Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్య ప్రాణాలు కాపాడింది కార్తీక్ బాబు పిన్ని అని కార్తీక్ బాబుకి ఎప్పటికీ తెలీకూడదని దీప అనుకుంటుంది. మీరు చేసిన మంచి పనులే ఈ రోజు మీకు తిరిగి వచ్చిందని అంటాడు కాశీ. ఇక ఆపరేషన్ థియేటర్ ఎదురుగా దీప వాళ్లు ఉంటారు. ఇంతలో ఒకామె వచ్చి ఆపరేషన్ అయినా కూడా తన కూతురు చనిపోయిందని ఏడస్తుంది. దాంతో దీప శౌర్యని తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంటి దగ్గర కాంచన, అనసూయ కూడా ఏడుస్తూ దేవుడిని దండం పెట్టుకొని ఉంటారు. 


డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఇకపై తనకు ఏం ప్రమాదం లేదని చెప్తాడు. దీప, కార్తీక్, కాశీలు చాలా సంతోషిస్తారు. దీప సంతోషంలో ఏడుస్తుంది. డాక్టర్‌కి చాలా థ్యాంక్స్ చెప్తుంది. దాంతో డాక్టర్ సమయానికి డబ్బు కట్టకపోయి ఉంటే ఆపరేషన్ జరిగకపోయేదని పాప బతకపోయేదని అంటాడు. కార్తీక్ కాశీని ఇంటికి వెళ్లి కాంచన వాళ్లకి స్వప్న వాళ్లకి చెప్పమని చెప్తాడు. కార్తీక్ టిఫెన్ తీసుకురావడానికి వెళ్తాడు. మరోవైపు కావేరి కోసం శ్రీధర్ తెగ  టెన్షన్ పడతాడు. ఇంతలో కావేరి సూట్ కేస్ పట్టుకొని ఇంటికి వస్తుంది. కావేరిని శ్రీధర్ తిడతాడు. ఎక్కడికెళ్లావో చెప్పు అని అంటాడు. దాంతో కావేరి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్లానని అంటుంది. ఈ సూట్ కేస్ ఏంటి అని అడుగుతాడు. పూజా స్టోర్‌కి వెళ్లానని చెప్తుంది. తింగరి తింగరిగా మాట్లాడుతుంది కావేరి. ఇక స్వప్నకి కాల్ చేసి వచ్చేశానని చెప్పమంటాడు. కావేరి మీద అనుమానంగా ఉందని అనుకుంటాడు. దీప, కార్తీక్ ఇద్దరూ టిఫెన్ చేస్తూ ఆపరేషన్ ఆవ్వకపోయి ఉంటే అని దీప ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. కార్తీక్ మౌనంగా ఉంటాడు. ఏం మాట్లాడట్లేదు ఏంటి అని దీప అడిగితే కార్తీక్ ఏడుస్తాడు. 


కార్తీక్: మా నాన్న తప్పు చేసినప్పుడు కోపం వచ్చింది కానీ ఏడుపు రాలేదు. కానీ ఏడేళ్ల పాపకి గుండె సమస్య అని తెలిసి ఎలా అయినా పాపని కాపాడాలి అనుకున్నా అదే పాప నా చేయి పట్టుకొని నన్ను నాన్నలా ఉండిపోమని అడిగింది మాట్లాడలేకపోయాను. శౌర్య మనస్శాంతిగా నవ్వితేనే బతుకుతుంది అనుకున్నా. అందుకే నీ మెడలతో తాళి కట్టాను. అది నాన్న అని మొదటి సారి పిలిచినప్పుడు దాని కంట్లో మెరుపు చూశా. అది బతుకుతుందని నాకు ఆరోజు అనిపించింది. కానీ నమ్మకం ఎంతో కాలం నిలబడలేదు. ఆపరేషన్ చేస్తే కానీ శౌర్య బతకని పరిస్థితి. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. జ్యోత్స్న వల్ల నీకు నిజం తెలిసిపోయింది. నాకు రాత్రే తెలిసిపోయింది మాట తప్పిపోయాను అని. ఏ పిలుపు కోసం దాన్ని దగ్గరకు తీసుకున్నానో ఇక నాకు అది ఉండదు అనుకున్నా. శౌర్యతో మనం గడిపే ఆఖరి క్షణాలు ఇవే అనుకున్నా. గట్టిగా ఏడ్వాలి అనిపించింది. ఆ తర్వాత తిరుగుతున్నాను. నీకేదో చెప్తున్నా. డాక్టర్‌ని బతిమాలుతున్నాను కానీ ఏదో ట్రాన్స్ లోనే జరుగుతున్నాయి దీప నాకు ఏం అర్థం కావడం లేదు. నా కూతురిని బతికించు దేవుడా అని గట్టిగా ఏడ్వాలనిపించాలని కార్తీక్ చెప్పి చాలా గట్టిగా ఏడుస్తాడు. దాన్ని తీసుకెళ్లిపోదాం అని నువ్వు అనగానే నాన్నగా చనిపోయాను దీప. దాన్ని తీసుకెళ్లిపోవడం అంటే అర్థం ఏంటి? నేను ఓడిపోయినట్లే కదా. ఆ మాట వినగానే నా వల్ల కాలేదు దీప. శౌర్యని చంపేసుకుంటానేమో అని దాని కంటే ముందు నేను చనిపోయాను దీప.
దీప: మీరు అలా అనొద్దు బాబు మీ లాంటి తండ్రి దొరకడం దాని అదృష్టం. శౌర్య మీ కూతురు కాదని నేను అన్న మాట మర్చిపోయేంతలా మీరు తాపత్రయం పడ్డారు. దాని విషయంలో మీ తర్వాతే నేను.
కార్తీక్: లేదు దీప శౌర్య మన ఇద్దరి కూతురు.  మన ఇద్దరం దానికి కావాలి. మనకి అది కావాలి. శౌర్య లేచిందని నర్స్ చెప్పడంతో కార్తీక్ దీప ఇద్దరూ వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!