Meghasandesam Serial Today February 16th: ‘మేఘసందేశం’ సీరియల్: నక్షత్రను పెళ్లి చేసుకోమన్న చెర్రి – గగన్ ఉండగా ఇంట్లోకి వచ్చిన ప్రసాద్
Meghasandesam Today Episode: నక్షత్ర ను పెళ్లి చేసుకుంటే నువ్వు బిలియనీర్‌వి అవుతావని చెర్రి చెప్పడంతో గగన్ సీరయస్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : హాస్పిటల్‌లో జరిగిన గొడవ గురించి ప్రసాద్‌కు చెప్తుంది భూమి. అపూర్వ నిజం చెప్పొద్దని గగన్ ప్రాధేయపడుతుంది. అందుకే ఆయన నోరు తెరువలేదు మామయ్య అని చెప్తుంది. నక్షత్రను మీ నాన్న చంపేస్తాడని వాడు ఆలోచించి ఉంటాడమ్మా అంటాడు ప్రసాద్. నిజమే మామయ్య అలాంటి మనసు నాకు దూరం అయిపోతుంది అని బాధపడుతుంది భూమి. చెర్రి ఆలోచిస్తూ ఉంటాఉ.
చెర్రి: యువర్ సో లక్కీ సోదరా..? త్వరలోనే నువ్వు బిలియనీర్ అవుతావు.
గగన్: ఏరా ఇప్పటి వరకు మాటల్ని గాలిలోంచి పుట్టించే వాడివి. ఇప్పుడు జ్యోతిష్యాన్ని కూడా పుట్టిస్తున్నావేంట్రా.. కొంపదీసి ఏ రోడ్డు పక్కనో.. చెట్టు కిందో చిలకజోస్యం పెట్టుకున్నావా..? ఏంటి..?
చెర్రి: అంత మాట అనేశావేంటి సోదరా..? నేను చాలా జీనియస్ సోదరా..?
గగన్: ఏ బేసిన్ మీద నీ జీనియస్ బుర్ర ఇదంతా చెప్తుంది.
చెర్రి: అదీ ఏమీ లేకుండానే నువ్వు ఇంత సాధించావు. ఇక్కడి నుంచి ట్రై చేస్తే.. నీకు డబుల్ వస్తుంది.
గగన్: ఇప్పటికిప్పుడు నాకున్న దానికైనా డబుల్ ఎలా వస్తుందిరా..?
చెర్రి: నక్షత్రను నువ్వు పెళ్లి చేసుకుంటే.. మామయ్య బిజినెస్‌లు అన్ని నువ్వే చూసుకుంటావు కదా..? అంటే ఇప్పుడున్న దానికి డబుల్ వచ్చినట్టే కదా..?
గగన్: నేను నక్షత్రను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా..?
చెర్రి: చెప్పలేదు కానీ చేసుకుంటే మంచిది కదా..? అదీ కాక నక్షత్ర నిన్ను ప్రేమించింది కదా..? మనల్ని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టం కదా..?
గగన్: శరత్, అపూర్వ, నక్షత్ర ముగ్గురు నాకు అబ్జక్షనే.. వాళ్లతో విరోధం నాకు ఓకే.. వియ్యం మాత్రం నాట్ ఓకే..
చెర్రీ: అది కాదు అన్నయ్యా నక్షత్ర
అని ఏదో చెప్పబోతుంటే గగన్ ఇది ఇక్కడితో ఆపేయమని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత గగన్ కారు తీసుకుని చెర్రి వెళ్లిపోతాడు. ఇంటి బయట చూస్తూ ఉన్న ప్రసాద్ హమ్మయ్యా గగన్ గాడు వెళ్లిపోయాడు అనుకుంటూ దర్జాగా శారదా అంటూ పిలుస్తూ లోపలికి వెళ్తాడు. శారద కంగారు పడుతూ ఏవండి వాడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తుంది. వాడు బయటకు వెళ్లడం నేను చూశాను. నీచేత్తో నాకు ఒక కాఫీ ఇవ్వు అని అడుగుతూ కిచెన్ లోకి వెళ్తాడు ప్రసాద్. ఇంతలో గగన్ అమ్మా అంటూ కిందకు వస్తాడు. ప్రసాద్ షాక్ అవుతాడు. ఫ్రిజ్ పక్కన దాక్కుంటాడు.
గగన్: ఏమైందమ్మా ఏందుకు టెన్షన్‌గా కనబడుతున్నావు. ఏమైనా ప్రాబ్లమా..?
శారద: అబ్బే ఏం లేదురా..?
గగన్: సరే టిఫిన్ రెడీయా..?
శారద: అయిందిరా తెస్తున్నాను.
గగన్: అదేంటమ్మా పాలు అలా కిందపడ్డాయి. ఏం అయింది.
శారద: గిన్నెలో పోస్తుంటే.. కింద పడ్డాయి. నేను క్లీన్ చేస్తాను.
గగన్: పర్వాలేదమ్మా క్లీన్ చేయ్ నేను హెల్ప్ చేస్తాను.
శారద: పర్వాలేదురా.. ముందు నువ్వు టిఫిన్ చేయ్..
అని గగన్‌కు టిఫిన్ పెడుతుంది శారద. గగన్ తింటూ కిచెన్ వైపు చూస్తుంటాడు. శారద కంగారు పడటం చూసి ఏందుకలా ఉన్నావని అడుగుతాడు గగన్. ఏం లేదని చెప్తుంది శారద. టిఫిన్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి గగన్ వెళ్తుంటే.. అక్కడ పాలు కింద పడిపోయాయి కదా నేను వాటర్ తెస్తాను కడుక్కో అని శారద బౌల్‌లో వాటర్ తీసుకొస్తుంది. గగన్ చేయి కడుక్కుంటాడు. ఇక ఆఫీసుకు టైం అయింది కదా వెళ్తావా..? నాన్నా అని అంటుంది శారద. ఇంకా టైం ఉందని కాఫీ ఇవ్వమని గగన్ అడిగి అక్కడే కూర్చుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!