Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల నాగభూషణంతో బాబాయ్ గుడిలో ఎవరివో చెప్పులు దొంగతనం చేసింది నువ్వే కదా అని అడుగుతారు. నేను ఎప్పుడు వచ్చానురా అని నాగభూషణం అంటాడు. బాబాయ్ చెప్పుల దొంగ చెప్పుల దొంగ అని నాగభూషణం చుట్టూ తిరుగుతాడు. ఇక బామ్మ తన కన్నయ్యకు నిమ్మకాయలతో దిష్టి తీస్తుంది. నాగభూషణం భార్యతో బాల ఎప్పటికీ మంచిగా మారడని తన కొడుకే వారసుడని అంటాడు.


రమాదేవి: ఈ కొత్త ట్యాబ్ ఎవరు ఇచ్చారే.
ఊర్వశి: నీకు కాబోయే అల్లుడు కొనిచ్చాడు అమ్మ. 
రమాదేవి: నాకు కాబోయే అల్లుడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటే.
ఊర్వశి: అది కాదు మమ్మీ అసలేం జరిగింది అంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. సుందరి ఎవరని అనంత్ ఆలోచిస్తూ ఉంటే ఊర్వశి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. పోయిన ల్యాప్‌ట్యాప్ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తుంటుంది. ఇక అనంత్ కారు కింద కావాలనే ఊర్వశి పడిపోయి అనంత్ వల్లే ల్యాప్‌టాప్ పోయిందని గోల చేస్తుంది. దాంతో అనంత్ ల్యాప్‌టాప్ బాగు చేయిస్తా అని చెప్పి ఊర్వశిని కారులో తీసుకెళ్తాడు.


అనంత్ కారులో బిజినెస్ గురించి మాట్లాడటం కోట్ల డీల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఊర్వశి అనంత్ బాగా డబ్బున్నోడని తనని వాడు కోవాలని అనుకుంటుంది. అనంత్, ఊర్వశిని తీసుకొని ల్యాప్ టాప్ రిపేర్‌కి వెళ్తాడు. షాప్‌లో ఉన్న వ్యక్తిని సైగలతోనే తన దారిలోకి తెచ్చుకుంటుంది. ల్యాప్ టాప్ పోయింది అది లేకుండా ఇంటికి వెళ్లలేనని అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. దాంతో అనంత్ అడ్వాన్స్‌ మోడల్స్ ల్యాప్‌టాప్‌లు ఇవ్వమని అంటాడు, ల్యాప్‌టాప్‌ లేవని అడ్వాన్స్‌డ్ ట్యాబ్ ఉందని చెప్పడంతో అనంత్ అది కొంటాడు. 


ట్యాబ్ కొనిస్తే అల్లుడు అంటావా అంటే అనంత్ చాలా రిచ్ అని వందలాది మంది తమ కంపెనీల్లో పని చేస్తున్నారని అంటుంది. దాంతో రమాదేవి అనంత్‌ని వలలో వేసి పెళ్లి చేసుకోమని చెప్తుంది. మరోవైపు గిరి గుడిలో జరిగిన గొడవ తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అతని చెంచాలు వచ్చి వాడికి బుర్ర లేదని ప్రకృతి వైద్య శాలతో వైద్యం తీసుకోవడానికి వచ్చాడని చెప్తారు. గిరి వాడిని చంపేస్తా అంటూ గన్ తీస్తే రత్నమాల ఆపుతుంది. బుర్రలేనోడు నన్ను కొట్టాడని నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుందని అంటాడు. పెళ్లి టైంలో ఇలాంటివి చేస్తే నీ పెళ్లి ఆగిపోతుందని అంటాడు. పెళ్లి జరిగే వరకు ఆగమని అంటుంది. 


త్రిపుర అన్నయ్యకి కాఫీ ఇస్తుంది. గాయత్రీతో త్రిపుర ఎంత మాట్లాడినా గాయత్రీ మాట్లాడదు. తాతయ్య వచ్చి అక్కతో ఏం మాట్లాడవని అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు మాట్లాడాలి అంటుంది. ఇక త్రిపుర అన్నయ్య త్రిపుర వాళ్లతో ఏం చేసిఅయినా నేను ఈ పెళ్లి జరగనివ్వను ఆపుతాను అని అంటాడు. రమాదేవి కొడుకు మీద అరుస్తుంది. ఆ రౌడీని పెళ్లి చేసుకుంటే మా అక్క బతుకు బానిస బతుకు అవుతుందని అంటుంది గాయత్రీ. అలా ఏం కాదని రమాదేవి అంటే  ఆ గిరి ఎప్పటికీ మారడు అని గాయత్రీ అంటుంది. త్రిపురతో అన్నయ్య, చెల్లి ఇద్దరూ పెళ్లి వద్దని చెప్దామని త్రిపురని లాక్కెత్తారు. కానీ త్రిపుర మాత్రం ఏది ఏమైనా ఈ పెళ్లి జరుగుతుందని తేల్చేస్తుంది. అందరూ ఆశ్చర్యపడతారు.


ఇంతలో చప్పట్లు కొడుతూ రత్నమాల గిరిలు వస్తారు. నా కోడలు అదుర్స్ అని రత్నమాల అంటుంది. శుభలేఖలు మార్చుకోవడానికి వచ్చానని రత్నమాల అంటే మేం ఏం కార్డులు కొట్టించలేదని తాత అంటే నేను కొట్టించా అని రమాదేవి చెప్పి శుభలేఖలు తీసుకొస్తుంది. రత్నమాల తండ్రికి శుభలేఖ ఇచ్చి పుచ్చికుంటుంది. కార్డులో త్రిపుర పేరు పక్కన బీ టెక్ అని రాసి ఉండటం చూసిన గిరి ఏంటి అత్త అలా రాయించావ్ అంటే దానికి గాయత్రీ పిన్ని కార్డులో గిరి పేరు పక్కన పెద్ద రౌడీ అని రాయించని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!