హీరో హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కడం కొత్త ఏమీ కాదు. హిందీలో అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా, అజయ్ దేవగణ్ - కాజోల్, సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్, రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్... తమిళనాడుకు వెళితే అజిత్ - షాలిని, సూర్య - జ్యోతిక... తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగార్జున - అమల, రాజశేఖర్ - జీవిత, మహేష్ బాబు - నమ్రత దంపతులు కనిపిస్తారు. ఇప్పుడీ జాబితాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య, ప్రముఖ తమిళ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి చేరనున్నారు. 


ఎప్పుడు, ఎలా ప్రేమలో పడ్డారు?
సినిమా చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం సహజం. చిత్రీకరణలో ఒకరి అభిరుచి గురించి మరొకరికి తెలుస్తుంది. ఇష్టం ఏర్పడుతుంది. అయితే... ఐశ్వర్య, ఉమాపతి కలిసి నటించలేదు. మరి, ప్రేమలో ఎలా పడ్డారు? ఎప్పుడు కలిశారు? అంటే... అందుకు ఐశ్వర్య తండ్రి అర్జున్ కారణం అని చెప్పాలి. 


తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'కు అర్జున్ హోస్ట్ చేశారు. అందులో ఉమాపతి (Umapathy Thambi Ramaiah) ఓ కంటెస్టెంట్. తండ్రితో పాటు ఓసారి ఆ షో షూటింగుకు వెళ్లిన ఐశ్వర్యకు అబ్బాయి పరిచయం అయ్యారు. అక్కడ మొదలైన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్ని రోజులుగా ఇద్దరూ డేటింగ్ / సహ జీవనంలో ఉన్నారట!


ఆంజనేయ స్వామి గుడిలో కలిసిన కుటుంబాలు!
ఆంజనేయ స్వామికి అర్జున్ (Action King Arjun) భక్తుడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో ఆయన హనుమంతుడి పాత్ర చేశారు. అంతే కాదు... చెన్నైలో ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టించారు. విగ్రహావిష్కరణ రోజున అర్జున్, తంబి రామయ్య కుటుంబాలు కలిశాయి. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటంతో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాయి. ఐశ్వర్య, ఉమాపతి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.


మరి, పెళ్లి ఎప్పుడంటే...
ఐశ్వర్య, ఉమాపతి ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించింది. అయితే... పెళ్లి మాత్రం ఈ ఏడాది జరగడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని తమ ఇరువురి కుటుంబాలు నిర్ణయించినట్టు తంబి రామయ్య తెలిపారు. నవంబర్ 8న పెళ్లి తేదీ వెల్లడించనున్నట్లు ఆయన వివరించారు.


Also Read : అభిమాని మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్యామ్ మర్డర్ మిస్టరీ


ఇటు తంబి రామయ్య, అటు అర్జున్... ఇద్దరూ ఇండస్ట్రీలో ఉండటంతో వాళ్ళ పిల్లలు ఉమాపతి, ఐశ్వర్య సైతం నటనలోకి వచ్చారు. అయితే... ఇంకా ఇద్దరూ పూర్తి స్థాయిలో విజయాలు సాధించలేదు. 'అడగపట్టత్తు మగజనంగళయ్‌' సినిమాతో నటుడిగా ఉమాపతి వెండితెరపైకి తొలి అడుగు వేశారు. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేశారు. ఇప్పుడు తండ్రి తంబి రామయ్య, సముద్రఖని ప్రధాన తారాగణంగా 'రాజాకిళ్ళి' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  


విశాల్ హీరోగా నటించిన 'పట్టతు యానై'తో కథానాయికగా ఐశ్వర్య కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా తెలుగులో 'ధీరుడు'గా అనువాదం అయ్యింది. ఆ తర్వాత తండ్రి అర్జున్ దర్శకత్వంలో కన్నడ, తమిళ ద్విభాషా సినిమా 'ప్రేమ బరాహ' చేశారు. కుమార్తెను తెలుగుకు పరిచయం చేస్తూ... స్వీయ దర్శకత్వంలో అర్జున్ ఓ సినిమా స్టార్ట్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ఆ సినిమా ప్రారంభమైంది. తర్వాత అర్జున్, ఆయనకు మధ్య విబేధాలు రావడంతో సినిమా ఆగింది. 


Also Read : పవర్ స్టార్ లుంగీ లుక్ కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్... 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial