Seethe Ramudi Katnam Today Episode: మధుమిత ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది. డాక్టర్‌కి ఫోన్ చేసిన మహాలక్ష్మికి ఆ విషయం తెలుస్తుంది. అయితే మహా డాక్టర్‌ని తాను చెప్పమన్నట్లు బయట ఉన్న సీత వాళ్లకు చెప్పమని చెప్తుంది. దానికి డాక్టర్ ఓకే అంటుంది. ఇక మహాను తన భర్త పొగిడేయడంతో రామ్, మధులను కలపడానికి ఎంతకైనా తెగిస్తాను అని మహాలక్ష్మి  అంటుంది. మధు డిశ్చార్జి కంటే ముందే తన ఆట మొదలవుతుందని మహా అంటుంది.


డాక్టర్ వచ్చి మధుకి ఏ ప్రమాదం లేదు అని చెప్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక డాక్టర్ రామ్ అంటూ కలవరిస్తుంది అని చెప్పి రామ్‌ని మాత్రమే లోపలికి వెళ్లమని డాక్టర్ చెప్తుంది. సీత ఫీలవుతుంది. ఇదే మహా చెప్తుంటుంది.  


అర్చన: ఇప్పటికైనా అర్థమైందా మధుకి మీకంటే రామే ఇష్టమని.. 
గిరిధర్: అయినా వీళ్లు మధు కోసం ఏం చేశారు. కష్ట పెట్టడం తప్ప. 
అర్చన: సీత కూడా అంటే మధుని టార్చర్ పెట్టింది అందుకే మధు చెల్లిని కాకుండా రామ్‌ని పిలిచింది. 


రామ్: ఇప్పుడెలా ఉంది మధుమిత. 
మధు: ఎందుకు నన్ను బతికించారు. నాకు బతకాలి అని లేదు.
రామ్: పిన్ని లేని టైంలో మీరు ఎందుకిలా చేశారు. పిన్ని మీకు న్యాయం చేస్తా అన్నారు కదా.. పిన్ని ఇప్పుడు ముంబయిలో ఉన్నారు వచ్చేస్తున్నారు. ఈ విషయం తెలిసి చాలా ఫీలయ్యారు. డాక్టర్‌  చెప్పారు మీరు నా పేరు తలిచారు అని నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా..
మధు: నేనా మీ పేరా..
డాక్టర్: అప్పటికి ఇంకా మీరు స్ఫృహాలోకి రాలేదు మధుమిత. రామ్ అని కలవరించారు అందుకే ఆయన్ను మాత్రమే పిలిచాను. 


సీత వాళ్లు కూడా లోపలికి వస్తారు. ఎందుకు ఇలాంటి పని చేశావని అందరూ మధుని అడుగుతారు. తలా ఓ ప్రశ్న అడిగితే డాక్టర్ మధుని డిస్ట్రబ్ చేయొద్దని అంటాడు. ఇక మధుని డిశ్చార్చ్ చేశాక మన ఇంటికి వచ్చేయ్‌మని శివకృష్ణ, లలితలు అంటే అర్చన, గిరిధర్‌లు అడ్డుకుంటారు. మహా పర్మిషన్ లేకుండా తీసుకెళ్లొద్దని అర్చన వాళ్లు అంటే నా కూతుర్ని తీసుకెళ్తా ఎవరు ఆపుతారో చూస్తా అంటూ శివకృష్ణ ఫైర్ అయిపోతాడు. గొడవ జరిగితే డాక్టర్ అందర్ని సైలెంట్‌గా ఉండమని అంటుంది.


రామ్: అంకుల్ మధు మీతో రావాలా.. మాతో ఉండాలా అన్నది మధు ఇష్టం. అది తననే చెప్పమందాం..
సీత: అమ్మానాన్నలతో వెళ్తానని చెప్పు అక్క. మన ఇంటికి వెళ్లిపో అక్కడే నీకు గౌరవం.
లలిత: చెప్పు మధు మన ఇంటికి వస్తేనే నీకు మంచిది.
మధు: నేను మహాలక్ష్మి గారి ఇంటికే వెళ్తాను అక్కడుంటేనే నేను క్షేమంగా ఉంటాను. 
అర్చన: ఇప్పుడు అర్థమైందా మధు ఎక్కడుండాలి అనుకుంటుందో ఇక మీరు దయచేయండి..
రామ్: ఆపండి బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టొద్దు.
లలిత: అమ్మా మధు నీకు మేం అంత కానివాళ్లం అయిపోయామా.. 
సీత: మన ఇంట్లోనే నీకు క్షేమం, గౌరవం అక్క అక్కడే నీ పరువు మర్యాదలు ఉన్నాయి. ఇక్కడేం లేవు.
అర్చన: ఇక్కడ తనకు ఏం లేదు అని ఎలా అంటావ్ సీత. 
శివకృష్ణ: నా కూతుర్ని మీరు మాయ చేస్తున్నారు.
మధు: నన్ను ఎవరూ మాయ చేయడం లేదు. నేను ఇష్టప్రకారమే ఆ ఇంట్లో ఉంటున్నాను. ఇకపై అదే నా ఇళ్లు.  
లలిత: అది నీ ఇళ్లు ఎలా అవుతుందే.. అది సీత అత్తారాల్లు. అక్కడ నీకు ఏం పనే..
మధు: సీతతో నాకు ఏం పని లేదమ్మ. నా బతుకు నాది. నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను బలవంతంగా నన్ను తీసుకెళ్లలేరు నాన్న. ఏదైనా ఉంటే మహాలక్ష్మి గారు వస్తే మాట్లాడుకుందాం.
లలిత: ఏం మాట్లాడుతున్నావే.. మేం నీ తల్లిదండ్రులమే నీ కోసం మేం వేరే వాళ్లతో మాట్లాడాలా.. మేం నీకు ఏమీ కామా మధు.. నీకు మాకు ఏ సంబంధం లేదా.. నీకు మేం పరాయి వాళ్లం అయిపోయామా..
శివ: అవును లలిత అది మనల్ని పరాయి వాళ్లని చేసేసింది. ఇలాంది దానితో మనకు మాటలు అనవసరం. మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. తల్లిదండ్రులుగా పరుగెత్తుకుంటూ వచ్చాం దానికి ఆ విశ్వాసం లేదు. వదిలేయ్ లలిత. 


శివకృష్ణ, లలితలు బయటకు వచ్చి బాధపడతారు. మధుని సీత వాళ్లు తీసుకొని వస్తారు. అర్చన వాళ్లు మధుని తీసుకొని వెళ్లిపోతారు. రామ్, సీత, సీత తల్లిదండ్రులను వదిలేస్తారు. నీ జీవితాన్ని నాశనం చేయడానికే అది ఉందని శివకృష్ణ అంటాడు. మధు గురించి బాధ పడతారు. రామ్ సర్దిచెప్తాడు. మధుమిత, సూర్యలను మీకు అప్పగించే బాధ్యత నాది అని రామ్ హామీ ఇస్తాడు. ఇక శివ, లలిత వెళ్లిపోతారు. సీత రామ్‌లు కూడా ఇంటికి బయల్దేరుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: తన పేరు మార్చిన మామను అడ్డుకున్న సత్య.. సపోర్ట్ చేసిన క్రిష్‌ని చంపేస్తానని గన్ తెచ్చిన మహదేవయ్య!