Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode తన భర్త నరసింహ కోసం దీప సౌర్యని తీసుకొని హైదరాబాద్‌ వస్తుంది. తన భర్త డ్రైవర్‌ కావడంతో డ్రైవర్లకు దీప తన భర్త గురించి అడుగుతుంది. దీంతో ఓ డ్రైవర్ తన యూనియన్‌లో అడిగి తెలుసుకుంటానని ఫోన్ చేస్తాడు. ఇక మణికొండలో ఒకరు, జూబ్లీహిల్స్‌లో ఒకరు నరసింహా అనే పేరుతో ఉన్నారని దీపకు చెప్పడంతో దీప పరుగులు తీస్తుంది.


మరోవైపు జ్యోత్స్నకి తన తల్లి తినిపిస్తుంది. ఇక పారిజాతం అక్కడికి వస్తుంది. సుమిత్ర జ్యోత్స్నపై తన నీడ కూడా పడకుండా చేస్తుంది అని రగిలిపోతుంది. జ్యోత్స్న తన కన్న కొడుకు దాసు కూతురని మురిసిపోతుంది. త్వరలోనే సుమత్రి అడ్డు తొలగించుకుంటాను అని అనుకుంటుంది. మరోవైపు దీప ఆటోలో తిరుగుతూ భర్త కోసం వెతుకుతుంది. 


ఇక సుమిత్ర తన భర్తతో మొక్కు ఉందని గుడిలో 101 కొబ్బరి కాయలు కొట్లాలి అని రమ్మంటుంది. దాంతో దశరథ రాను అనేస్తాడు. పారిజాతం వస్తాను అంటే సుమిత్ర వద్దు అనేస్తుంది. దీంతో రగిలిపోయిన పారిజాతం ఈ ఇంటి లెక్కల్లో నువ్వు లేకుండా చేస్తా అని అనుకుంటుంది. దీప ఇంటింటికి తిరుగుతూ భర్త కోసం జాలిస్తుంది. ఇక ఒకరి ఇంటికి వెళ్తుంది ఆయనని చూసి అతను తన భర్త కాదు అని అనుకుంటుంది. దీపతో పాటు సౌర్య కూడా బాధ పడుతుంది. 


దీప తన భర్త కోసం మరో చోట అందర్ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో సౌర్య గులాబి పువ్వులను చూసి అక్కడికి వెళ్తుంది. తన తల్లికి ఇస్తానని పూలు కోస్తుంది. ఇంతలో శోభ అనే ఇంటి ఆమె వచ్చి సౌర్య మీద అరుస్తుంది. కర్రతో కొట్టడానికి వస్తే సౌర్య తల్లి దగ్గరకు పరుగులు తీస్తుంది. దీప ఆమె దగ్గరకు గులాబీలు పట్టుకొని వెళ్తుంది. సౌర్యను రమ్మంటే భయపడి దూరంగా నిల్చొంటుంది. దీంతో ఆమె దీపని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఇంతలో శోభ ఏంటే ఆ గొడవ అని నరసింహా వాయిస్ వినపడంతో దీప సంతోషంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా నరసింహా..


దీప: ఎన్నాళ్లు అవుతుంది అయ్యా నిన్ను చూసి..
శోభ: ఎన్నాళ్లు అవుతుందా..
నరసింహ: నువ్వు ముందు లోపలికి రా చెప్తాను. 
దీప: నిన్ను వెతుక్కుంటూ నేను వస్తే పలకరించకుండా వెళ్లిపోతున్నావ్ ఏంటి అయ్యా.
సౌర్య: అమ్మ ఎందుకు వాళ్లతో లోపలికి వెళ్తుంది.
శోభ: అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లాక్కెల్తావే.
దీప: నా ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయే అంత తప్పు నేనేం చేశానయ్యా.
శోభ: ఏయ్ నిన్ను పట్టుకొని నిలదీస్తుంది. అసలు ఎవరు ఇది.
దీప: నేను నరసింహ భార్యని. నువ్వు ఎవరు.
శోభ: ఏంటి నువ్వు నరసింహ భార్యవా మరి నేను ఎవర్ని.
దీప: అదే నేను అడుగుతున్నాను.
శోభ: ఏయ్ అడుగుతుంది కదా సమాధానం చెప్పు. నేను నువ్వు తాళి కట్టిన పెళ్లం అని చెప్పు.
దీప: ఏంటయ్యా ఇది. ఈవిడ చెప్తున్నది నిజమేనా..
శోభ: అడుగుతుంటే మాట్లాడవేంటిరా.. నీకు ముందే పెళ్లి అయిందా.. ఆ బయట ఉన్న పిల్ల నీకు కూతురేనా. 
నరసింహ: ఏంటే గట్టిగా అరుస్తున్నావ్ ముందు నువ్వు లోపలికి రా.. 
శోభ: ఏంట్రా లోపలికి పోయేది ముందు ఈ సంగతి తేల్చు.
నరసింహ: ఏయ్ నీకు బుర్ర పోయిందా మనం మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి రా అని తన భార్యను లోపలి పెట్టి గడియ పెడుతుంది. శోభ కిటికీ నుంచి మాటలు వింటుంది. 
దీప: ఇన్నాళ్లు నువ్వు ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు ఏం తక్కువ చేశానని నన్ను వదిలేసి ఇంకోదాన్నికట్టుకున్నావ్. నువ్వు ఏ రోజు ఒక్క రూపాయి కూడా సంపాదించకపోయినా నేను ఏం అనలేదు. నా మొగుడే కదా అర్థం చేసుకుంటావని ఓపికపట్టాను. బిడ్డ పుట్టాకైనా మారుతావు అనుకున్నాను. చేతికి దొరికిన కాడికి ఊరంతా అప్పులు చేసి పారిపోయావ్. ఈ రోజు వస్తావ్ రేపు వస్తావ్ అని ఆరేళ్లగా ఎదురుచూస్తున్నా. నేను వచ్చాను కానీ నువ్వు రాలేదు. ఆ మల్లేశ్ అప్పు తీర్చకపోతే ఇళ్లు జప్తు చేస్తా అంటే కూతుర్ని తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంకో పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకున్నావ్. నా బిడ్డకు, నాకు ఎందుకు అన్యాయం చేశావ్. చెప్పయ్యా..
నరసింహ: ఆపవే నీ వెధవ సోది. నీకు నేను ఏం అన్యాయం చేశాను. మా అమ్మ టార్చర్ భరించలేక నేను నీకు తాళి కట్టాను. పెళ్లి అయి నెల తప్పుతున్నా కోడలు నెల తప్పలేదు అంటే నీకు బిడ్డను ఇచ్చాను. ఆ దిక్కుమాలిన ఊరిలో ప్రతీ దానికి మీ దగ్గర చేయి చాచడం ఇష్టం లేక నా దారి నేను చూసుకున్నాను. ఆ అప్పులతో నీకు సంబంధం లేదు అని చెప్పు.
దీప: నీ పెళ్లాన్ని కాబట్టి నాకు సంబంధం ఉంది అయ్యా.
నరసింహ:  అయితే నువ్వే తీర్చుకో. 
దీప: ఎవరు తీర్చుకుంటారు అనే సంగతి తర్వాత. ముందు ఊరు వెళ్దాం పద. 
నరసింహ: నేను అక్కడికి రాను.
దీప: మరి నా పరిస్థితి నా బిడ్డ పరిస్థితి ఏంటి.
నరసింహ: నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్లిపో. అప్పులోల మీద కేసు పెట్టు. నేను అప్పుడప్పుడు వస్తాను. నాకు నీ మీద మోజు పుడితే రాత్రి వచ్చి వెళ్తా.
దీప: పగలు వచ్చే వాడిని మొగుడు అంటారు. రాత్రి వచ్చే వాడిని ఏమంటారో తెలుసా..
నరసింహ: పోనీ నేను వాడినే అనుకో..
దీప: మరి అప్పుడు నన్ను ఏమంటారో తెలుసా.
నరసింహ: నువ్వు అదే అనుకో.
దీప: ఈ మాట తాళి కట్టిన భర్త అన్నాడు కాబట్టి వదిలేశా అదే ఇంకొడు అయితే చెప్పుతో కొట్టి మాట్లాడేదాన్ని. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్ ఏప్రిల్ 3rd: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని క్లారిటీ ఇచ్చిన విశాలాక్షి.. కనిపెట్టలేకపోయారే!