'ప్రాజెక్ట్ కె' సినిమా (Project K Movie) ఎప్పుడు విడుదల అవుతుంది? నిన్న మొన్నటి వరకు అయితే వచ్చే ఏడాది సంక్రాంతి (Pongal 2024 Release Pan India Movies) బరిలో నిలవడం ఖాయమని పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు అందరూ భావించారు. అయితే... అటువంటి ఆశలు పెట్టుకోకుండా ఉండటం మంచిది!


'ప్రాజెక్ట్ కె' విడుదల తేదీని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు గురూజీ కలయికలో రూపొందుతున్న 'గుంటూరు కారం' సహా కొన్ని సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకోవాలని చూస్తున్నాయి. అయితే... లోక నాయకుడు కమల్ హాసన్ తమ సినిమాలో నటిస్తున్నారని ప్రకటించిన వీడియోలో విడుదల తేదీ లేకపోవడంతో సందేహం కలిగింది. అది నిజమేనని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాటలను బట్టి అర్థం అవుతోంది.


మొదటి రోజే 500 కోట్లు వస్తాయి! - తమ్మారెడ్డి
'ప్రాజెక్ట్ కె' సినిమా తొలి రోజు 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. ఇటీవల ఆయన సినిమా చిత్రీకరణకు వెళ్లి వచ్చారు. ఆ సెట్స్, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న తీరు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. ''ప్రాజెక్ట్ కె' స్కేల్, కాస్టింగ్ చూస్తుంటే... ప్రపంచంలో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన వాటిలో హాలీవుడ్ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఉంటుందని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం ఫస్ట్ డే 500 కోట్లు వస్తాయి. నాకు ఉన్న సమాచారం ప్రకారం... 2024 వేసవికి సినిమా విడుదల అవుతుంది'' అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. 


కమల్ హాసన్ చేరికతో మరింత బలం!
భారతీయ చిత్రసీమలో హేమాహేమీలు అయినటువంటి నటీనటులు 'ప్రాజెక్ట్ కె'లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈతరం 'బాహుబలి' ఇందులో హీరో అయితే... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.


Also Read : పవర్ స్టార్ లుంగీ లుక్ కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్... 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్!


'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్నాళ్లుగా వినపడుతోంది. విలన్ అని సినిమా యూనిట్ చెప్పడం లేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని ఇటీవల కన్ఫర్మ్ చేసింది. ఇక, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఇందులో హీరోయిన్. దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


సంక్రాంతికి మిగతా సినిమాలు కర్చీఫ్ వేయొచ్చు!
సంక్రాంతి బరి నుంచి 'ప్రాజెక్ట్ కె' తప్పుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు మిగతా సినిమాలు కర్చీఫ్స్ వేసుకోవచ్చు. 'గుంటూరు కారం'తో పాటు మాస్ మహారాజ రవితేజ 'ఈగల్', కమల్ హాసన్ 'ఇండియన్ 2' వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటికి తోడు మరి కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


Also Read : కమెడియన్ కొడుకుతో హీరోయిన్ ప్రేమకథ - కలిసి నటించలేదు గానీ...


'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి అవుతాయని తెలిసింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial