Satyabhama Today Episode సత్య, రేణుక ఇద్దరూ కలిసి కిచెన్‌లో వంట చేస్తూ అంటారు. ఇంతలో పనిమనిషి పంకజం వచ్చి ఏ ఇంట్లో అయినా తోడికోడళ్లు అంటే కొట్టుకుంటారు. మీరు ఏంటి అమ్మ పాలు నీళ్లలా కలిసిపోయారు అని అంటుంది. దీంతో రేణుక ఏం మేం ఇలా ఉండటం నీకు నచ్చలేదా అని అడుగుతుంది. ఇక సత్య పుల్లలు పెట్టాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఇక రేణుక ట్యాబ్లెట్ వేసుకోవడానికి వెళ్తుంది.


పంకజం: అమ్మా నేను ఒక మాట చెప్తాను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి అమ్మ. పెద్దమ్మ గారికి హడావుడే తప్ప పని చేయడం చేత కాదు. మీరు వచ్చిన తర్వాతే ఇలా వంట గదిలోకి వచ్చారు. అయినా మూడు నిద్రలు కాకుండా ఇలా వంట గదిలోకి రావడం ఏంటమ్మా అవసరమా. అవునే మర్చిపోయాను మీకు మామూలు నిద్రలే కానీ మూడు నిద్రలు అలా లేవు కదా.. ఇంతలో క్రిష్ వస్తాడు. 


క్రిష్ నీరు తాగుతాడు. ఇంతలో సత్య కూరగాయలు కట్ చేస్తుండగా వేలు కట్ అవుతుంది. వెంటనే క్రిష్ సత్య అంటూ వెళ్లి వేలు నోటిలో పెట్టుకుంటాడు. చుట్టూ అందరూ ఉండడంతో సత్య ఏం అనలేకపోతుంది. ఇక పంకజం వేలు తెగితే తెగింది కానీ చిన్నబాబుకి మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటుంది. ఇంతలో భైరవి వచ్చి ఏమైందని అడుగుతుంది. క్రిష్ చెప్తాడు. భైరవి క్రిష్‌ని వెళ్లిపోమని అంటుంది. ఇక భైరవి తెగింది వేలే కదా పీక తెగినట్లు అలా అరిచావు ఏంటని సత్యని అంటుంది. పసుపు వేసుకొని తాడు కట్టుకోమని అంటుంది. ఇక రేణుక బ్యాండేజ్ తెస్తా అని వెళ్తుంది. ఇక సత్య గదిలోకి వెళ్లిపోతుంది. క్రిష్ వస్తాడు.


క్రిష్: అంటే అది రక్తం కదా చూడలేకపోయా.. ప్రేమ అలాంటిది. ఏం చేయాలి. వీక్ నెస్ అందుకే ఇట్లా.. ఏమైంది వేలికి చూడనీ.. 


సత్య: ఆపుతావా నీ నాటకాలు.. నువ్వుంటే ఇష్టం లేదు అని చెప్పాను. ముట్టుకోవద్దు అన్నాను. అన్నానా లేదా..


క్రిష్: ఆ ముట్టుకోవడం వేరు ఈ ముట్టుకోవడం వేరు.


సత్య: నాకు అన్నీ ఒక్కటే. 


క్రిష్: అది నీ ప్రాబ్లమ్ దానికి నన్నేం చేయమంటావ్..


సత్య: నాకు దూరంగా ఉండమని చెప్పాను.


క్రిష్: ఈ దూరం సరిపోదా.. అయినా అలా మనసు రాయి చేసుకొని మాట్లాడకు. నా కళ్లలోకి చూసి మాట్లాడు. నా మనసు అర్థం చేసుకొని మాట్లాడు.  అయినా ప్రేమంటే ఏంటో తెలిస్తే అర్థమవుతుంది లేదంటే ఇంతే.. అసలు ఎందుకు పొడుచుకుతింటున్నావ్..వేలు తెగింది అని అడగడానికి వచ్చా..


సత్య: అయినా నువ్వు నా జోలికి ఎందుకు వస్తున్నావ్. పీకలు కోసేవారికి వేలు తెగితే ఒక లెక్క పసుపు రాసి కట్టుకట్టుకుంటే పోయేదానికి ఇంతలా రాద్దాంతం చేయాలా. మనసులో ఏదో పెట్టుకొనే ఇలా చేశావు.


క్రిష్: అదే నిజం అయితే నోటిలో వేలు పెట్టుకోవడం కాదు డైరెక్ట్‌గా లిప్‌లాక్ పెట్టుకునే వాడిని. ఎవరేం చేస్తారు. ఎవరు అడ్డుపడతారు.


సత్య: చూశావా ఒరిజినాలిటీ బయటపడింది. క్రిష్ అంటే ఇదే..


క్రిష్: అవును అయితే ఏంటి.. హా.. ఎంత ఓపికతో మాట్లాడుదాం అన్నా సతాయించుకుతింటావ్ ఏంటి వేలికేస్తే కాలికేస్తావ్. కాలికేస్తే వేలికేస్తావ్. దిమాక్ మొత్తం కరాబ్ చేస్తున్నావ్. గొప్పపెళ్లాన్ని ఇచ్చావ్ దేవుడా గ్రేట్. దండాలమ్మా..అని వెళ్లిపోతాడు. 


నందిని పాప్ కార్న్ తినుకుంటూ కాలిమీద కాలువేసుకొని సీరియల్ చూస్తూ ఉంటుంది. ఆ టీవీ సౌండ్‌కి అందరూ ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక శాంతమ్మ అయితే దీంతో వేగలేకపోతున్నా అని తిట్టుకుంటుంది. ఇక శాంతమ్మ కావాలనే టేప్ రికార్డ్‌లో ఎక్కువ సౌండ్ పెడుతుంది. నందిని కూడా టీవీ సౌండ్ పెడుతుంది. దీంతో శాంతమ్మ నందిని జగమొండి అని అనుకుంటుంది. ఇంతలో విశ్వనాథం ఇంటికి వస్తాడు. నందిని పట్టించుకోకుండా అలాగే ఉంటుంది. విశాలాక్షి చెప్పినా వినదు. ఇక హర్ష చూసి కోపంతో నందిని చేతిలోని పాప్‌కార్న్ నేలకేసి కొడతాడు. నందిని చేతిలో రిమోట్ లాక్కొని టీవీ ఆపేస్తాడు. 


హర్ష: నీకు అసలు మ్యానర్స్ ఉందా.. అవతల మా నాన్న వచ్చారు. లేవాలి అని తెలీదా.. సిగ్గులేకుండా కాలు ఊపుకుంటూ టీవీ చూస్తున్నావ్.


నందిని: ఎందుకు లేవాలి. అక్కడ చాలా చైర్లు ఖాళీ ఉన్నాయి. అయిన నేను కూర్చొనే ప్లేస్‌లోనే కూర్చొవాలా.. 


హర్ష: అసలేం మాట్లాడుతున్నావ్. 


నందిని: మా నాన్న ముందు కూడా ఇలాగే ఉండేదాన్ని అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది. 


హర్ష: నీకు సంస్కారమే కాదు బుద్ధి కూడా లేదు. అసలు నిన్ను కాదు నిన్ను కన్నవాళ్లని అనాలి. గాలికి పెంచారు గారాభం చేశారు. 


నందిని: మా పెద్దొళ్లని ఒక్కమాట అన్నా మర్యాదగా ఉండదు.


హర్ష: మరి నువ్వు మా పెద్దొళ్లకి మర్యాద ఇస్తున్నావా అది చూడు ముందు..


నందిని ఏడుస్తూ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీరందరూ నన్ను ఏదో ఒకటి అని ఏడిపిస్తున్నారు అంటుంది. ఇక అందరూ ఇంటి కోడలు ఏడ్వడం మంచిది కాదు అని హర్షని కంట్రోల్ చేస్తారు. తన జీవితం నాశనం అయిందని నందిని ఏడుస్తూ వెళ్లిపోతుంది. 


మరోవైపు క్రిష్ బాబీ వాళ్ల దగ్గరకు వెళ్లి తాగుతాడు. బాబీ వాళ్లు క్రిష్, సత్యల గొడవలు తెలీక వదిన పెగ్ కలిపి ఇస్తుంటే నువ్వు తాగితే మజా అంటాడు. ఇక క్రిష్ వాళ్ల మాటలకు ఏడుస్తాడు. దీంతో బాబీ నిన్ను ఏడిపించిన ఆ సాలే గాడు ఎవరు చెప్పన్న వాడి అంతు చూస్తా అంటే మీ వదిన అని క్రిష్ అంటాడు. దీంతో బాబీ షాక్ అవుతాడు. క్రిష్ బాబీతో మీ వదిన నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదంట. నా మీద ద్వేషంతో చేసుకుంది అంట అని అంటాడు. సత్యకు ఎలా నచ్చచెప్పాలో తెలీడం లేదు అని అంటాడు. ఇక బాబీ కొత్తగా మాట్లాడుతూ మొగుడిదే పైచేయి అని ఏవేవో చెప్పి క్రిష్‌ని రెచ్చగొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


 Also Read: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 3rd: దీపకు సవతి పోరు మొదలైనట్లేనా, రెండో పెళ్లి చేసుకున్న నరసింహ.. సుమిత్రను చంపేస్తానన్న పారు!