Naga Panchami Today Episode: పంచమిని గుడి దగ్గర డ్రాప్‌ చేసి వెంటనే వచ్చేస్తా అని చెప్పి మోక్ష బయటకు వెళ్తాడు. పంచమి తన మనసంతా ఆందోళనగా ఉందని మనస్శాంతి కోసం వచ్చాను అని మీ ఎదురుగానే ఉన్నాను అని నా మనసుకు కొంచెం ఉపశమనం కలిగించు స్వామి అని కోరుతుంది. పంచమి వెనకాలే సుబ్బు ధ్యానంలో ఉంటాడు. సుబ్బు శక్తిని ప్రసాదించడంతో పంచమి ముఖంలో వెలుగు వస్తుంది. ఇక పంచమి గాయాలు కూడా మాయమైపోతాయి. పంచమి హ్యాపీగా ఫీలవుతుంది. సుబ్బు పంచమి దగ్గరకు వస్తాడు.


సుబ్బు: గుడి ఏటూ కానీ సమయంలో వచ్చావేంటి పంచమి.
పంచమి: నేను అనుభవించిన కష్టాలు అన్నీ ఒక్కొక్కటిగా నా మీద దాడి చేసినట్లు అనిపించింది సుబ్బు. అందుకే స్వామితో చెప్పుకోవాలి అని మనస్శాంతి కోసం ఇక్కడికి వచ్చాను. సుబ్బు నేను మోక్షాబాబుని వదిలి ఉండలేను. కష్టాలు అయినా సుఖాలు అయినా ఇద్దరం కలిసే పంచుకోవాలి.
సుబ్బు: మీ కష్టాలు అన్నీ పోయాయి అని చెప్పారు కదా పంచమి. 
పంచమి: ఇంకా ఎక్కువ అయ్యాయి సుబ్బు. అంతా నువ్వు చెప్పినట్లే అయింది. మా జీవితాల్లోకి వెలుగు వచ్చిందని ఆనందించేలోపు చీకట్లు కమ్ముతున్నాయి. మాకు వేరే ఆశలు సుబ్బు మా ఆశలన్నీ పుట్టబోయే బిడ్డమీద పెట్టుకున్నాం. మా బిడ్డకు ఏమవుతుందా అని ఆందోళనపడుతున్నాం. 
సుబ్బు: సంతానం భార్యభర్తల తర్వాతే పంచమి. భార్యభర్తల బంధంలో పిల్లలు ఒక భాగం మాత్రమే. వస్తూ ఉంటారు. తోడు వెతుక్కూంటు పోతూ ఉంటారు. నువ్వు భర్త కోసం నాగలోకం వదులుకున్నావు. రేపు నీకు భర్త కావాలా బిడ్డ కావాలా అన్న పరిస్థితి వస్తే ఏం కోరుకుంటావు పంచమి. ఇదే పరిస్థితి మోక్షకు వస్తే బిడ్డను వదులుకొని నిన్నే కోరుకుంటాడు. 
పంచమి: మేం అలా చేయం సుబ్బు మేమిద్దరం మా బిడ్డమీద చాలా ఆశలు పెంచుకున్నాం.
సుబ్బు: నిజమే పంచమి. కానీ డాక్టర్ తల్లీ బిడ్డలో ఒకరే బతుకుతారు అంటే తెలివైన భర్త భార్యనే కోరుకుంటాడు. ఎందుకు అంటే వాళ్లిద్దరూ కలిస్తే పది మందికి ప్రాణాలు పోయగలరు. పంచమి ఆలోచనలో పడుతుంది.


మరోవైపు మోక్ష సైంటిస్ట్ దగ్గరకు వెళ్లి పంచమిలో పాము లక్షణాలు పోయాయి అని అయితే ముంగిసలు పంచమి మీద దాడి చేశాయని కాబట్టి తమకు పుట్టబోయే బిడ్డ మీద అనుమానంగా ఉందని చెప్తాడు. దీంతో డాక్టర్ ప్రతీ 15 రోజులకు స్కానింగ్ చేయిద్దామని ఒకవేళ పెద్ద ప్రాబ్లమ్ ఉంటే అబార్షన్ చేయిద్దామని అంటాడు. దీంతో మోక్ష భయపడిపోతాడు. 


మహారాణి: నాగేశ్వరి నన్ను అత్యవసరం అయితే తప్ప ఆవాహనం చేసుకోవద్దు. నా ఆత్మ శక్తి క్షీణించి గాలిలో కలుస్తుంది. నా కోరిక తీరగానే నా ఆత్మకు విముక్తి కలిగి పరమాత్మలో కలిసిపోతాను. లేకపోతే నేను ఇక్కడే తిరిగి ప్రేతాత్మల వలలో చిక్కుకుంటాను నాగేశ్వరి.  
నాగేశ్వరి: చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఆవాహనం చేసుకున్నా మహారాణి. మీ కూతురి గర్భంలో ఉన్న మిమల్ని విచ్ఛిన్నం చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాణి. 
మహారాణి: అలా జరగడానికి వీళ్లేదు నాగేశ్వరి. మా రాణి వంశం అంతరించిపోవడానికి వీళ్లేదు. నా కూతురు నాగలోకం వచ్చే అవకాశం లేదు. నా ఆంశతో మళ్లీ మా రాణి వంశం అంకురించి నాగలోకానికి రాణి లేని లోటు తీర్చుతూ ఉండాలి. లేదంటే మా వంశంతో పాటు నాగలోకమే అంతరిస్తుంది. 
నాగేశ్వరి: ఆ మాంత్రికురాలు కరాళి, మన నాగలోక యువరాజు ఫణేంద్ర కలిసి పంచమిని అంతం చేయాలి అని చూస్తున్నారు కాపాడటం నాకు శక్తికి మించిన భారం అవుతుంది మహారాణి. 
మహారాణి: నాగేశ్వరి ఇది నీకు అగ్నిపరీక్ష. నేను ఆత్మలా నా కూతుర్నికాపాడలేను. అవసరం అయితే నాగదేవతని ప్రసన్నం చేసుకో. నా కూతురు భూలోకంలో తన భర్తతో కలిసి సంతోషంగా ఉండేలా చూడు. అలాగే నాగలోకం కూడా క్షేమంగా ఉండాలి. నాగేశ్వరి నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఏదో ఒక జన్మలో నేను నా కూతురు నీ రుణం తీర్చుకుంటాం. వస్తాను.



కరాళి: ఫణేంద్ర పంచమి కోసం అన్ని శక్తులు పని చేస్తున్నాయి. రోజు రోజుకు తనదే పై చేయి అవుతుంది. 
ఫణేంద్ర: మనం ఓడిపోకూడదు కరాళి. పంచమి వెనుక ఎన్ని శక్తులు ఉన్నా నేను భయపడను. పంచమి నా కాలు మీద పడి వేడుకున్నా నేను వదిలిపెట్టను.
కరాళి: నేను చెప్పే మాట వింటే నువ్వు ఎక్కడ నీరుగారిపోతావా అని భయంగా ఉంది. ఇప్పుడే ఇక్కడికి నాగేశ్వరి వచ్చి వెళ్లింది. నాగేశ్వరిని నేరుగా ఎదుర్కొవడం కష్టం ఫణేంద్ర. దొంగచాటుగా హతమార్చాలి. నాగేశ్వరి వచ్చి చెప్పిన విషయం వింటే  నీ గుండె ఆగిపోతుంది. ఇప్పుడు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ మహారాణి విశాలాక్షి. అందుకే పంచమి జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఫణేంద్ర: అర్థమైంది కరాళి. అందుకే నాగేశ్వరి పంచమికి రక్షణగా ఉంది.
కరాళి: పంచమి బిడ్డ నాగలోక యువరాణి అయితే నేను ఇక ఎప్పటికీ నాగమణి సంపాదించలేను ఫణేంద్ర. ఏదైనా ఇప్పుడే జరిగిపోవాలి. ప్రస్తుతం రాణిగా ఎవరూ లేరు కాబట్టి నువ్వు నాకు సాయం చేస్తే చాలు. కానీ మనం చేయాలి అనుకున్నవి పంచమికి బిడ్డ పుట్టకముందే జరిగిపోవాలి.
ఫణేంద్ర: అన్ని రోజులు అవసరం లేదు కరాళి. పంచమిని పెళ్లి చేసుకొని యువరాజుగా నాగలోకాన్ని ఏలాలి అని కలలు కన్నాను. కానీ ఇప్పుడు పంచమి బిడ్డ రాణి అయితే నేను తన దగ్గర పని చేయాలి అలా జరగనివ్వను. ఈ రోజు నేనో నాగేశ్వరో ఎవరో ఒకరే బతికుండాలి. 
కరాళి: కావాలి అంటే నేను వస్తా.
ఫణేంద్ర: వద్దు నేను ఎలా అయినా నాగేశ్వరిని చంపేవస్తా.. నువ్వు పంచమి బిడ్డని చంపేయ్.. వస్తా కరాళి నేను తిరిగి వస్తే నా చేతిలో నాగేశ్వరి చనిపోయినట్లు.. రాకపోతే నాగేశ్వరి చేతిలో నేను చనిపోయినట్లే..


పంచమిని బయటకు తీసుకెళ్లినందుకు వైదేహి మోక్షని తిడుతుంది. జ్వాల, చిత్రలు సెటైర్లు వేస్తారు. శాంతమ్మ తోడుకోడళ్లను తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ ఏప్రిల్ 3rd: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని క్లారిటీ ఇచ్చిన విశాలాక్షి.. కనిపెట్టలేకపోయారే!