా మురారి పట్టించుకోడు కదా. ఇప్పుడు నేనే ఏం చేయాలి.
రజిని: చూడు బాబు మనకు ఒక చోట ఉండటం ఇష్టం లేదు కదా.. ఇష్టం లేని చోట ఉండటం కంటే వెళ్లిపోవడం బెటర్.
రేవతి: వదినా మీరు ఊరుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. మురారి ఈ మాట ఎవరైనా అనొచ్చు నువ్వు అనకూడదు. వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో వాడు ముందు ఎలా ఉండేవాడో అన్నీ నీకు తెలుసు. నువ్వే అర్థం చేసుకోకుండా వెళ్లిపోతా అంటే అలా.
మురారి: అర్థం చేసుకున్నాను కాబట్టే వెళ్లిపోవాలి అనుకుంటున్నా. అసలు వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్న బాధ కంటే ఏదో అంటున్నాడు అన్న బాధే లేదు. 


మధు భవానిని పిలుస్తుంటే కృష్ణ అడ్డుకుంటుంది. ఇక మురారి రేవతిని కూడా తమతో పిలుస్తాడు. నీ కొడుకు ఉండటం ఇష్టం లేని వాడికి నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం ఉండదు. ఇంత అంటున్నా వాడు వద్దు అనడం లేదు. అంటే నువ్వు ఉండటం వాడికి ఇష్టం లేదు కదా అని మురారి అంటాడు.


మురారి: ఉండాలి అని కోరుకునే వాడు అయితే మౌనంగా ఉండడు కదా.. మా పిన్నిని తీసుకెళ్లడానికి నువ్వు ఎవడ్రా అని నా రెండు చెంపలు వాయించేవాడు. అమ్మ వెళ్లిపోదామమ్మ.
కృష్ణ: ఆదర్శ్‌ తప్పు మేం చేశామని ఫిక్స్ అయిపోయాడు అత్తయ్య. మనం వెళ్లిపోయి ఆ బాధని దూరం చేద్దాం పదండి అత్తయ్య.


మురారి వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోతుంటే సుమలత, మధులు ఆదర్శ్‌ని బతిమాలుతారు. అయినా ఆదర్శ్‌ కదలడు. ఇక కృష్ణ, మురారి ఇద్దరూ మీరాకి థ్యాంక్స్ చెప్తారు. ఇక మనసులో మీరా మురారిని దగ్గర చేసుకోవడానికి ఇంత చేస్తున్నా అని మీరు వెళ్లిపోతే ఎలా అని బాధ పడుతుంది. అందరూ ఎంత బతిమిలాడినా మురారి వాళ్లు వినరు. బయటకు వచ్చేసరికి ఎదురుగా భవాని ఉంటుంది. భవానిని చూసి నిల్చొండిపోతారు. 


రజిని: మనసులో.. ఈ భవాని వచ్చింది ఇంకేం వెళ్లనిస్తుంది. 
భవాని: ఎక్కడికి బయల్దేరారు. మీ అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్‌రా నువ్వు. అడుగుతుంది మిమల్నే. రేవతి నువ్వు ఎక్కడికి బయల్దేరావ్.
మీరా: నేను చెప్తా మేడం. ఎవరు ఏదో అన్నారు అని వీళ్లు ఇంటి  నుంచి వెళ్లిపోతున్నారు. 
భవాని: ఏంట్రా అప్పుడు ఆదర్శ్‌ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే ఊరుకున్నానని ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే ఊరుకుంటానా..( ఇంతలో ఆదర్శ్‌ తాగిన మైకంలో తూగుతూ బయటకు వస్తాడు.) మిమల్ని ఎవరు బయటకు వెళ్లమన్నారో వాళ్లనే కారణం చెప్పమను. అప్పుడు నేను నిర్ణయిస్తాను మీరు ఉండాలో వెళ్లాలో అని.
మీరా: మనసులో.. నేను చెప్పడం వల్లే ఆదర్శ్‌ ఇలా మాట్లాడి మురారి వాళ్లని ఇంట్లో నుంచి వెళ్లమన్నాడు అని చెప్తే నా పరిస్థితి ఏంటి. 
భవాని: చెప్పమనండి ఒకే ఒక్క కారణం చెప్పమనండి నేనే మిమల్ని పంపిచేస్తాను.
మధు: పెద్ద పెద్దమ్మ అడుగుతుంది కదా కారణం చెప్పు.. ఇంతలో ఆదర్శ్‌ సీరియస్‌గా వచ్చి మురారి బ్యాగ్‌ను తీసుకొని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతాడు. 
భవాని: అయిపోయింది కదా ఇంకా ఎప్పుడు అలా బ్యాగులు పట్టుకొని బయల్దేరకండి.. లోపలికి వెళ్లండి.
మీరా: మనసులో.. అమ్మయ్య మురారి వెళ్లలేదు. ఈ సారి ఆదర్శ్‌ని రెచ్చగొట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. నేను ఏం చెప్తే అది మాత్రమే చేసేలా నా గుప్పెట్లో పెట్టుకోవాలి. 


కృష్ణ గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అక్కడికి మీరా(ముకుంద)వస్తుంది. మనసులో కృష్ణని చూడటమే చిరాకుగా ఉంది అని అనుకుంటుంది. దీన్ని మురారికి దూరం చేసే అవకాశం తొందరగా రావాలి అనుకుంటుంది. ఇక ఇద్దరూ ఆదర్శ్‌ గురించి మాట్లాడుకుంటారు. ఆదర్శ్ పూర్తిగా మారి పోతాడు అని చెప్తుంది. ఇక ఇంటి నుంచి దూరం అయ్యేలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తుంది. ఇక మీరా మురారి గురించి అడిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి చీరకట్టుకొని అందర్ని మైమరిపించిన పాప.. ఆ పని వల్ల పరుగులు తీయలేక చచ్చిన వల్లభ!