Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీని మీరే వెళ్లి తీసుకురండి అని నిర్మల, శివరాంలకు అమర్‌ చెప్పగానే శివరాం మేము వెళ్లకూడదని నువ్వే వెళ్లి తీసుకురావాలని చెప్తుంటారు. కింద నుంచి అంతా వింటున్న మనోహరి ఎలాగైనా అమర్‌ను డైవర్ట్‌ చేయాలనుకుని పైకి అమర్‌ అని పిలస్తూ వచ్చి కిందపడినట్టు యాక్టింగ్‌ చేస్తుంది. బాగా దెబ్బ తగిలినట్టు నొప్పి వస్తున్నట్టు నటిస్తుంది. దీంతో అమర్‌, మనోహరిని పట్టుకుని రూంలోకి తీసుకెళ్తాడు. ఆరు, గుప్త కూడా రూంలోకి వస్తారు.


గుప్త: నీవల్లే కన్నులు పెద్దవిగా చేసుకుని ఈ సన్నివేశాన్ని చూసే ధైర్యం నాకు లేదు బాలిక నేను వెళ్లుచున్నాను.


ఆరు: అయ్యో గుప్త గారు.. ఆగండి..


మనోహరి: పెయిన్‌ ఎక్కువగా ఉంది అమర్‌ నొప్పి భరించలేకపోతున్నాను.


అమర్‌: అయితే డాక్టర్ కు కాల్ చేస్తాను ఉండు మనోహరి.


మనోహరి: ఆమర్‌ ఆగు ఇంత చిన్న దెబ్బకు డాక్టర్‌ ఎందుకు..? పెయిన్‌ కిల్లర్‌ ఆయిట్‌మెంట్‌ రాసుకుంటే సరిపోతుంది. కదా..?


అమర్‌: చిన్న దెబ్బ ఏంటి మనోహరి నడవలేకపోతున్నావు కదా..?  ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు.


మనోహరి: అయ్యో అమర్‌ పర్వాలేదు. ఒకసారి ఆయిట్‌మెంట్‌ రాసి చూద్దాం అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ కు కాల్ చేద్దాం.


   అని మనోహరి చెప్పగానే అమర్‌ ఆయిట్‌ మెంట్‌ తీసుకురావడానికి వెళ్తాడు. అమర్‌ వెళ్లగానే మనోహరి హ్యాపీగా ఫీలవుతూ ఇదే మంచి చాన్స్‌ అమర్‌ తో ఆయిట్‌ మెంట్ రాయించుకుని అప్పుడు తనను ప్రేమలోకి దించుతాను అనుకుంటుంది. అక్కడే ఉన్న ఆరు మనోహరి కాలు పట్టుకుని విరగొడుతుంది. ఇంతలో అమర్‌ వచ్చి ఆయిట్‌మెంట్‌ రాయడానికి  వెళ్తుంటే.. ఆరు కాలు విరగొడుతుంది. మనోహరి అరుస్తూ ఆ ఆయిట్‌మెంట్ నాకు ఇవ్వు అమర్‌ నేను రాసుకుంటాను అని తీసుకుంటుంది. మరోవైపు కింద భాగీ ఫ్రెండ్‌ కరుణ వస్తుంది. వీడియో కాల్ చేసి భాగీకి ఇంటిని చూపిస్తుంది. వీడియో కాల్‌ లో భాగీకి ఆరు కనిపిస్తుంది.


ఆరు: అక్కా ఉంది అక్కడ..?


కరుణ: అక్కా అక్క ఏంది…?


ఆరు: అదేనే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా.. పక్కిటి అక్కా..


కరుణ: ఏక్కడ ఉందే…


ఆరు: ఏంటో ఫోన్‌ అటూ ఇటూ తిప్పుతున్నావు… సరిగ్గా పెట్టవే.. కెమెరా కదపకుండా సరిగ్గా పెట్టు ..ఆ ఇప్పుడు చూశావుగా అక్కడే పెట్టు.


కరుణ: ఎవరున్నారే పలకరించడానికి.. అక్కడ ఎవ్వరూ లేరు కదా..?


ఆరు: కళ్ల ముందు పెట్టుకుని కనిపించడం లేదా..?


గుప్త: బాలిక ఇటు రమ్ము.. ఈ బాలిక.. ఆ బాలిక  ఆ చరవాణిలో నిన్ను చూస్తున్నారు.


అని గుప్త చెప్పగానే ఆరు చాటుకు వెళ్తుంది. కరుణ కూడా కోపంగా భాగీని తిడుతూ.. మీ ఆయన్ని చూపించాలా..? లేక వేరే ఏదో చూపించాలా..? అంటూ లోపలికి వెళ్తుంది. తర్వాత ఆరు కిటికీ దగ్గరకు వెళ్తుంది. లోపలికి వెళ్లిన కరుణను శివరాం పలరిస్తాడు. తర్వాత విషయం తెలుసుకుని నాటకం మొదలుపెడతారు. శివరాం ఇంకెక్కడి భాగీ పుట్టింటికి వెళ్లింది. అని చెప్తుంటే వెనక నుంచి అమర్‌ వస్తాడు. కోపంగా శివరాంను పిలిచి అసలు మీరు ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా..? అంటూ అరుస్తాడు. ఇంతలో భాగీ ఫోన్‌ లో అమర్‌ ను చూసి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!