Ramayan: 1980ల్లో దర్శకనిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం టీవీలో ప్రసారమై కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఆ మధ్య కరోనా సమయంలో మరోసారి ప్లే చేశారు కూడా. తాజాగా మరోసారి టీవీల్లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమవుతోంది రామానందసాగర్ రామాయణం. ఆదిపురుష్ అనే పౌరాణిక డ్రామా విపత్తు నుంచి 'నేషనల్ డిటాక్స్' కోసం రామానంద్ సాగర్ జీ రామాయణాన్ని తిరిగి ప్రసారం చేయాలన్న ఓ నెటిజన్ కోర్కె మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. అరుణ్ గోవిల్ - దీపికా చిక్లియా నటించిన రామాయణం జూలై 3 న సాయంత్రం 7:30 గంటలకు షో ప్రసారం ప్రారంభం కానుంది.
Also Read: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!
రామాయణం కథ ఆధారంగా రీసెంట్ గా తెరకెక్కిన ఆదిపురుష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరికి రాముని లుక్ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. ఇంకొందరు అభిమానులకు రావణుడి ఆహార్యంమే నచ్చలేదు. కొన్ని సన్నివేశాలపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామానందసాగర్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదన్నారు అరుణ్ గోవిల్. ఇక నెటిజన్ల విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడేశారు. ఇలాంటి టైమ్ లో ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అయింది. 'ఆదిపురుష్' అనే పౌరాణిక డ్రామా విపత్తు నుంచి 'నేషనల్ డిటాక్స్' కోసం రామానంద్ సాగర్ జీ రామాయణాన్ని తిరిగి ప్రసారం చేయడం ప్రారంభించాలి అని కోరాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. జూలై 3 సాయంత్రం 7:30 గంటలకు షో ప్రసారం ప్రారంభం కానుంది.
మేకర్స్ టీవీ షో నుంచి ఒక చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి... "ప్రపంచ ప్రఖ్యాత పౌరాణిక సీరియల్ రామాయణం అభిమానులందరి కోసం మా ప్రేక్షకుల కోసం తిరిగి వచ్చింది. జూలై 3, రాత్రి 7.30 నుంచి మీ ఇష్టమైన ఛానెల్ షెమరూలో చూడండి." అని పోస్ట పెట్టారు నిర్వాహకులు. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. ఆ మధ్య కరోనా సమయంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్‌లో పౌరాణిక ధారావాహికను తిరిగి ప్రసారం చేయమని కోరిన తర్వాత కూడా ప్రసారం అయింది. తాజాగా జూలై 3 సోమవారం నుంచి ఆదివారం వరకు రాత్రి 7:30 గంటలకు షెమరూ టీవీలో ప్లే కానుంది.
Also Read: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!
పౌరాణిక గాధల్ని ఇకపై తీయొద్దు- దీపిక చిక్లియా
దీపిక చిక్లియా ఇన్ స్టాలో ఇటీవల ఒక వీడియోను షేర్ చేసారు. నమస్కార్ నేను ఈ వీడియోను రూపొందించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ ఆదిపురుష్ గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. నేను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి దానిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడను. కానీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను. సంవత్సరాలుగా సినిమాలు లేదా టీవీ సీరియల్ లలో ఆధునిక రామాయణం అద్భుతంగా రూపొందింది. భారతీయులమైన మనకు రామాయణం మనదైన పౌరాణిక గాధ కాబట్టి ఇకపై రీమేక్ లు చేయడం మానేయాలని నేను భావిస్తున్నాను. అన్నది ఆ వీడియో సారాంశం . 'ఆదిపురుష్' పై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని రామానంద్ సాగర్ రామాయణం నటి దీపిక చిక్లియా ఇలా అన్నారు.