నటి సురేఖా వాణి (Surekha Vani) మోడ్రన్ మహిళ. ప్రజెంట్ సింగిల్ పేరెంట్. భర్త మరణం తర్వాత కుమార్తె సుప్రీతను ఒంటరిగా పెంచి పెద్ద చేస్తున్నారు. ఇంట్లో అమ్మాయితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అమ్మాయితో కలిసి ఆవిడ పార్టీలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు ఇప్పుడు ఆమెను విమర్శల్లోకి లాగాయి. వివాదాలకు కారణం అయ్యాయి. 


డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి (KP Chowdary) ఫోన్ నంబర్స్ లిస్టులో సురేఖా వాణి పేరు కూడా ఉండటంతో మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు బలంగా వినబడుతోంది. కుమార్తె సుప్రీత పుట్టినరోజు వేడుకల్లో సురేఖా వాణి చేసిన హంగామా చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలకు, తమకు సంబంధం లేదని ఆవిడ ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు. అందులోని మహిళ మాటలు వింటుంటే... సురేఖా వాణి మనసులో భావాలకు అద్దం పట్టేలా ఉన్నాయని చెప్పవచ్చు.


సంతోషంగా ఉన్నట్లు కాదు! 
పాజిటివ్ గా ఉంటున్నామంటే దాని అర్థం సంతోషంగా ఉన్నట్లు కాదు. ఎప్పుడూ జాలీగా ఉన్నట్లు కాదు. మనకు ఏదైనా సవాల్ ఎదురైనప్పుడు లేదంటే జీవితంలో ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పుడు... ముందు దానికి అంటూ ఓ కారణం ఉందని తెలుస్తుంది. ఆ కారణం ఏమిటనేది నాకు తెలియదు. పరిస్థితులను నేను ఆ విధంగా చూస్తాను. నేను ఎదుర్కొనే ప్రతి సవాలుకు ఓ కారణం ఉంటుందని నేను అనుకుంటాను. ఆ సవాల్ అధిగమించిన తర్వాత ఓ పాఠం నేర్చుకుంటాను - ఇదీ సురేఖా వాణి షేర్ చేసిన వీడియోలో మహిళ చెప్పిన మాటలు. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నట్టు లేవూ!?


కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తన పేరు రావడం వెనుక ఏదో ఒక కారణం ఉన్నట్లు సురేఖా వాణి భావిస్తున్నారేమో!? తప్పకుండా ఈ అడ్డంకులను అధిగమించి ముందు వెళతాననే ధైర్యం ఆమెలో కనబడుతోంది. 


దయచేసి ఆరోపణలు ఆపేయండి...
మాకు ఎటువంటి సంబంధం లేదు!
ఇంతకు ముందు విడుదల చేసిన వీడియోలో సురేఖా వాణి ''కొంత కాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మా మీద ఆరోపణలు చేయడం ఆపేయండి! మీరు చేస్తున్న ఆరోపణల వల్ల వృత్తిపరమైన జీవితం, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, కుటుంబాలు, ఆరోగ్యం... అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి'' అని పేర్కొన్నారు.


Also Read : సంక్రాంతి నుంచి వేసవికి 'ప్రాజెక్ట్ కె' - మొదటి రోజే 500 కోట్లు గ్యారెంటీ!


సురేఖా వాణితో పాటు డ్రగ్స్ కేసులో 'బిగ్ బాస్' ఫేమ్, జూనియర్ సమంతగా పేరు పొందిన అషు రెడ్డి, నటి జ్యోతి పేర్లు కూడా వచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ న్యూస్ ఛానళ్ళలో రావడం వల్ల ప్రతి సెకన్ ఓ ఫోన్ కాల్ వస్తుందని, తన నంబర్ బయట పెట్టిన ఛానళ్లపై కేసు వేస్తానని పేర్కొన్నారు. ఈ కేసులో కేవలం అమ్మాయిల ఫోటోలు మాత్రమే ఎందుకు వేస్తున్నారని, అబ్బాయిల ఫోటోలు ఎందుకు బయటకు రావడం లేదని జ్యోతి ప్రశ్నించారు. 


Also Read  కమెడియన్ కొడుకుతో హీరోయిన్ ప్రేమకథ - కలిసి నటించలేదు గానీ...


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial