Krishna Mukunda Murari Today Episode చుట్టాలు చుట్టాలు అని కృష్ణ రజిని, సంగీతలకు కాఫీ ఇస్తుంది. ఇక రజిని కృష్ణ అంతు చూస్తానని అంటుంది. సంగీత కాఫీ తాగుతూ ఉంటే తనని ఆపి ఆదర్శ్‌కి ఇవ్వమని చెప్తుంది. ఆదర్శ్‌కి కాఫీ ఇచ్చి మచ్చిక చేసుకుంటే ఆస్తి వస్తుందని చెప్తుంది. సంగీత వెళ్తుండగా అక్కడికి మీరా వస్తుంది. మీరాని చూసి తల్లీ కూతుళ్లు షాక్ అవుతారు. 


మీరా: అయితే మీరు ఆదర్శ్‌ని లైన్‌లో పెట్టాలి అని వచ్చారన్నమాట.
రజిని: అయితే ఇప్పుడేంటి చెప్తేస్తావా..
మీరా: మనసులో నేను ఎందుకు చెప్తాను. ఈ సంగీత ఆదర్శ్‌కి కనెక్ట్ అయితే రేపు ఎప్పుడైనా నేనే ముకుంద అని తెలిసినా నాకు మళ్లీ ఆదర్శ్‌ వల్ల ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది.
రజిని: చెప్పు చెప్తేస్తావా.. చూడు నా కూతురు ఆదర్శ్‌కి మరదలు.. ముందే వీళ్లకి పెళ్లి అవ్వాల్సింది. ఇప్పుడు వాడి పెళ్లాం పోయింది. నా కూతురు పెళ్లాం అవుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు.
మీరా: అయ్యో నేను అస్సలు ఆపాలి అనుకోవడం లేదండి. మీకే ఇంకా హల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఆదర్శ్‌ నా ఫ్రెండ్ భర్త కదా భార్య పోయిన బాధలో ఉన్నాడు. నిజంగా మీ సంగీత దగ్గర అయితే ముకుందని మర్చిపోయి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీయే కదా. అందుకే మీకు ఏ సాయం కావాలి అన్నా నన్ను అడగండి.
సంగీత: అమ్మా మీరా మంచిది కదా మనకు సాయం చేస్తా అంటుంది. 


సంగీత అందంగా రెడీ అయి కాఫీ తీసుకొని ఆదర్శ్‌ గదికి వెళ్లి నిద్రలేపుతుంది. ఆదర్శ్‌ సంగీతని తన గదికి రావొద్దని చిరాకు పడతాడు. సంగీతని తిట్టి పంపేస్తాడు. సంగీత బాధగా వస్తే మధు చూసి అడుగుతాడు. ఇక సంగీత మధుకి ఆ కాఫీ ఇచ్చేస్తుంది. ఇక సంగీత తన తల్లికి జరిగింది చెప్తుంది. దీంతో రజిని కూతురుకి క్లాస్ ఇస్తుంది. అల్లుకుపోవాలని సలహా ఇస్తుంది. 


మరోవైపు మీరా తన తండ్రికి కాల్ చేసి ఇళ్లు అమ్మడం గురించి అడుగుతుంది. ఇక కృష్ణ మీరా ఫోన్ మాట్లాడుతున్న దగ్గరే పువ్వులు కోస్తుంటుంది. మీరా శ్రీనివాస్‌ను నాన్న అని పిలవడం కృష్ణ వింటుంది. ఎవరూ లేని అనాథ అన్న మీరా నాన్న అంటుందేంటి అని అనామానంతో మీరా దగ్గరకు వస్తుంది. మీరా కూడా కృష్ణని చూసి వినేసిందా ఏంటని టెన్షన్ పడుతుంది.


కృష్ణ: మీరా ఎవరితో మాట్లాడుతున్నావ్.
మీరా: అది ఇంతకు ముందు ఉండేదాన్ని కదా ఆ ఇంటి ఓనర్‌తో మాట్లాడుతున్నా.
కృష్ణ: మరి నాన్న అంటున్నావ్. 
మీరా: ఈ ఒక్కమాటే దీని చెవిలో పడాలా.. అది మా ఓనర్‌ని నేను నాన్న అంటాను. ఇన్నాళ్లు నేను ఆ ఇంటిలో ఉండేదాన్ని కదా ఇప్పుడు లేను అని ఆ ఇళ్లు మరొకరికి అద్దెకు ఇవ్వడం ఇష్టం లేక అమ్మేస్తా అంటున్నారు. వద్దు అని చెప్తున్నా. (డౌట్‌గా చూస్తున్నావ్ ఏంటి..) ఎవరూ లేని అనాథని కదా ఎవరు ఆప్యాయంగా పలకరిస్తే వాళ్లే నాకు అమ్మానాన్న.( హమ్మయ్యా మొత్తం వినలేదు బుక్ అయిపోయేదాన్ని)


ఆదర్శ్ ఫోన్‌లు మాట్లాడుతుంటే సంగీత అక్కడికి వస్తుంది. తన దగ్గరకు ఎందుకు వచ్చావ్ అని సంగీతని అడుగుతాడు. దీంతో సంగీత ఐస్‌క్రీం కావాలని అడుగుతుంది. దీంతో ఆదర్శ్‌ నిన్నూ అంటూ భయపెట్టి సంగీత పారిపోయేలా చేస్తాడు. ఇక సంగీత తనని టార్చర్ పెట్టేస్తుంది అని ఏదో ఒకటి చేసి మళ్లీ నా దగ్గరకు రాకుండా చేయాలి అనుకుంటాడు. 


సంగీత: ఈ పెద్ద బావకు అసలు మనసే లేదు. ఐస్‌ క్రీం అడిగితే కర్రతో కొడతా అన్నాడు. ఇదే అమ్మకు చెప్తే ఇంకొ కర్రతో కొడుతుంది. ఇంతలో మధు సంగీతని చూసి ఫుల్ జోష్ మీద అక్కడికి వచ్చి హాయ్ చెప్తాడు. దీంతో సంగీత ఏంటి చిన్న బావ పెద్దబావ ఏమో అరిచి భయపెడతాడు. నువ్వేమో పిలిచి భయపెడతావు. 
మధు: నీ కోసం ఏం తెచ్చానో చూడు అని ఐస్‌క్రీం ఇస్తాడు. ఇందాక నువ్వు మీ అమ్మతో చెప్పడం విన్నా అందుకే తీసుకొచ్చా తీసుకో. 
సంగీత: అమ్మ పెద్ద బావని అడగమంది. చిన్న బావ ఇచ్చాడు అని చెప్తే ఏమంటుందో. చిన్న బావ దగ్గర తీసుకొని పెద్ద బావ ఇచ్చాడు అని చెప్పేస్తా.. మధు మెలికలు తిరిగిపోతాడు. 


కృష్ణ తన అనుమానం చెప్పాలి అని మురారితో చెప్పాలని ఏసీపీ సార్ అని పిలిస్తే చెప్పు గయ్యాలి అని మురారి అంటుంది. దీంతో కృష్ణ మురారికి సారీ చెప్పమని అంటుంది. మురారి చెప్తాడు. ఇక మీరా ఓనర్‌ని నాన్న అని పిలుస్తుంది అని మురారితో చెప్పి బాధ పడుతుంది. తనని మన సొంత మనిషిలా చూసుకోవాలి అని అంటుంది. మురారి సరే అంటాడు. ఇక ఫోన్ కొని ఇద్దామని కృష్ణ అంటుంది. మురారి సరే అంటాడు. మరోవైపు ముకుంద పిండ ప్రదానం చేయడానికి పంతులుతో మాట్లాడాను అని రేపు ఆ కార్యక్రమం చేయాలి అని రేవతి భవానితో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: 20 ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన సుమతి.. ఇక మహా ఆట అయిపోయినట్లేనా!