Prema Entha Madhuram  Serial Today Episode:  తన కొడుకు నిజాయితీ గురించి తెలుసుకున్న యాదగిరి ఎమోషనల్ అవుతాడు. అకి విషయంలో  రవి చాలా బాధ్యతగా ఉన్నాడని ప్రతి విషయంలో చాలా కేర్‌గా చూసుకున్నాడని జెండే మెచ్చుకోవడంతో యాదగిరి కన్నీళ్ల పర్యంతమవుతాడు. అయినా తమ్ముళ్లు దూరమై శంకర్‌ అంత బాధలో ఉంటే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు. అంటాడు. దీంతో యాదగిరి మర్చిపోయాను సార్‌ థాంక్యూ అంటాడు. అకి ఒక్కతే ఉంది. నేను వెళ్తాను. నువ్వు శంకర్‌ దగ్గరకు వెళ్లు అని చెప్తూ.. రవికి కూడా జెండే చెప్పగానే అందరూ ఎమోషనల్‌ అవుతారు. జెండే వెళ్లిపోతాడు. యాదగిరి కూడా శంకర్‌ వాళ్ల ఇంటికి వెళ్తాను అంటాడు. మరోవైపు చిన్నొడు, పెద్దొడు లగ్జరీ  కారులో శంకర్‌ ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన శంకర్‌ హ్యాపీగా ఫీలవుతాడు. గౌరి, శ్రావణి, సంధ్య ఆశ్చర్యంగా చూస్తుంటారు.


చిన్నొడు: ఏంటి గౌరి గారు అలా చూస్తున్నారు మేము అవునా కాదా..? అని ఆశ్చర్యంగా ఉంది కదూ..


పెద్దొడు: ఒక పెద్దమనిషి మమ్మల్ని ఇంట్లోంచి గెంటివేస్తే.. ఉండటానికి ఇల్లు తినడానికి తిండి లేకుండా అవస్థలు పడతాము అనుకున్నారు.


చిన్నొడు: కానీ మీ టైం బాగుంది. ఇప్పుడు మాకు తినడానికి ఫైవ్‌ స్టార్‌ ఫుడ్‌, తిరగడానికి లగ్జరీ కారు ఉంది.


పెద్దొడు: ఇంకో విషయం మేము ఇప్పుడు జాబ్‌ కోసం తిరగవలసిన అవసరం లేదు. మేమే పది మందికి జాబ్‌ ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాం.


చిన్నొడు: ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకొచ్చామో తెలుసా..? మమ్మల్ని చేతకాని వాళ్లలా చూసిన వారికి మా పొజిషన్‌ చూపించాలని వచ్చాము


 అంటూ శంకర్‌ ను అవమానకరంగా మాట్లాడతారు. వాళ్లను గౌరి పిచ్చ తిట్టుడు తిడుతుంది. ఎవరి కాళ్లు పట్టుకుంటే మీకు ఈ అవకాశం వచ్చింది అని నిలదీస్తుంది. దీంతో ఇద్దరూ కోపంగా చూస్తుంటారు. మీకైనా నమ్మకద్రోహులు ఎవరైనా ఉంటారా..? అని తిట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు రాకేష్‌.. గౌరి, శంకర్‌ లను చంపేయాలని ప్లాన్‌ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి జోగమ్మ వస్తుంది. ఆమె మాటలు విన్న జెండే, అకి బయటకు వస్తారు.


రాకేష్‌: ఏదో కారణం లేకుండా జోగమ్మ రాదు. ఏం చెప్తుందో వినాలి.


అని చాటు నుంచి చూస్తుంటాడు రాకేష్‌.


జెండే: జోగమ్మ మీరు ఎప్పుడు వస్తారా..? అని ఎదురుచూస్తున్నాను. కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి.


జోగమ్మ: ఆమ్మ ఆజ్ఞ లేనిదే నేను ఎక్కడికి రాలేను. నీ ప్రశ్న ఏందో దానికి సమాధానం ఏంటో అమ్మ చెప్పింది. మీ కుటుంబానికి రక్షగా ఉన్న రాజనందిని ఆత్మ నిద్ర లేచింది. దీపావళి రోజున మీరు కోరుకుంటున్న కలయిక జరుగుతుందా? లేదా అనే కదా? మీ సంశయం.


అకి: అవునమ్మా.. దీపావళి రోజున అన్నయ్య మా అమ్మా నాన్నలను కలుస్తాడని ఆశగా ఉంది. నా ఆశ నెరవేరుతుందా..? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మా ఊరిలోనే మా అమ్మా నాన్నాలను అన్నయ్య కలుస్తాడని అనుకున్న కానీ అది జరగలేదు.


జోగమ్మ: జరగకపోవడానికి కారణాలు లేకపోలేదు. అమ్మ మాట పొల్లు పోలేదు. వాళ్లు కలిశారు కానీ కళ్లారా? చూసుకోలేకపోయారు.


అని జోగమ్మ చెప్పగానే అవునని అకి అంటుంది. దీంతో దుష్ట గ్రహాల కారణంగా ఇలా జరిగింది అయినా సరే చివరికి మంచే జరుగుతుంది. దీపావళి రోజున తప్పకుండా కలుస్తారు అని జోగమ్మ చెప్పగానే చాటు నుంచి వింటున్న రాకేష్‌ షాక్‌ అవుతాడు. వాళ్లు కలవడానికి ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి అని జోగమ్మ చెప్తుంది. తర్వాత జోగమ్మ చెప్పిన ఆటంకం నేనే అవుతానని అనుకుంటాడు. మరోవైపు తమ్ముళ్ల బిల్డప్‌ చూసి శంకర్‌ వాళ్లను అనుమానిస్తాడు. వాళ్లను ఎవరో కావాలని చేస్తున్నారని వాళ్లు ఎవరో తెలుసుకోవాలని యాదగిరికి చెప్పడంతో.. యాదగిరి వెంటనే జలంధర్‌ కొడుకు అనగానే శంకర్‌ షాక్‌ అవుతాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!