Trinayani Telugu Serial Today Episode విశాలాక్షి దంచుతున్న బియ్యం పిండి పాలు ఎవరి మీద పడతాయా అని అందరూ కంగారు పడతారు. ఇక హాసిని ఆ పాలు తన మీద అయినా, పావానామూర్తి, విశాల్ ముగ్గురిలో ఒకరి మీద పడతాయని టెన్షన్ పడుతుంది. పావనామూర్తి, విశాల్ కూడా కంగారు పడతారు. ఇక విశాలాక్షి దంచిన ఆ బియ్యం పిండి పాలు గాయత్రీ పాప మీద పడతాయి. అందరూ షాక్ అయిపోతారు.
ఎద్దులయ్య: అర్థమవుతుందా పుత్ర.
వల్లభ: పెద్దమ్మ గురించి ఈ గాయత్రీ పాపకు తెలుసు అని అర్థమా..
విశాలాక్షి: అవును.. గాయత్రీకే అంతా తెలుసు.
విశాల్: మనసులో.. అమ్మకి అమ్మ గురించి తెలియకపోవడం ఏంటి. తెలిసినా నోటి నుంచి మాట రాదు కదా..
హాసిని: వెరీ గుడ్ అడగండి పాపని పాప చెప్తుంది.
దురంధర: జోకులేయ్యకే.. అమ్మా పాలు ఇవ్వు అని నోరు తెరిచి అడగలేని చిన్న పిల్లకి ఏం తెలుస్తుంది.
నయని: గాయత్రీ పాపకి గాయత్రీ దేవి గురించి తెలిసే ఉంటుంది అంటే దీని వెనక ఆలోచించాల్సిన విషయం ఏదో ఉండే ఉంటుంది పిన్ని.
సుమన: పాల రవ్వలు ఈ పిల్ల మీద ఎందుకు పడాలి? వేరే ఎవరితో మీద అయినా పడొచ్చు కదా.
విశాలాక్షి: దగ్గరే ఉన్న ఎద్దులయ్య మీద పడలేదు.. అమ్మ మీద పడలేదు.. నా మీద ఒక చుక్క కూడా పడలేదు.. సరాసరి పాప మీద పడ్డాయి అంటే అర్థమేంటి..
వల్లభ: అంటే గాయత్రి పెద్దమ్మ నీడ జాడ అన్నీ ఈ పిల్లకే తెలుసని అంటావా గారడీ పిల్ల.
విశాలాక్షి: అందులో సందేహమే లేదు.
వల్లభ: వెరీ ఇంట్రెస్టింగ్ బుజ్జి పిల్లకు తెలుసు గాని మాట్లాడ లేదే.
సుమన: వీళ్లు ఏదో కాకమ్మ కథలు చెప్తుంటే మీరు వింటారు ఏంటి బావగారు వాళ్లకి ఎలా తెలుస్తుంది.
విక్రాంత్: ఏయ్ లేదు లేదు ఇందులో ఏదో లాజిక్ ఉండే ఉంటుంది.
ఎద్దులయ్య: వీళ్లింకా నమ్మడం లేదమ్మా.
విశాలాక్షి: నిరూపించాలా..
విశాల్: వద్దు.. పాప వైపు అందరూ కల్లార్పకుండా చూస్తే దిష్టి తగిలేలా ఉంది.
విశాలాక్షి: దిష్టి కూడా పోతుంది నాన్న. సుమన నీ చేతిలో ఉన్న బియ్యం ముద్దను కూడా వదిలేయ్.. అది నేరుగా గాయత్రి పాప దగ్గరకే వెళుతుంది.
సుమన: నేను పెద్ద బావగారి వైపే మల్లిస్తాను అప్పుడు కూడా అది గాయత్రి పాప వైపే వెళితే నువ్వు చెప్పింది నిజమని నమ్మొచ్చు. సుమన బియ్యం ముద్దను వల్లభవైపు విడిచి పెట్టినప్పటికీ అది గాయత్రి పాప వైపే వెళుతుంది దీంతో అందరూ షాక్ అవుతారు.
మరోవైపు విశాల్ హాసిని మాట్లాడుకుంటారు. హాసిని కంగారుగా విశాల్ తో ఈ టెన్షన్ నేను భరించలేను. గాయత్రి పాపే గాయత్రీ దేవి అని అందరికీ చెప్పేస్తానని అంటుంది. దానికి విశాల్ వదిన అంత పని చేయొద్దు అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. గాయత్రీ అమ్మగారి గురించి మాట్లాడాలి అంటుంది.
నయని: గాయత్రీ అమ్మగారి జాడ తెలుస్తుంది అని విశాలాక్షి చెప్పినట్లు చేశాం కానీ మనకు తెలియాల్సింది గాయత్రీ పాప గురించి అని అనిపిస్తుంది బాబుగారు.
హాసిని: తనలో తాను కరెక్ట్‌గా అడిగినప్పుడు సమాధానం దాచడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది.
విశాల్: నయని గాయత్రీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది.
నయని: గాయత్రీ అమ్మగారి గురించి అందరి కంటే విశాల్ బాబుగారికి ఎక్కువ తెలిసుండాలి కానీ పాపకు తెలియడం ఏంటి. అసలు ఆ పాలు ఎందుకు పాప మీద పడ్డాయి. అందరం అక్కడే ఉన్నాం మన ఎవరి మీద ఎందుకు పడలేదు. పాప మీదే పడ్డాయి అంటే దాని అర్థం.
హాసిని: గాయత్రీ దేవి అని..
నయని: అంటే.. గాయత్రీ పాపకు గాయత్రీ దేవికి ఏంటి సంబంధం..
విశాల్: నయని పాపకు మా అమ్మ గురించి ఏం తెలుసో తనకు మాటలు వచ్చే వరకు తెలుసుకోలేం. ఎక్కువ ఆలోచించకు.
మరోవైపు ఎద్దులయ్య, డమ్మక్క, పావనా మూర్తిలు గాయత్రీ పాపని హాల్‌లో ఆడిస్తారు. ఇంతలో గురువుగారు, లలితాదేవి ప్రసాదం తీసుకొని అక్కడికి వస్తారు. ఇక నయని ఆ ప్రసాదం తీసుకోవాలి అని వెళ్లగా గురువుగారు ఆపి అది విశేషమైన ప్రసాదం అని వారసత్వాన్ని అందించే ముగ్గురు కోడళ్లకు సమానంగా ఇవ్వాలా లేక ఒక్కరికే ఇవ్వాలా అనేది లలితా దేవి ఇష్టం అంటారు. కేవలం మళ్లీ పిల్లలు కనాలి అనుకునేవారే ఆ ప్రసాదం తినాలి అని అంటారు.
నయని తమనకు బిడ్డ కనే ఆలోచిన లేదు అంటుంది. ఇద్దరు కోడళ్లు ప్రసాదం తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నయని తీసుకుంటుంది. ఇక ప్రసాదం ఏముందో చూడమని అంటే నయని చూడగానే అందులో బంగారం ఉంటుంది. దీంతో సుమన ముందే చెప్పాలి కదా అని అంటుంది. గాయత్రీ పాప పేరు మీద ఆస్తి రాసినందుకు బంగారం ఇవ్వలేదు అని బాధ పడ్డాను అనగానే ఇప్పుడు ఇవ్వమన్నారు అని లలితాదేవి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.