Seethe Ramudi Katnam Today Episode: మధుమిత బయటకు వెళ్తే తన తండ్రితో కలిసి పనిచేసే ఓ పోలీస్ అధికారి అతని భార్య కనిపిస్తారు. పోలీస్ భార్య మధు గురించి ఊరిలో అందరూ తప్పుగా అనుకుంటున్నారు చెప్తుంది. సూర్య జైలుకి వెళ్లగానే డబ్బున్న రామ్‌ మీద మనసు పడ్డ మధు రామ్ ఇంటికి చేరిందని అందరూ అనుకుంటున్నారు అని చెప్తుంది. రామ్‌కి మధుమితకు మధ్య ఏదో సంబంధం ఉందని అంటున్నారని అంటుంది. ఆవిడ మాటలకు మధు చాలా ఫీలవుతుంది. ఇక పోలీస్ అధికారి తన భార్య నోరు మూయిస్తాడు. శివకృష్ణ జైలులో సూర్యతో మాట్లాడాడు అని మధుతో చెప్తాడు. ఇక సూర్యతో మధుమితని మాట్లాడిస్తా అని చెప్పి మరో పోలీస్‌కు కాల్ చేసి సూర్యకి ఇమ్మని చెప్తాడు. 


సూర్య: నాతో నీకేం పని ఎందుకు కాల్ చేశావ్. అయినా నేను ఎలా ఉంటే నీకు ఎందుకు నువ్వు హాయిగా ఉన్నావు కదా. 
మధు: లేదు సూర్య నేను నరకం అనుభవిస్తున్నాను. నా బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు.
సూర్య: నేను అరెస్ట్ అవ్వగానే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నావు. 
మధు: నవ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు సూర్య. నీ కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. 
సూర్య: ఏంటి ఆ ప్రయత్నాలు ఖరీదైన కార్లలో తిరగడమా.. కాస్లీ చీరలు కట్టుకోవడమా.. ఏసీ గదుల్లో ఉండటమా.. డైనింగ్ టేబుల్ మీద పంచపక్షపరమాన్నాలు తినడమా.. ఆ రామ్‌తో చట్టా పట్టాలు వేసుకొని తిరగడమా.. నువ్వు అక్కడ వేసే వేషాలు నాకు తెలుసు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక చెప్తా మీ సంగతి. నన్నే మోసం చేస్తారా..


మరోవైపు మధుమిత ఇంకా ఇంటికి రాలేదు అని సీత టెన్షన్‌గా ఎదురు చూస్తుంది. ఇంతలో మధుమిత రావడంతో ఎందుకు లేటు అయిందని సీత అడుగుతుంది. సీత చాలా ప్రశ్నలు అడుగుతుంది. దానికి మధు ఇక్కడ ఉండలేకపోతున్నాను. మన ఊరు వెళ్లలేకపోతున్నాను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి బాధ పడుతుంది.


మధు: నువ్వు నన్ను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నావు. బయటకు వెళ్తుంటే ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అని తెలిసినవాళ్లు అడుగుతున్నారు. నేను ఎంత బాధ పడుతున్నానో ఎవరికీ తెలీదు. నా ఆవేదన అర్థం కాదు. ఇది నరకం కాకపోతే ఇంకేంటి.
సీత: ఈ నరకాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు అక్క. పెళ్లి అయిన ఆడపిల్ల ఉంటే అత్తారింట్లో ఉండాలి. లేదంటే పుట్టింట్లో ఉండాలి. కానీ ఇలా చెల్లెలి అత్తారింట్లో ఉంటే అందరూ ఇలానే అనుకుంటారు. 
మధు: అంటే నేను కావాలని ఇక్కడ ఉంటున్నానా.. సూర్య కోసం ఉంటున్నాను కదా.. సూర్యని విడిపిస్తారు అంటే కదా ఉంటున్నాను.
సీత: నువ్వు ఇక్కడ ఉంటే సూర్య బావ వచ్చేస్తాడా.. నిన్ను ఇక్కడికి రావొద్దు అని నేను ముందే చెప్పాను అయినా వచ్చావు. అమ్మానాన్నలు పిలిచినా వెళ్లలేదు. నీ ప్రవర్తన వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో నీకు అర్థమవడం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అక్క. నువ్వు ఇక్కడుంటే మాత్రం నీకు ఈ అవమానాలు తప్పవు.
మధు: పర్వాలేదు ఎన్ని అవమానాలు అయినా పడతాను. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను. నేను మహాలక్ష్మి గారి మాట తప్ప ఇంకెవరి మాట వినను. ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాను.


తన అక్క గురించి సీత ఆలోచిస్తూ ఉండగా రామ్ సీతని హగ్ చేసుకుంటాడు. దీంతో సీత రామ్ మీద చిరాకు పడుతుంది. దీంతో రామ్ పిన్ని లేదు కదా మనం హ్యాపీగా నచ్చినట్లు ఉండొచ్చని అంటాడు. మీ పిన్నిని తలచుకోవడమే పాపం అంటూ సీత చిరాకు పడుతుంది. మహాలక్ష్మిని పీక పిసికి చంపేయాలి అని సీత అంటుంది. దీంతో రామ్ కూడా సీతతో గొడవ పడతాడు. తన అక్క ఈ ఇంట్లో ఉండటం మంచిది కాదని సీత అంటుంది. తన భర్తని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది సీత. తన పిన్ని మధుకి న్యాయం చేస్తుంది అని అంటాడు. 


 మరోవైపు సుమతికి వైద్యం చేస్తుంటారు. సుమతిలో చలనం వస్తుంది. కళ్లు తెరచి చూస్తుంది. సుమతి తాను ఎక్కడున్నానని.. మీరు అంతా ఎవరు అని అడుగుతుంది. ఇరవై ఏళ్ల క్రితం ప్రమాదం జరిగి నువ్వు ఇక్కడికి వచ్చావని ఈరోజే కళ్లు తెరచావని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. సుమతికి తన గతం గురించి అడుగుతారు. సుమతి సమాధానం చెప్పలేక మళ్లీ పడుకుండిపోతుంది.


ఇక మధుమిత అందరూ తనను అన్న మాటలు తలచు కొని బాధ పడుతుంది. తన బతుకు ఒక బతుకేనా తాను బతికి ఉండటం ఎవరికీ అవసరం లేదని చనిపోయినా ఎవరూ పట్టించుకోరని అనుకుంటుంది. ఇక సీత, రామ్‌లు గుడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: యాక్టర్ విశ్వేశ్వర రావు: టాలీవుడ్‌లో మరో విషాదం - ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత