Naga Panchami Serial Promo Today : కట్టుకున్న భర్త ప్రాణాల మీదకు వస్తే ఆ భార్య తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి భర్తను కాపాడుకుంటుంది. అలాంటిది భార్యే భర్త ప్రాణాలు తీయాల్సి వస్తే.. ప్రస్తుతం నాగ పంచమి సీరియల్ ఇదే కాన్సెప్ట్‌తో దూసుకుపోతుంది.
ఓ వైపు మావన రూపంలో భార్యలా తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఇష్టరూప నాగు పాములా తన భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది నాగపంచమి. తాజాగా నాగపంచమి సీరియల్ ప్రోమో విడుదల అయింది. దీంతో నేటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అని ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..
"నాగ లోక యువరాజు ఫణేంద్ర మనకు సాయం చేస్తాడని పంచమి మోక్షతో చెప్తుంది. దీంతో మోక్ష తను మనకు నాగమణి తీసుకొని వచ్చి ఇస్తాడా అని అడుగుతాడు. దానికి పంచమి నా నాగమణిని నేనే తీసుకొని రావాలి. తను నేను నాగలోకం వెళ్లేందుకు మాత్రం సాయం చేస్తాడు మోక్షాబాబు అని చెప్తుంది. దీంతో మోక్ష మరి నువ్వు తిరిగిరాకపోతే అని అడుగుతాడు. మరో వైపు పంచమి నాగకన్యలా మారి ఫణేంద్ర యువరాజును పెళ్లి చేసుకొని ఆయన వెంట ఏడు అడుగులు వేస్తుంది." మరి మోక్ష ఎంత చెప్పినా వినకుండా పంచమి నాగలోకాని వెళ్లిందా.. పంచమి, ఫణేంద్రల పెళ్లి నిజమేనా అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే..
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మోక్ష పంచమితో.. నువ్వు తల్లివి అయితేనే భూలోకంలో శాశ్వతంగా ఉండిపోతావని.. అదే మనకు ఉన్న చివరి అవకాశం అని చెప్తాడు. దానికి పంచమి అంగీకరించదు. నాగమణితో చనిపోయిన మనిషిని బతికించొచ్చనే విషయాన్ని తాను కరాళి ద్వారా తెలుసుకున్నానని పంచమి మోక్షకు చెప్తుంది. చివరకి నిమిషం వరకు తన ప్రయత్నాలు తాను చేస్తానని అడ్డురావొద్దని మోక్షకు చెప్తుంది.
మరో వైపు కరాళి మాయలో పడిన ఫణేంద్ర పంచమితో మాట్లాడటానికి వస్తాడు. నాగమణి పంచమి మాత్రమే తాకగలదు అని చెప్తాడు. దీంతో పంచమి ఆ నాగమణి తనకు చాలా అవసరం అని దాన్ని భూలోకానికి తీసుకురావడానికి ఏం చేయడానికైనా సిద్ధమని ఫణేంద్రతో చెప్తుంది. దీంతో ఫణేంద్ర నాగమణి దక్కించుకోవడానికి సాయం చేస్తాను అంటూ పంచమికి కొన్ని షరతులు పెడతాడు.
అవి తాను శాశ్వతంగా నాగలోకంలో ఉండిపోవాలని.. తనను పెళ్లి చేసుకొని నాగ పీఠం అధిరోహించాలని చెప్తాడు. మోక్షని బతికించుకోవడమే తన లక్ష్యమని అందుకు ఏం చేయడానికైనా సిద్ధమని పంచమి ఫణేంద్ర షరతులకు ఓకే చెప్తుంది. అయితే తాను శాశ్వతంగా భూలోకాన్ని విడిచి పెట్టి వెళ్లేందుకు మోక్ష ఒప్పుకోడని ఆ విషయాన్ని మోక్ష దగ్గర దాచేయాలని పంచమి అనుకుంటుంది.
ఇక కరాళిని నాగకన్య అనుకున్న ఫణేంద్ర తనని పంచమి దగ్గరకు పంపిస్తానని చెప్తాడు. ఇలా అయినా ఆమెను మీ ఇంట్లో ఉంచుకో అని చెప్తాడు. ఆమె మోక్ష చనిపోయిన తర్వాత మోక్ష దేహానికి కాపాలాగా ఉంటూ పాడవకుండా చూసుకుంటుంది అని చెప్తాడు. మొత్తానికి ఫణేంద్ర మాటలు విన్న పంచమి తానే మోక్షని కాటేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక నాగలోకానికి వెళ్లి తన భర్త కోసం నాగమణిని నాగదేవతకు తెలీకుండా తీసుకురావాలి అనుకొని ఫణేంద్రతో చేతులు కలుపుతుంది.
Also Read: వాళ్లకు ఆ కోరికలు ఉండవా? సందీప్ రెడ్డి వంగాపై ‘యానిమల్’ స్క్రీన్‌రైటర్ గజల్ ఘాటు వ్యాఖ్యలు