Meghasandesam Serial Today Episode:   సోషల్‌ మీడియాలో భూమి వీడియో చూసి ఎవరెవరో ఫోన్‌ చేస్తుంటారు. వాళ్లందరికీ సమాధానం చెప్పలేక భూమి అలసిపోతుంది. భూమి అవస్థలు చూసి గగన్‌, చెర్రి నవ్వుకుంటారు. ఇంతలో నరేన్‌ ఫోన్‌ చేస్తాడు. హాలో బ్యూటీ మాట్లాడవేంటి…? కొంపదీసి ఇప్పటికే చనిపోయావా ఏంటి నువ్వు ప్రేమిస్తుంది నన్నే.. ఆరోజు కొట్టబోయి ఆ తర్వాత చచ్చిపోయేంత ప్రేమ ఎలా పెంచుకున్నావా..? అని డౌటుగా ఉంది. అయినా ఆరోజు నాకు నీళ్లు కొట్టబోయావు. అంటూ అనగానే అవును గుర్తుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు నాకు ఎన్నో ఫ్రాంక్‌ కాల్స్‌ వచ్చాయి అందుకే నమ్మలేకపోతున్నాను. అని భూమి చెప్పగానే ఆరోజు జరిగింది మొత్తం చెప్తాను విను అని నరేన్‌ మొత్తం చెప్పగానే భూమి ఓకే ఇప్పుడు నమ్మకం వచ్చింది మనం ఒకసారి కలుద్దామా..? అంటుంది. సరేనని నరేన్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు హాస్పిటల్‌ లో ఇందును తినమని మీరా అడుగుతుంది.


మీరా: కొంచెం తిను తల్లి. నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నా మాట వినమ్మా…? టాబ్లెట్‌ కూడా వేసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా అమ్మా..


ఇందు: నాకేం వద్దు..


మీరా: అలా అయితే ఎలా అమ్మా..


సిస్టర్‌: ఏవండి కొంచెం ఈ మెడిసిన్‌ వేసుకోండి.


ఇందు: నాకేం వద్దు … నన్ను ఇలా వదిలేయండి.


బిందు: అలా అంటే ఎలా అక్కా మెడిసిన్‌ వేసుకోకపోతే ఎలా..? వేసుకో అక్కా.


ఇందు: వద్దని చెప్తున్నాన్నా..?


బామ్మ: ఆరోగ్యం బాగా లేని దానికి అలా కొప్పడితే ఎలా అమ్మా..


ఇందు: ఇప్పుడు మెడిసిన్‌ వేసుకుని నేను బతికి ఏం చేయాలి.


డాక్టర్‌: పేషెంట్‌ ఎక్కువ ఇబ్బంది పడకూడదండి.


అంటూ చెప్పగానే అందరూ కలిసి మందులు వేసుకోమని చెప్తారు. కానీ ఇందు వినకుండా బాధపడుతుంది. వంశీతోనే నా పెళ్లి జరగాలని.. నాకు ఎవరితో పెళ్లి జరిగినా ఆయన దృష్టిలో నేను తిరుగుబోతుదానిలా ఉండిపోతాను కదా? అంటుంది. దీంతో మీరా కోపంగా ఇందును తిడుతుంది.


ఇందు: నలుగురు నన్ను తప్పు చేసిన దానిలా చూస్తుంటే ఆ బతుకు నాకొద్దు. అందుకే ఆయనతో నా పెళ్లి అయినా జరగాలి. లేదంటే లేదు.


మీరా: వింటున్నారా..? చస్తాను అంటుంది అది. మీ కొడుకు చేసిన పనికి మీరు మౌనంగా ఉంటే చచ్చేది కూడా మీ కూతురేనండి. దానికి జరిగిన అవమానికి కుమిలిపోయి ఏడుస్తుంటే.. మీరు ఏమి అనకపోయినా నేను ఆ వంశీ ఇంటికి వెళ్తాను. కాళ్లు పట్టుకుని అయినా వాళ్లను ఒప్పిస్తాను.


ప్రసాద్‌: మీరా..?


మీరా: మీరు వెళ్లరు. నన్ను వెళ్లనివ్వరు. రేపు అది ఏమైనా చేసుకుంటే దాని శవం నాదే. అప్పుడు మీరు మీ కొడుకు మీ కూతురు మీ శారద సుఖంగా ఉండండి. వెళ్లి ఆ అబ్బాయితో నేనే మాట్లాడతాను.


ప్రసాద్‌: మీరా నీతో పాటు నేను కూడా వస్తాను. అమ్మా జాగ్రత్త. పద


 అని ప్రసాద్‌, మీరా ఇద్దరు కలిసి వంశీ వాళ్ల ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు వంశీ వాళ్ల ఇంట్లో పెళ్లి గురించే గొడవ జరగుతుంటుంది. పెళ్లి కోసం పెట్టిన ఖర్చు గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి మీరా, ప్రసాద్‌ వస్తారు వాళ్లను చూసిన వంశీ వాళ్ల అమ్మానాన్నలు ఘోరంగా తిడుతూ అవమానిస్తారు. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ముఖం మీదే చెప్తారు. ఇందును అవమానంగా తిడతారు. వంశీని బతిమాలుతారు. నువ్వంటే ఇష్టం కాబట్టే ఆరోజు నీకోసం బయటకు వచ్చింది అని చెప్పగానే వంశీ నమ్మనని చెప్తాడు. ఇందును ఘోరంగా తిడతాడు. దీంతో ప్రసాద్‌ ఏడుస్తూ వంశీ కాళ్లు పట్టుకుని బతిమాలుతాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!