Prema Entha Madhuram June 28th: ఎమోషనల్ డ్రామాతో మళ్ళీ వర్ధన్ ఫ్యామిలీలోకి వచ్చిన మాన్సీ.. తట్టుకోలేకపోతున్న నీరజ్?
కోర్టులో మాన్సీ తన ఎమోషనల్ డ్రామా తో కేసును మరోసారి వాయిదా వేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 28th: బోన్ లో నిలబడి ఉన్న ఆర్య అంజలి, నీరజ్ ల పెళ్లికి కారణాన్ని చెబుతాడు. కష్టాల్లో ఉన్న కంపెనీని రక్షించడానికి అంజలి నీరజ్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిలో ఎటువంటి సెల్ఫిష్నెస్ లేదు.. కేవలం ఆపద్ధర్మం, సాక్రిఫైజ్ మాత్రమే అంటాడు ఆర్య. దాంతో మాన్సీ తరఫున లాయర్ ఆపధర్మమని ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారా అని అంటాడు.
పైగా మాన్సీ కి విడాకులు ఇవ్వకముందుకు ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటాడు. దాంతో ఆర్య.. విడాకులు ఇవ్వలేదని ఎవరన్నారు.. తను విడాకుల డాక్యుమెంట్స్ పై సంతకం చేసి ఇచ్చింది అని కావాలంటే సాక్షానికి మా ఇంటి ఫుటేజ్ వీడియో చూడండి అని అనటంతో గతంలో మాన్సీ విడాకుల పేపర్ ఇచ్చినట్లుగా ఉంటుంది. దీంతో జడ్జ్ ఆ ఫుటేజ్ చూసి నమ్ముతాడు. దాంతో మాన్సీ నేను తొవ్వుకున్న గుంత లో తనే పడ్డాను అని అనుకుంటుంది భయపడుతూ కనిపిస్తుంది.
అంతేకాకుండా తాళిబొట్టుకు కూడా విలువ ఇవ్వలేదని.. దానిని కూడా నేలకేసింది అని చెప్పి ఆ వీడియో కూడా జడ్జికి చూపిస్తాడు. అందులో కూడా మాన్సీ ఇంట్లో వాళ్లని ఎదిరించి.. చేతిలో ఉన్న తాళిబొట్టు తీసి నీరజ్ వైపు పాడేస్తుంది. ఇక జడ్జ్ మాన్సీ అసలు రూపం తెలుసుకుంటాడు. ఇక ఆర్య ఎలాగైనా మా తమ్ముడికి మాన్సీ నుండి విడాకులు మంజూరు చేయాలని చెప్పి అక్కడినుండి వెళ్తాడు. ఇక మాన్సీ ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలి అని ఎమోషనల్ డ్రామా చేస్తుంది. చేసిన అన్యాయాన్ని కూడా న్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ మళ్లీ కథలు అన్నీ మాట్లాడుతుంది. ఇదంతా ఒక పెద్ద నాటకం అంటూ.. అంజలి గురించి కూడా ఏవేవో చెప్పేస్తుంది. దీంతో అంజలిని బోన్ లోకి పిలవడంతో మాన్సీ తరుపున లాయర్ అంజలిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.
ఇండియాకి ఎందుకు వచ్చావు అంటూ తన ప్రశ్నలతో అంజలిని ఇబ్బంది పెట్టేలా చేస్తుంటాడు. అక్కడ మాన్సీ మరోసారి ఎమోషనల్ డ్రామా ప్లే చేసి అంజలిని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నీరజ్ మాన్సీ పై కోప్పడతాడు. ఆ తర్వాత నీరజ్ బోన్ లోకి వచ్చి మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో వాదాలు ఉపవాదాలు జరిగాక ఈ కేసును మరింత బలమైన సాక్షాలతో తీసుకొని రమ్మని మరో వారానికి వాయిదా వేసి.. అప్పటివరకు మాన్సీ బాధ్యతలు వర్ధన్ ఫ్యామిలీ చూసుకోవాలి అని చెబుతాడు జడ్జ్.
ఇక నీరజ్ బయటికి ఆవేశంగా వచ్చి లోపల మాన్సీ చేసిన ఎమోషనల్ డ్రామాన్ని తట్టుకోలేక పోతాడు. ఇక అప్పుడే ఆర్య వాళ్ళు రావటంతో.. వెంటనే నీరజ్ ఆర్యతో.. అందుకే లోపలికి రావొద్దు అన్నాను అన్నయ్య.. దాంతో ఆర్య నా తమ్ముడు కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. దాంతో నీరజ్ తన అన్న ఆర్యను పట్టుకొని ఎమోషనల్ అవుతూ కనిపిస్తాడు. ఇదంతా అను దూరంగా ఉండి చూస్తూ బాధపడుతుంది.