Meghasandesam Serial Today Episode : భూమి, శారదకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే.. వెనక నుంచి గగన్ వస్తాడు ఎవరమ్మా అని అడుగుతాడు. వెంటనే శారద ఎవరో సేల్స్ గర్ల్ అనురాగము, అప్యాయత లాంటి పుస్తకాలు ఉన్నాయట. వాటి గురించి వివరిస్తాను ఇంటికి వస్తాను అంటుంది. అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి గురించి మనకెందుకు అందుకే వద్దని చెప్తున్నాను. అంటూ భూమికి అర్తం అయిందా అమ్మా రావొద్దు అని చెప్తుంది. భూమి ఏడుస్తుంది. ఫోన్ కట్ చేసిన శారద కూర్చోరా.. టిఫిన్ పెడతాను తిందువు అంటుంది. దీంతో గగన్ లేదమ్మా ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది. మధ్యాహ్నం లంచ్‌కు వస్తాను అంటూ వెళ్లిపోతాడు. రోడ్డు మీద భూమి, గగన్ కోసం ఎదురు చూస్తుంది. గగన్ వస్తాడు.
గగన్: ఏమైంది భూమి అలా ఉన్నావేంటి..? ఎనీ ప్రాబ్లమ్.. ఏంటి అలా చూస్తున్నావు.. నేనేమైనా తప్పుగా మాట్లాడానా..?
భూమి: నేనే తప్పుగా మాట్లాడాను. అంత మందిలో నేను మిమ్మల్ని అవమానించాను.
గగన్: ఓ అదా.. అది ఓకే భూమి. నాకు అవమానం జరిగిందని నువ్వు ఏడుస్తున్నావా..? అవమానాలు నాకు అలవాటు అయిపోయాయి. నువ్వు చేసింది అవమానం అని కూడా నేను అనుకోవడం లేదు. నేను చేసుకున్న అపార్థానికి ఒక గుణపాఠం అనుకున్నాను. నేర్చుకున్న పాఠాలు గుర్తు ఉండకపోవచ్చు కానీ ఎదురైన గుణపాఠాలు మనుషుల్ని మరింత తీర్చిదిద్దుతాయని నేనెక్కడో విన్నాను. అయినా నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థాంక్స్ చెప్పాలి భూమి.
భూమి: మీరు నాతో నార్మల్ గా మాట్లాడుతుంటే.. నాకు ఏడుపు వచ్చేస్తుందండి. దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడండి ఫ్లీజ్.
గగన్: ఎందుకు ఏడుస్తున్నావు.. ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపు. ఎవరైనా చూస్తే నేనే ఏడిపిస్తున్నాను అనుకుంటారు. మళ్లీ అపార్థాలు వస్తాయి. మళ్లీ నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. అసలు నేను కారు ఎందుకు ఆపానంటే.. నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమోనని అది కూడా ఒక తెలిసిన అమ్మాయిగా..
భూమి: ఎందుకండి అలా మాట్లాడుతున్నారు.
గగన్: దీన్ని కూడా నువ్వు అపార్థం చేసుకోకూడదని మాట్లాడుతున్నాను. చెప్పు భూమి ఓకేనా.. ఏం ప్రాబ్లమ్ లేదుగా
అంటూ అడిగి గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఇంది దగ్గర భూమికి అపూర్వ ఎదురుగా వస్తుంది. ఏంటి ఈ నాటకాలు అంటూ నిలదీస్తుంది. ఇంట్లో నాటకాలు ఆడుతున్నావా…? ఆ గగన్ గాడిని ప్రేమించలేదన్నావు మళ్లీ వాడి దగ్గరకు వెళ్లి వస్తున్నావా..? అంటూ నిలదీస్తుంది.
భూమి: నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను.. ఆయన నా ప్రాణం.
అపూర్వ: మరి మీ నాన్నా..?
భూమి: సమానంగా ప్రాణం..
అపూర్వ: సమాంతర రైలు పట్టాలు కలవవని చెప్పాను కదా భూమి.
భూమి: ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలియదా..? అపూర్వ. నాన్నను గగన్‌ను కలిపి నాన్న ఆశీర్వాదంతో గగన్‌ను పెళ్లి చేసుకుంటాను.
అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది భూమి. భూమి రావడం చూసిన శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అమ్మా అంటాడు. నాకు అప్పుడే పెళ్లేంటి నాన్నా అని అడుగుతుంది భూమి. నీకు పెళ్లి జరగనంత వరకే ఆ గగన్ గాడు నీతో తిరుగుతుంటాడు. అదే నీ పెళ్లి అయిపోయింది అనుకో వాడి తలనొప్పి వదిలిపోతుంది అని చెప్తాడు. దీంతో భూమి ఆలోచనలో పడిపోతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!