గణపతి ఆలోచనలతో ఆనందంలో మునిగిపోతుంది విద్య. తన మనసుకు నచ్చినవాడితో పెళ్లి కుదిరిందని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఆలోచనల్లో పడి బట్టల్ని దండెంపై వెయ్యడానికి బదులు కింద పడేస్తూ ఉంటుంది. విద్యను గమనించిన లక్కీ ఆటపట్టిస్తుంది. అంతగా గణపతి మాస్టారును కలవాలనుంటే ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లమని సలహా ఇస్తుంది. విద్య వద్దని వారిస్తుండగానే గణపతికి ఫోన్ చేసి ‘ఏమాయె చేసావే’ సినిమా రీరిలీజ్ అయ్యిందనీ, మరో అరగంటలో శివ థియేటర్‌కి రమ్మని చెబుతుంది. ఆనందంతో బయలుదేరతాడు గణపతి. లక్కీ చేసిన పనికి కంగారు పడిపోతుంది విద్య. లక్కీ ఫోన్లో మాట్లాడుతుండగా విన్న పద్మ సినిమాకి వెళ్తున్నారా? అని నిలదీస్తుంది. సినిమాకు కాదు, సన్మానానికి అంటూ అబద్ధం చెబుతుంది లక్కీ. తను కూడా వస్తానంటూ బయలుదేరిన పద్మను నీళ్లపైపుతో మొత్తం తడిపేస్తుంది లక్కీ. చీర మార్చుకుని వస్తా, ఉండండి అని చెప్పిన పద్మ మాటలు లెక్క చెయ్యకుండా అత్త విద్యను తీసుకుని థియేటర్‌కు బయలుదేరుతుంది లక్కీ.
గణపతి థియేటర్ వద్ద విద్య రాకకోసం టికెట్లు తీసుకుని ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో లక్కీ, విద్య ఇద్దరూ ఆటోలో అక్కడికి చేరుకుంటారు. ముగ్గురూ కలిసి థియేటర్లోకి వెళ్లి సినిమా చూస్తూ ఉంటారు. లక్కీ, విద్య వెళ్లిపోయారని గమనించిన పద్మ ఎలాగైనా వాళ్లను పట్టుకుని ఆదినారాయణ ముందు నిలదీయాలని థియేటర్‌కి బయలుదేరుతుంది. విద్య, గణపతి కోసం థియేటర్ అంతా గాలిస్తుంది. తల్లి పద్మను చూసిన లక్కీ విద్య, గణపతిని హెచ్చరిస్తుంది. ముగ్గురూ పద్మ కంటపడకుండా దాక్కుంటారు. ఎలాగైనా తల్లిని థియేటర్ నుంచి బయటకు పంపించాలని అనుకున్న లక్కీ తన దగ్గరున్న జడపిన్నుతో పద్మ కాళ్లపై గుచ్చుతుంది. చీకట్లో ఎవరూ తెలియట్లేదు బయట నిల్చుంటే ఇంటర్వెల్లో కనిపెట్టొచ్చని బయటకు వెళ్తుంది పద్మ. లక్కీ ఇంటర్వెల్లో కూడా పద్మను తప్పుదోవ పట్టించి విద్య, గణపతిని కాపాడుతుంది.
Also Read: తులసి తాళి దొంగపాలు- తప్పు తెలుసుకున్న విక్రమ్, ఇంట్లో వాళ్ళని వణికించేశాడు
విఘ్నేష్‌తో పెళ్లి కుదిరిన విషయాన్ని తన ఫ్రెండ్‌కు చెప్పి బాధపడుతుంది శ్రీనిధి. అదే సమయానికి అక్కడికి వచ్చిన సుబ్బు.. విఘ్నేష్ తన అన్న అని, అస్సలు మంచివాడు కాదని చెబుతాడు. ఎలాగైనా తన అక్క పెళ్లి చెడగొట్టమని సుబ్బుని బతిమాలుతుంది నిధి. అలా అయితే తన సొంత అన్న గణపతికి అన్యాయం జరుగుతుందని చెబుతాడు సుబ్బు. అయినా తమ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ల పెళ్లి జరిగే అవకాశమే లేదని, ఒకవేళ జరిగేలా ఉన్నా తాను ఆపుతానంటూ మాటిస్తాడు. అందుకోసం తను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని నిధితో ఒప్పందం కుదుర్చుకుంటాడు సుబ్బు.
Also Read: అత్త మనసు గెలుచుకున్న కావ్య- స్వప్నని బయటకి పంపేందుకు ఐడియా ఇచ్చిన రుద్రాణి
అందులో భాగంగానే విద్య పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి మరోసారి కొడుకు మురళితో కలిసి గణపతి ఇంటికి వచ్చిన ఆదినారాయణను సుబ్బు నానామాటలు అని అవమానిస్తాడు. ఆదినారాయణ గణపతి, విద్యల పెళ్లికి ఒప్పుకున్నాడన్న విషయం తెలిసి ఆనందపడుతుంది పార్వతి. గణపతి ఇంట్లో జరిగిన అవమానానికి బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఆదినారాయణ. గణపతి ఇంట్లో విద్య సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలగడం లేదని వాపోతాడు. ఆ ఇంట్లో మనుషులంతా చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కోపంతో ఊగిపోతాడు మురళి. పదే పదే తనకోసం తండ్రి అవమానాల పాలు కావడంతో బాధపడుతుంది విద్య. కానీ ఆ ఇంట్లో మనుషులను సరైన దార్లో పెట్టే బాధ్యత ఆ ఇంటి కోడలిగా తనదేనని తండ్రికి నచ్చజెబుతుంది. గణపతితో పెళ్లి జరుగుతున్న ఆనందంలో ‘ఏమాయ చేశావే’ సినిమాలో జెస్సీ, కార్తిక్ స్థానాల్లో తనను, గణపతిని ఊహించుకుని మురిసిపోతుంది.